IT News: ఇళ్ల నుంచి ఆఫీసులకు ససేమిరా రామంటున్న ఐటీ ఉద్యోగులకు తాయిలాలు ప్రకటించాయి ఐటీ కంపెనీలు. ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ పూర్తిగా తొలగిద్దామని ప్లాన్ చేసినప్పటికీ అందుకు అందరూ అంగీకరించలేదు. దీనిపై కంపెనీలు అనేక అంతర్గత సర్వేలు చేపట్టాయి కూడా.

హైబ్రిడ్ విధానం..
కరోనా తర్వాత ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల పనితీరు వాతావరణం చాలా మారిపోయింది. ఈ క్రమంలో కంపెనీలు కొన్ని రోజులైనా వారిని ఆఫీసులకు తీసుకురావాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా వారికి ఫ్లేక్సిబిలిటీని అందిస్తూ హ్రైబ్రిడ్ వర్క్ విధానాన్ని మేళవించాయి. మెుదట్లో దీనిని సైతం చాలా మంది వ్యతిరేకించినప్పటికీ అన్ని దిగ్గజ కంపెనీలూ ఇదే బాటలో పయనించటంతో ఉద్యోగులు మాట వినటం ప్రారంభించారు.

మూన్ లైటింగ్..
కరోనా సమయంలో కంపెనీలు అందించిన వర్క్ ఫ్రమ్ హోన్ విధానాన్ని చాలా మంది ఉద్యోగులు దుర్వినియోగం చేసినట్లు కంపెనీలు గుర్తించాయి. ఆ కాలంలో ఒక కంపెనీకి తెలియకుండా మరో కంపెనీలో పనిచేయటం ప్రారంభించారు. ఇది కంపెనీల వ్యాపారానికి, ప్రాజెక్టుల భద్రతకు అతిపెద్ద ముప్పుగా మారినట్లు ఐటీ పరిశ్రమ గ్రహించింది. దీంతో చాలా కంపెనీలు అలాంటి ఉద్యోగులను గుర్తించి తొలగించటం ప్రారంభించాయి.

సాంకేతికత వినియోగం..
ఈ క్రమంలో ప్రస్తుతం ఆఫీసులకు రాని ఉద్యోగులను ట్రాక్ చేసే పనిలో పడ్డాయి కంపెనీలు. వారు ఏ లొకేషన్ నుంచి పనిచేస్తున్నారో గుర్తించే పనిలో ఉన్నట్లు నివేదికలు ఉన్నాయి. ఇది కంపెనీలకు అట్రిషన్ రేటు తగ్గించటంతో పాటు రెండు ఉద్యోగాల దోహణిని అరికట్టేందుకు ఉపయోగపడుతుందని చాలా కంపెనీలు భావిస్తున్నాయి. పైగా టెక్నాలజీ ద్వారా ఉద్యోగులను పర్యవేక్షించటం ద్వారా ఉత్పాదకత పెరుగుతుందని టెక్ కంపెనీలు భావిస్తున్నట్లు సమాచారం.

శాటిలైట్ వినియోగం..
తాజా టెక్నికల్ పర్యవేక్షణలో భాగంగా ఉద్యోగులు ఎక్కడ ఉన్నా.. నేరుగా శాటిలైట్ ద్వారా కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతారని నిపుణులు చెబుతున్నారు. దీని ద్వారా ఉద్యోగులు అనుమతించబడిన చోట మాత్రమే పనిచేస్తున్నారా? అనే విషయాలను కంపెనీలు గుర్తిస్తాయని సమాచారం. కస్టమర్లను ఏ సమయంలో, ఎంతసేపు సేవలు అందిస్తున్నారనే దానిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక యాప్ లను సైతం కంపెనీలు వినియోగించే పనిలో ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి

వ్యక్తిగత స్వేచ్ఛ..
అయితే కంపెనీలు చేపట్టనున్న ట్రాకింగ్ విధానం వల్ల.. ఉద్యోగులు వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోయే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. కంపెనీలు ఎప్పుడైనా ట్రాక్ చేయాలనుకునే ఫీచర్ గురించి చాలా మంది ఉద్యోగులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతంగా ఉంటుందని వారు అంటున్నారు. కంపెనీలు మాత్రం పోటీ ప్రపంచంలో, మాంద్యం మధ్య తగ్గిన వ్యాపార లాభాలతో సతమతమవుతూనే ఉత్పాదకతను పెంచేందుకు టెక్నాలజీని వినియోగించాలని నిర్ణయించాయి.
More From GoodReturns

Layoffs: ఒరాకిల్ లేఆఫ్స్: ఒక్క రోజే 30 వేల మంది ఇంటికి! అసలు కారణం ఇదే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications