ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా పేర్కొనే మీడియా రంగం ఇప్పుడు అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వల్ల సుదీర్ఘ లాక్ డౌన్ విధించారు. కానీ, నిత్యావసరాలకు దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే అత్యవసర సేవల్లో ఒకటిగా మీడియా కు ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. తమ ప్రాణాలను పణంగా పెట్టి వార్తా సేకరణలో విలేకరులు నిమగ్నమవుతున్నారు. ఎప్పటికప్పుడు తాజా వార్తలను ప్రజలకు చేరవేస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఫేక్ న్యూస్ లు ఎక్కువ అయిపోతున్న సమయంలో వాటిని పట్టించుకోవద్దు, మేమున్నాం మీకు నికార్సయిన, నిజమైన వార్తలను అందించటానికి అని భరోసా ఇస్తున్నారు జర్నలిస్టులు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రపంచం నలుమూలలకు సంబంధించిన అప్ డేట్స్ అందిస్తున్నారు. ఇలా మీడియా ప్రతినిధులు, సంస్థలు అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నా ... వారికి మాత్రం ఇబ్బందులే కానీ ప్రతిఫలం లభించటం లేదు. మీడియా సంస్థలు ప్రధానంగా ప్రకటనల ఆదాయంపైనే మనుగడ సాగిస్తాయి. ఇప్పుడు దేశంలో కొనసాగుతున్న లాక్ డౌన్ వల్ల ఆ ప్రకటనల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది.

50% పడిపోయిన ఆదాయం...
మాధ్యమం ఏదైనా ప్రధాన ఆదాయ వనరు మాత్రం ప్రకటనలే. కానీ, లాక్ డౌన్ పుణ్యమా అని మీడియా రంగానికి ప్రకటనల ఆదాయం భారీగా తగ్గిపోయింది. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ (ఐబీఎఫ్) అధికారిక అంచనా ప్రకారమే ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి ప్రకటనల ఆదాయం 50% తగ్గిపోయింది. ఈ విషయాన్ని ఐబీఎఫ్ ప్రెసిడెంట్ ఎన్ పీ సింగ్ వెల్లడించినట్లు ప్రముుఖ న్యూస్ ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒక కథనంలో పేర్కొంది. టీవీ షో ల ప్రొడక్షన్ నిలిచిపోవటం, ఐపీఎల్ వంటి భారీ స్థాయి ఈవెంట్లు రద్దు కావటం తో ప్రకటనల రాక మందగించింది. అదే సమయంలో ప్రకటనదారులు, ప్రకటనల ఏజెన్సీ ల నుంచి చెల్లింపులు కూడా ఆలస్యం అవుతున్నట్లు గుర్తించారు. ఈ పరిణామం మీడియా రంగాన్ని విపరీతంగా ప్రభావితం చేయబోతోంది. స్పష్టమైన గణాంకాలు అందుబాటులో లేకపోయినా... ప్రింట్ మీడియా పరిస్థితి కూడా దీనికి ఏమాత్రం భిన్నంగా లేదని చెప్పొచ్చు.

రూ 3 లక్షల కోట్ల మార్కెట్...
ప్రపంచంలోనే అతిపెద్ద మీడియా సంస్థలు, పేపర్లు మన దేశంలో ఉన్నాయి. ఇండియన్ రీడర్షిప్ సర్వే (ఐఆర్ఎస్) గణాంకాల ప్రకారం మన దేశంలో సుమారు 42.5 కోట్ల మంది ప్రతి నిత్యం పత్రికలు చదువుతున్నారు. మరో వైపు టెలివిజన్ రంగంలో కూడా దేశంలోని సుమారు 30 కోట్ల గృహాల్లో టెలివిజన్ సెట్లు ఉన్నాయి. ఇక మొబైల్ హ్యాండ్సెట్లు అయితే లెక్కే లేదు. దాదాపు 100 కోట్ల మంది మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. ఇందులో స్మార్ట్ ఫోన్ల వాటా సగానికి పైగానే ఉంది. దీంతో దేశంలో మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏటా 13.5% సగటు వృద్ధి రేటుతో ఈ రంగం 2024 నాటికి రూ 3.07 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఐబీఈఎఫ్ అంచనా. 2018-19 ఆర్థిక సంవత్సరంలో టెలివిజన్ రంగం ఆదాయం రూ 71,000 కోట్లుగా ఉంది. ప్రింట్ మీడియా ఆదాయం రూ 33,000 కోట్లు. డిజిటల్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగం కూడా వేగంగా విస్తరిస్తోంది. దేశంలో 3జి, 4జి సేవలు అందుబాటులో ఉండటంతో ఇంటర్నెట్, మొబైల్ డేటా వినియోగం బాగా వృద్ధి చెందుతున్నాయి.

కొత్త వ్యూహాలు సిద్ధం...
ఇప్పటి వరకు ఈ రంగం ఆకర్షణీయంగా ఉన్న మాట వాస్తవమే. కానీ కరోనా వైరస్ వల్ల అది ఒక్కసారిగా కుదేలవుతోంది. లాక్ డౌన్ తాత్కాలికమే. మహా ఐతే మరో నెల రోజులు ఉంటుందేమో.. కానీ మళ్ళీ ప్రకటనల ఆదాయాలు పుంజుకుంటాయా... మునుపటి వృద్ధి సాధ్యమవుతుందా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతోంది. ఎందుకంటే, కరోనా తో దేశంలో దాదాపు అన్ని రంగాలు కుదేలైపోయాయి. అవన్నీ సర్దుకుని, మళ్ళీ పట్టాలెక్కితే గానే ప్రకటలు పెరిగే అవకాశం లేదు. అందుకే, ఎలాంటి సందర్భాన్నైనా ఎదుర్కొనేందుకు మీడియా రంగ సంస్థలు కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగా వ్యయాలను కట్టడి చేసే మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ సంక్షోభ సమయంలో మీడియా రంగంలో విపరీతమైన మార్పులు, చేర్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అవేమిటో తెలియాలంటే మాత్రం మరో 3-6 నెలల సమయం పడుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం తమకు ఒక ఆర్థిక ఉద్దేపన పథకం అందించాలని మీడియా వర్గాలు కోరుతున్నాయి.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications