Netflix News: అమెరికాకు చెందిన నెట్‌ఫ్లిక్స్ భారతదేశంలో సైతం తన స్ట్రీమింగ్ సేవలను అందిస్తోంది. అయితే కంపెనీ ఇక్కడ పొందుతున్న ఆదాయాలపై పన్ను విధించాలని భారతదేశం కోరుతోంది. డ్రాఫ్ట్ ఆర్డర్‌లో పన్ను అధికారులు 2021-22కి సుమారు రూ. 5.50 కోట్లు ఆదాయాన్ని ఆపాదించినట్లు నివేదిక జోడించింది.
అమెరికాకు చెందిన స్ట్రీమింగ్ సంస్థ భారత్ లో సేవలను కొనసాగించేందుకు మద్దతుగా మాతృ సంస్థ సెకండ్‌మెంట్‌లో కోసం20120 కొంత మంది ఉద్యోగులను, మౌలిక సదుపాయాలను ఇండియాలో ఏర్పాటు చేసింది. ఇది కంపెనీ శాశ్వత స్టాపన కిందకు వస్తుందని, పన్ను బాధ్యతకు దారితీస్తుందని ఆదాయపుపన్ను అధికారులు చెబుతున్నారు.

వినియోగదారులకు ఎలక్ట్రానిక్ కామర్స్ సేవలను అందించే ఓవర్సీస్ డిజిటల్ కంపెనీలపై పన్ను విధించడం ఇదే తొలిసారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు నెట్‌ఫ్లిక్స్ స్పందించలేదు. ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 2016లో కంపెనీ ఇండియాలో తన సేవలను ప్రారంభించగా.. ప్రస్తుతం దానికి 60 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు.
నెట్‌ఫ్లిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్ ఇండియా FY21లో రూ.1,529.36 కోట్ల స్థూల ఆదాయ టోఫ్లర్ నివేదించింది. వినియోగదారుల స్టీమింగ్ సమయం గతంలో కంటే 30 శాతం పెరిగినట్లు నెట్‌ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, కంటెంట్, మోనికా షెర్గిల్ ఇటీవల వెల్లడించారు. అలాగే ఆదాయం సైతం 25 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications