Income Tax: IT-టెక్కీలకు నిర్మలా సీతారామన్ షాక్.. రూ.66,300 కట్టాల్సిందే, మెలికె ఇదే..
Shock To Tax Payers: వాస్తవానికి నేడు చాలా కాలంగా ఎదురుచూసిన బడ్జెట్ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి చేశారు. ఈ క్రమంలో ఆమె వేతన జీవుల నుంచి మధ్యతరగతి వరకు ప్రజలపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు కనిపించింది. ఈ క్రమంలోనే ఆమె న్యూ టాక్స్ రీజిమ్ కింద పన్ను మినహాయింపు, కొత్త పన్ను శ్లాబ్ రేట్లకు సంబంధించిన అంశాలను ప్రకటించారు.
కొత్త పన్ను మినహాయింపు ప్రకటన..
న్యూ టాక్స్ రీజిమ్ కింద పన్ను రహిత ఆదాయ పరిమితిని రూ.12 లక్షల వరకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. గత బడ్జెట్ ప్రసంగం సమయంలో ఆర్థిక మంత్రి దీనిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. అలాగే అప్పట్లో ఆర్థిక మంత్రి స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. నిర్మలమ్మ వరాల జల్లుతో న్యూటాక్స్ రీజిమ్ కింద పన్ను చెల్లిస్తున్న ప్రజలకు గరిష్ఠంగా రూ.12.75 లక్షల వరకు ఉన్న ఆదాయంపై సున్న పన్ను ఉంటుందని వెల్లడించింది.

కొత్త పన్ను విధానంలో శ్లాబ్ రేట్లు..
న్యూ టాక్స్ రీజిమ్ కింద ఆర్థిక మంత్రి ప్రకటించిన కొత్త పన్ను శ్లాబ్ రేట్లు.. ముందుగా రూ.4 లక్షల వరకు ఉన్న ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దీని తర్వాత రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు 5 శాతం పన్ను రేటు, రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉన్న ఆదాయంపై 10 శాతం పన్ను, రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు ఆదాయంపై 15 శాతం ఆదాయపు పన్ను, రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఆదాయంపై 20 శాతం పన్ను, రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు ఆదాయంపై 25 శాతం పన్ను రేటును నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక చివరిగా రూ.24 లక్షలకు పైన ఉండే ఆదాయంపై పన్ను చెల్లింపుదారులు 30 శాతం పన్ను చెల్లించాలని నిర్మలమ్మ ప్రకటించారు.
పన్ను చెల్లింపుదారులకు షాక్..
పైన పేర్కొన్న విధంగా రూ.12.75 లక్షల లోపు ఆదాయం వరకు వేతన జీవులు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ చాలా మంది ఆందోళన చెందుతున్న విషయం దీనిపైన ఆదాయం ఉంటే ఎలా అన్నదే. ఉదాహరణకు ఒక వ్యక్తి వార్షిక ఆదాయం రూ.13 లక్షలు ఉన్నట్లయితే వారు ఎంత పన్ను చెల్లించాలనే అనుమానం చాలా మందిలో ఉంది. వాస్తవంగా పన్ను మినహాయింపు ఉన్న పరిమితి కంటే ఇక్కడ కేవలం రూ.25 వేలు మాత్రమే ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ పన్ను లెక్కిస్తే రూ.66,300 టాక్స్ కట్టాల్సి ఉంటుందని తేలింది.
ఇక్కడ రూ.12.75 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి మధ్యతరగతి వ్యక్తి అవుతాడు. ఇదే సమయంలో రూ.13 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా ధనవంతుడిగా మారిపోతాడనే ప్రశ్నలు సోషల్ మీడియా వేధికగా వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications