అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జోబిడెన్ విజయంపై భారత ఐటీ పరిశ్రమ స్పందించింది. ఆయన గెలుపును మన ఐటీ పరిశ్రమ స్వాగతిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలు, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో కొత్త అమెరికా పరిపాలనా విభాగంతో కలిసి పని చేస్తామని నాస్‌కాం ఆదివారం తెలిపింది. భారత ఐటీ పరిశ్రమకు అమెరికా అతిపెద్ద మార్కెట్. 'జోబిడెన్ గెలుపును నాస్‌కాం స్వాగతిస్తోంది. అతనితో, అతని పరిపాలనా విభాగంతో కలిసి పని చేసేందుకు సిద్ధం' అని ట్వీట్ చేసింది.

2 లక్షల కొత్త ఉద్యోగాలు
అమెరికా సరికొత్త పరిపాలనా యంత్రాంగంతో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నామని పరిశ్రమ సంఘం నాస్కాం తెలిపింది. అమెరికాలో సాంకేతికత, నైపుణ్యాలు, డిజిటల్ పరివర్తన కోసం బైడెన్ యంత్రాంగంతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఐటీ రంగ ఆదాయం 7.7 శాతం వృద్ధితో 191 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నాస్కాం అంచనా వేసింది. ఈ పరిశ్రమ నికరంగా 2 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించే అవకాశాలు ఉన్నాయని, అప్పుడు ఈ రంగంలో ఉద్యోగుల సంఖ్య 43.6 లక్షలకు చేరుకోవచ్చునని తెలిపింది.

హెచ్1బీపై ట్రంప్ నిర్ణయం.. జోబిడెన్ సానుకూలం
హెచ్1బీ వీసాలపై ట్రంప్ పరిపాలనా యంత్రాంగం నిర్ణయాల నేపథ్యంలో జోబిడెన్ ఏం చేస్తారనే ఆసక్తి అందరిలోను నెలకొంది. అయితే కఠిన నిర్ణయాలు ఉండవనే అభిప్రాయాలు అందరిలోను ఉన్నాయి. ఇరుదేశాల మధ్య పెట్టుబడుల ఒప్పందాలు, వాణిజ్యం పెరుగుతున్నాయని, ఆర్థిక వ్యవస్థల మధ్య విడదీయరాని అనుబంధం ఉందని, ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో కలిసి పని చేయాల్సిన అవసరం, ద్వైపాక్షిక ఆర్థిక ప్రణాళికను పునరుజ్జీవింపచేయడం ద్వారా ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల సృష్టి, చిన్న వ్యాపారాలకు ఊతమివ్వడం వంటివి కీలకం కానున్నాయని సీఐఐ అధ్యక్షులు ఉదయ్ కొటక్ అన్నారు. అమెరికా చరిత్రలో నాస్కాం సభ్యులకు ఓ చరిత్ర ఉందని తెలిపారు.

400 శాతం పెరిగిన ద్వైపాక్షిక వాణిజ్యం
అమెరికాలోని ఫార్చూన్ 500 కంపెనీలో మూడొంతుల కంపెనీలతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపింది. 2005 నుండి భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 400 శాతానికి పైగా పెరిగిందని, 2005లో 37 బిలియన్ డాలర్ల నుండి 2019 నాటికి 149 బిలియన్ డాలర్లకు చేరుకుందని, రెండు దేశాలు సాంకేతిక రంగంలో కీలక పాత్ర పోషించాయని నాస్కాం పేర్కొంది. జోబిడెన్, కమలా హారిస్ పాలనలో భారత్-అమెరికా సంబంధాలు మరింత బలోపంతే కావాలని అసోచోం సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ అన్నారు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications