ఇటీవల భారీగా ఉద్యోగులను తొలగించిన టీసీఎస్, ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో కాంట్రాక్టు ఉద్యోగాల కోసం, ఒక స్థానిక కంపెనీని నియమించి, నియామక ప్రక్రియను ఆ కంపెనీకి భాద్యతగా అప్పగించింది.

టీసీఎస్ CEO కృతివాసన్ ప్రకటించినట్టు "బిజినెస్‌తో ఆటోమేషన్‌ను సమన్వయం చేయాలంటే, కొన్ని ఉద్యోగాల్లో మార్పులు అవసరం" అని దాంతో దాదాపు 12,000 మంది ఉద్యోగులు (సుమారు 2% వర్క్‌ఫోర్స్) కంపెనీ నుంచి తొలగించబడ్డారు.
అయితే, మరోవైపు అమెరికాలో కాంట్రాక్టు ఉద్యోగాల కోసం పనిచేసే స్టాఫ్ వందర్స్ తో నేరుగా వ్యవహరించకుండా, Pontoon Services అనే అమెరికన్ సంస్థను మధ్యవర్తిగా పెట్టారు.
ఇప్పటివరకు అమెరికాలో ఉన్న ఉద్యోగాల ఏజెన్సీలు నేరుగా టీసీఎస్ HR బృందంతో మాట్లాడేవి. ఎవరిని ఎంపిక చేయాలా, ఇంటర్వ్యూలు ఎలా చేయాలా అనే విషయాల్లో వారు టీసీఎస్‌కి నేరుగా చెప్పేవారు. కానీ ఇప్పుడు నుంచి ఆ వ్యవస్థ మారిపోయింది. ఇకపై Pontoon అనే మధ్యవర్తి సంస్థే టీసీఎస్‌కి ఉద్యోగుల్ని పంపే ఏజెన్సీలతో సంబంధాలు కలిగి ఉంటుంది. ఏజెన్సీలు నేరుగా టీసీఎస్‌ను సంప్రదించలేరు.
టీసీఎస్‌కు అవసరమైన కాంట్రాక్ట్ స్థానాలు Pontoon ప్లాట్‌ఫామ్‌లో ఉంచబడతాయి. స్టాఫింగ్ ఏజెన్సీలు తమ అభ్యర్థుల వివరాలు Pontoonకి పంపుతాయి. పొంటూన్ మొదటి స్క్రీనింగ్ చేస్తుంది, ఫైనల్ ఎంపిక టీసీఎస్ చేస్తుంది.
ఇప్పటికే గత రెండు నెలలుగా Pontoonతోనే పని చేయాలనే నిబంధన అమల్లో ఉంది. కొన్ని స్టాఫింగ్ ఏజెన్సీలు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా, టీసీఎస్ మాత్రం ఈ మార్పు వల్ల నియామకాల్లో పారదర్శకత పెరుగుతుందంటోంది.
మరి ఫుల్‌టైమ్ ఉద్యోగాలు మాత్రం ఎప్పటిలాగే ఉంటాయి అని అంటున్నారు. టీసీఎస్ ఇప్పటికీ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, ఇంటర్నల్ HR ద్వారా ఫుల్‌టైమ్ ఉద్యోగులను నియమిస్తోంది. ఈ కొత్త విధానం కేవలం కాంట్రాక్ట్ స్థానాలు కోసం మాత్రమే.
కాంట్రాక్ట్ ఉద్యోగులు సాధారణంగా ఒక సంవత్సరం వరకు పనిచేస్తారు. వారు వెండర్ పేరోల్లో ఉంటారు. ఒక్కో నియామకం వెనుక ఏజెన్సీకి రూ 30,000 నుంచి రూ 1 లక్ష వరకు ఫీజు లభిస్తుంది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) అమెరికాలో చేసిన ఈ నియామక మార్పులు ఇప్పుడు ఇతర దేశాల్లో కూడా అమలు అవుతాయా? అనే ప్రశ్నలు మార్కెట్‌లో వినిపిస్తున్నాయి. Pontoon వంటి మద్యవర్తి సంస్థ ద్వారా నియామక ప్రక్రియను నిర్వహించడం వెనుక అసలు ఉద్దేశ్యం ఖర్చులు తగ్గించడమేనా లేక నియామక ప్రక్రియను మరింత ప్రమాణబద్ధంగా, పారదర్శకంగా మార్చడమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను తొలగించిన నేపథ్యంలో, ఈ కొత్త విధానం ఉద్యోగులలో భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఒకవైపు ఖర్చులు కుదించడం లక్ష్యంగా ఉన్నా, మరోవైపు కంపెనీ దృష్టిలో ఇది వ్యూహాత్మకంగా వ్యవస్థను బలపరిచే మార్గంగా ఉండవచ్చు.
ఒకవైపు ఉద్యోగాల తొలగింపు, మరోవైపు కొత్త రూల్స్‌తో ఉద్యోగుల ఎంపిక ఇవన్నీ చూసిన వాళ్లకి ఇది పెద్ద మార్పులానే అనిపించొచ్చు. కానీ టీసీఎస్ దృష్టిలో ఇవన్నీ వ్యాపారాన్ని మెరుగుపరచడానికే ప్లాన్ చేసిన నిర్ణయాలు.
ఈ విధంగా, కంపెనీ భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా మానవ వనరుల నిర్వహణను మలుచుకుంటోంది. ఇది ఉద్యోగులకూ, ఏజెన్సీలకూ ఒక సవాల్ అయినప్పటికీ, ఉద్యోగ మార్కెట్ వాస్తవతను ప్రతిబింబిస్తోంది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications