బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి, గ్లోబల్ మార్కెట్ నష్టాలు, భారత మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షిత బంగారం దిశగా దృష్టి సారించారు. ఈ రోజు ఉదయంతొలుత ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్ళాయి. ఆ తర్వాత లాభాల్లోకి వచ్చినప్పటికీ స్వల్పమే. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తమ పోర్ట్‌పోలియోలో పసిటికి కేటాయిస్తున్నారు. ఈ రోజు బంగారం రికార్డ్ ధర రూ.50,000కు చేరువైంది.

బంగారం వైపు మొగ్గు ఎందుకు
ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్ మళ్లీ నష్టపోతోందని, కరోనా వైరస్ రెండోసారి విజృంభిస్తుందనే భయాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో డొమెస్టిక్ మార్కెట్లో బంగారం ధర 10గ్రాములు రూ.50,000 రికార్డ్ ధరను దాటిందని చెప్తున్నారు. బంగారం ధరలు మన దేశంలో ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయని చెబుతున్నారు. రూపాయి బలహీనపడటం కూడా బంగారం ధరపై ప్రభావం చూపిందని అంటున్నారు. అమెరికా ఆర్థిక దృక్పథం బలహీనంగా ఉంటుందనే ఆందోళనలు కూడా ఉన్నాయి.

ఢిల్లీలో రూ.51,000కు చేరుకోవచ్చు
ఢిల్లీ మార్కెట్లో బంగారం ధర 10 గ్రాములు రూ.50,405 పలికి 50వేల మార్క్ దాటింది. సమీప భవిష్యత్తులో బంగారం ధర ఎలా ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో మాత్రం ప్రయోజనం ఉంటుందని, మంచి రిటర్న్స్ ఇస్తుందని ఇన్వెస్టర్లు ధీమాగా ఉన్నారు. దీంతో ప్రస్తుత ఆందోళనకర పరిస్థితుల్లో పసిడి వైపు చూస్తున్నారు. బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశముందని, ఢిల్లీలో త్వరలోనే రూ.51,000కు చేరుకోవచ్చునని చెబుతున్నారు.

ఎంసీఎక్స్‌లో రూ.49,000కు చేరువలో
మల్టీ కమోడిటీ మార్కెట్‌తో పోలిస్తే ఢిల్లీ మార్కెట్లో బంగారం ధరలు రూ.1800 నుండి రూ.2000 వరకు తేడా ఉంటుందని చెబుతున్నారు. ఈ వారాంతానికి ఎంసీఎక్స్‌లో బంగారం ధర రూ.49,000కు చేరుకునే అవకాశముందని, అప్పుడు ఢిల్లీలో రూ.51,000 మార్క్‌కు చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారు. ఎంసీఎక్స్‌లో బంగారం ధరలు తొలుత నిన్నటి కంటే 0.12 శాతం తగ్గి రూ.48,074 పలికింది. అంతకుముందు సెషన్‌లో బంగారం ధర రూ.48,589తో ఎంసీఎక్స్‌లో రికార్డ్ ధర పలికింది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. స్పాట్ గోల్డ్ ధర 0.2 శాతం ఎగిసి ఔన్స్ 1,764.20 డాలర్లు పలికింది. అంతకుముందు సెషన్‌లో 1,779.06 డాలర్లు తాగి ఎనిమిదేళ్ల గరిష్టాన్ని తాకింది. ఇతర మెటల్స్ విషయానికి వస్తే ప్లాటినమ్ 0.2 శాతం ఎగిసి ఔన్స్ 801.43 డాలర్లు, సిల్వర్ 0.2 శాతం పెరిగి ఔన్స్ 17.56 డాలర్లు పలికింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications