కరోనా దెబ్బ: చైనా నుంచి ఫార్మా దిగుమతులు తగ్గించనున్న ఇండియా!

చైనా లో మొదలైన అతి భయంకరమైన కరోనా వైరస్... భారత్ కు కొన్ని పాఠాలను నేర్పింది. దీంతో ఔషధాల తయారీ, ముడి ఔషధాల దిగుమతులపై చైనా పై ఆధారపడటం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే ఫార్మా ఉత్పత్తి, ఎగుమతుల్లో ఇండియా ముందున్నప్పటికీ.. మన దేశం ఇప్పటికి కొన్ని రకాల ఔషధాల ముడి పదార్థాలు (ఏపీఐ) చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఒక్క మన దేశం మాత్రమే కాదు... ప్రపంచ దేశాలన్నీ కూడా ఫార్మా ఏపీఐ ల కోసం చైనా పైనే ఆధారపడతాయి.

కానీ, ఇటీవల చైనా లోని హుబెయి ప్రావిన్స్ లోని వుహాన్ నగరంలో కరోనా బయటపడింది. ఆ ప్రాంతం మొత్తం ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల కేంద్రం కావటం గమనార్హం. ఒక్క ఫార్మా అని కాదు కానీ తయారీ రంగానికి కూడా ఆ ప్రావిన్స్ చాలా కీలకమైన ప్రాంతం. దీంతో ఇప్పుడు భారత్ ఈ అంశంపై పునరాలోచనలో పడింది. ప్రాణాధారమైన ఔషధాల తయారీ లో వినియోగించే ముడి పదార్థాలు ఏదేని కారణం చేత సరఫరా నిలిచిపోతే ఎంతటి విపత్కర పరిస్థితి ఉంటుందో ప్రస్తుతం కరోనా వైరస్ తో బహిర్గతమైంది. దీంతో దిద్దుబాటు చర్యలపై భారత ప్రభుత్వం దృష్టి సారించింది.

రూ 25,000 కోట్ల దిగుమతులు..

రూ 25,000 కోట్ల దిగుమతులు..

ప్రస్తుతం భారత ఫార్మా కంపెనీలు బల్క్ డ్రగ్స్ తయారీ కి అవసరమైన ముడి పదార్థాలను చైనా నుంచే అధికంగా దిగుమతి చేసుకుంటున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మన కంపెనీలు చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఏపీఐ ల విలువ రూ 25,000 కోట్లుగా తేలింది. ఇది మన దేశం మొత్తంగా దిగుమతి చేసుకునే ఫార్మా ఉత్పత్తుల్లో 70% నికి సమానం కావటం గమనార్హం. గత నాలుగేళ్లలో చైనా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తుల విలువ దాదాపు 30% పెరిగింది. తక్కువ ధరకే ఎంత సరుకు అయినా సప్లై చేయగలిగే సామర్థ్యం ఉండటంతో మన దేశ కంపెనీలు చైనా నుంచి దిగుమతులకు మొగ్గు చూపుతున్నాయి. అదే ముడి సరుకులను దేశీయంగా ఉత్పత్తి చేస్తే ఖర్చులు పెరిగే అవకాశం ఉండటం కూడా ఒక కారణమే. కరోనా వైరస్ కారణంగా గత రెండు నెలలుగా చైనా నుంచి ఫార్మా దిగుమతులు నిలిచిపోయాయి. మరో రెండు నెలలు పరిస్థితి ఇలాగే కొనసాగితే... మన కంపెనీల ఉత్పత్తి నిలిపివేయాల్సి ఉంటుంది.

రూ 13,000 కోట్ల ప్యాకేజీ...

రూ 13,000 కోట్ల ప్యాకేజీ...

దేశంలో అతి కీలకమైన బల్క్ డ్రగ్స్ తయారు చేసేందుకు, అలాగే చైనా వంటి దేశాలపై ఆయా ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం దేశీయ ఫార్మా రంగానికి ఒక ఆర్థిక ప్యాకేజీ ని ప్రకటించింది. రూ 13,000 కోట్ల తో దీనిని ఏర్పాటు చేశారు. దేశీయంగా తయారీ మౌలిక సదుపాయాలను మెరుగు పరచుకునేందుకు ఈ నిధులను అందించనుంది. బల్క డ్రగ్స్ తో పాటు మెడికల్ డివైసెస్ తయారీకి కూడా ప్రోత్సాహం అందిస్తుంది. దీంతో దేశీయంగా ఈ రంగాల్లో ఇప్పటికే తయారీ ప్లాంట్లు ఉన్న కంపెనీల తో పాటు, కొత్తగా ఈ రంగంలోకి ప్రవేశించే కంపెనీలకు కూడా వెసులుబాటు లభిస్తుంది. దేశీయంగా ఉత్పత్తి పెరిగితే అది మన దేశ అవసరాలకు పోను ఎగుమతి చేసే వీలు కూడా కలుగుతుంది.

హైదరాబాద్ కు అనుకూలం...

హైదరాబాద్ కు అనుకూలం...

ప్రపంచంలోనే భారత ఫార్మా పరిశ్రమ ఐదో అతి పెద్ద పరిశ్రమగా నిలుస్తోంది. మొత్తం ప్రపంచ ఔషధాల్లో ఐదో వంతు మన దేశమే సరఫరా చేస్తుంది. మన పరిశ్రమ పరిమాణం రూ 2 లక్షల కోట్లకు పైగానే ఉంటుంది. ఏటా రూ 1 లక్ష కోట్లకు పైగా ఎగుమతులు జరుగుతుండగా.. దాదాపు అదే పరిమాణంలో మన దేశీయ ఔషధ మార్కెట్ ఉంటుంది. అయితే, హైదరాబాద్ దేశంలోని ఫార్మా రంగానికి రాజధానిగా వర్ధిల్లుతోంది. మొత్తం దేశీయ ఫార్మా రంగంలో సుమారు 30% వాటా కలిగి ఉండటంతో ప్రపంచ ఫార్మా పటంలో హైదరాబాద్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, అరోబిందో ఫార్మా, దివీస్ లాబొరేటరీస్, లారెస్ లాబ్స్, నాట్కో ఫార్మా, గ్రాన్యూల్స్ ఇండియా వంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడవే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ తో మన కంపెనీలు అధికంగా లబ్ది పొందే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తుండటంతో అక్కడ నెలకొల్పే అనేక పరిశ్రమలు కూడా ఈ ప్యాకేజీ తో లబ్ది పొంది చైనా నుంచి దిగుమతులను తగ్గించేందుకు దోహదపడనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+