డోనాల్డ్ ట్రంప్. ఈ పేరు వింటేనే ప్రపంచ వ్యాప్తంగా ఒక హడల్. యుద్ధాలు చేయడానికైనా... వలసలు ఆపడానికైనా అయన ఎంతకైనా తెగిస్తారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఐన తర్వాత ఇండియా పై చాలా ప్రభావం పడింది. ముఖ్యంగా మన దేశం నుంచి అమెరికా కు వలస వెళ్లే నిపుణుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో మన వారి డాలర్ డ్రీమ్స్ లో ట్రంప్ విలన్ గా మారిపోతున్నారు. అంతక్రితం మన దేశం నుంచి ఉన్నత చదువుల కోసం ఎంత మంది వెళతారో, అదే స్థాయిలో ఉద్యోగాల కోసం వెళ్లేవారు. చదువు పూర్తయిన తర్వాత ఇక అమెరికా లోనే ఉద్యోగం చూసుకుని సెటిల్ ఐపోయేవారు.
కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉద్యోగాల కొరకు వెళుతున్న వారి మాట అలా ఉంచితే... చదువుకున్న వారిని కూడా మళ్ళీ సొంత దేశాలకు వెళ్లిపోయేలా చట్టాలు చేస్తున్నారు. ఇక ఉద్యోగుల భార్యలు అక్కడ ఉద్యోగాలు చేయకుండా నిరోధించే ప్రయత్నం జరుగుతోంది. ఈ కఠినతర నిబంధనల వల్ల అమెరికా వెళ్లాలనుకునే వారు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా నుంచి 2016 - 2018 మధ్య కాలంలో అమెరికా వెళ్లిన వారి సంఖ్య భారీగా పడిపోయింది.

7.5% డ్రాప్...
అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న వలసదారుల విధానాల వళ్ళ 2016 నుంచి ఆ దేశానికి వస్తున్న వారి సంఖ్య తగ్గిపోతోంది. ఒక్క భారత దేశం నుంచే 2016 నుంచి 2018 మధ్య కాలంలో చట్ట బద్ధంగా అమెరికాకు వలస వెళ్లేవారి సంఖ్య 7.5% పడిపోయింది. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ అనే సంస్థ ఈ గణాంకాలను వెల్లడించింది. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) గణాంకాలను విశ్లేషించి మరీ ఈ విషయాన్నీ చెబుతున్నట్లు ఫౌండేషన్ పేర్కొంది. దాని విశ్లేషణ ప్రకారం అన్ని దేశాలకు సంబంధించిన చట్ట బద్ధమైన వలసదారుల సంఖ్య కూడా 7.3% తగ్గిపోవటం విశేషం.

ఇండియన్స్ కు తగ్గిన గ్రీన్ కార్డ్స్...
ఉద్యోగం కోసం అమెరికా వెళ్లి, అక్కడ పెర్మనెంట్ గా నివసించేందుకు ఉద్దేశించిన గ్రీన్ కార్డుల జారీ తగ్గిపోతోంది. 2016 లో భారతీయులకు 64,687 గ్రీన్ కార్డులు మంజూరు కాగా, ఆ సంఖ్య 2018 లో 59,821 కి పడిపోయింది. ఇందులో కూడా ఉద్యోగుల సమీప బంధువులకు ఇచ్చే గ్రీన్ కార్డులను మరింత తగ్గించేశారు. ఈ విభాగంలో ఏకంగా 15% గ్రీన్ కార్డులు తగ్గిపోయి కేవలం 20,652 కు పరిమితం అయ్యాయి. మొత్తంగా చూసినా కూడా గ్రీన్ కార్డుల సంఖ్య 11,83,505 నుంచి 10,96,611 కు తగ్గిపోయింది. అంటే, సుమారు 86,874 గ్రీన్ కార్డుల జారీ తగ్గించారు. ఇటీవల ఇండియా లోని అమెరికా కాన్సులెట్ల వద్ద వీసాలు పెద్ద సంఖ్యలో పెండింగ్ లో ఉంటున్నాయి. తనిఖీలు విస్తృతం అయ్యాయి. వీసాల జారీకి ఇమ్మిగ్రెంట్స్ అధిక సమయం వేచి చూడాల్సి వస్తోంది.

మరింత కఠినం...
ఇప్పటికే పరిస్థితి ఇలా ఉంటే... ఈ మధ్య కాలంలో ట్రంప్ మరో కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. ఉద్యోగుల డిపెండెంట్లు, ఇన్సూరెన్సు సహా ఇతర ప్రభుత్వ పథకాలపై ఆధారపడితే వారికి కూడా గ్రీన్ కార్డు మంజూరు చేయకూడని నిర్ణయించారు. అయితే, దీనిపై కోర్టులు స్టే ఇచ్చాయి. కానీ ఈ నిబంధన కూడా అమల్లోకి వస్తే... ఇకపై వలసదారులు అమెరికా వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి నిర్ణయాలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా ఇబ్బంది కరంగా పరిణమిస్తాయని ఫౌండేషన్ పేర్కొంది.
More From GoodReturns

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications