దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బుధవారం (డిసెంబర్ 30) బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పది గ్రాముల పసిడి రూ.50,000కు పైనే ఉంది. వెండి ఫ్యూచర్ మాత్రం స్వల్పంగా పెరిగింది. కిలో వెండి రూ.300కు పైగా ఎగిసింది. పసిడి ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో 6,200 వరకు తక్కువగా ఉండగా, వెండి జీవనకాల గరిష్టం రూ.79,000తో రూ.10వేల వరకు తక్కువగా ఉంది. 2020 క్యాలెండర్ ఏడాదిలో ఫ్యూచర్ మార్కెట్లో పసిడి రూ.50వేలకు కాస్త అటు ఇటుగా ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బంగారం స్థిరంగా
నేడు ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.6.00 (0.01%) పెరిగి రూ.50,045.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,179.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.50,179.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,857.00 వద్ద కనిష్టాన్ని తాకింది. పసిడి 50వేల పైకి చేరుకుంది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.6200 వరకు తక్కువగా ఉంది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.-37.00 (-0.07%) క్షీణించి రూ.50,092.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,218.00 వద్ద ప్రారంభమై, రూ.50,218.00వద్ద గరిష్టాన్ని, రూ.49,915.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి స్వల్ప పెరుగుదల
కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 343.00 (0.50%) పెరిగి రూ.68440.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,500.00 వద్ద ప్రారంభమై, రూ.68,999.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,060.00 వద్ద కనిష్టాన్ని తాకింది. గతవారం మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.67518.00 వద్ద క్లోజ్ అయింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ 296.00 (0.43%) పెరిగి రూ.69426.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,743.00 వద్ద ప్రారంభమై, రూ.69,800.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,353.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో జంప్
అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవల గోల్డ్ ఫ్యూచర్స్ 1900 డాలర్ల దిశగా సాగుతోంది. పసిడి నేడు స్వల్పంగా పెరిగింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 7.95(+0.42%)డాలర్లు పెరిగి 1,890.85 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,879.65 - 1,892.15 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 21.95%
శాతం పెరిగింది.
సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం క్షీణించింది. ఔన్స్ ధర +0.310 (+1.18%) డాలర్లు పెరిగి 25.627 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.262 - 26.648 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 44.97% పెరిగింది.
More From GoodReturns

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!



Click it and Unblock the Notifications