ఇక రైలు ప్రయాణీకులకు రెడీ టూ ఈట్ మీల్స్, రైళ్లలో ఆహార సేవలు

రైలు ప్రయాణీకులకు గుడ్‌న్యూస్. రైళ్లలో ప్రయాణీకులకు మంచి భోజనాన్ని అందించనుంది రైల్వే బోర్డు. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రైళ్లలో ప్యాంట్రీకార్లను ఎత్తివేశారు. ఇప్పుడు నెమ్మదిగా సడలింపులు ఇస్తున్నారు. కరోనా వ్యాప్తి తగ్గి ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఉపశమనంగా రైళ్లలో ప్యాంట్రీకార్లను వండి వేడివేడి భోజనాన్ని అందించేందుకు రైల్వేలు సిద్ధంగా ఉన్నాయి. రైల్వే ప్యాంట్రీకార్ల సర్వీసులు పునరుద్ధరించాలని రైల్వే బోర్డు ఇటీవల ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్‌ను కోరింది. ప్రయాణీకులకు రెడీ టు ఈట్ భోజనాన్ని అందిస్తామని తెలిపింది.

'సాధారణ రైలు సేవల పునరుద్ధరణ, ప్రయాణీకుల అవసరాలు, దేశవ్యాప్తంగా తినుబండారాలు, రెస్టారెంట్లు, హోటల్స్ తదితర ప్రాంతాల్లోను కరోనా లాక్ డౌన్ సడలింపు దృష్ట్యా రైల్వేలో కుక్డ్ ఫుడ్ సేవలను అందించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. రెడీ టూ ఈట్ మీల్స్ సర్వీస్ కూడా కొనసాగుతుంది' అని IRCTCకి పంపిన లేఖలో పేర్కొంది.

Indian Railways to resume serving cooked food in trains

ఇటీవలే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అన్ని డొమెస్టిక్ విమానాలలో మీల్స్ సేవలను పునరుద్ధరించింది. కరోనా కేసులు భారత్‌లో తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం కొద్ది నెలలుగా పలు నిబంధనలను సవరిస్తోంది. ఈ నెల ప్రారంభంలో అన్ని రైల్వే సేవలను పునరుద్ధరిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+