forex: ఒక దేశం ఆర్థిక స్థిరత్వానికి వారి దగ్గరున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలే కొలమానాలుగా భావించవచ్చు. పొరుగునున్న శ్రీలంక, పాకిస్థాన్ లో ఇవి అడుగంటడం కారణంగానే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. విదేశాల నుంచి దిగుమతులు చేసుకోలేక సతమతమవుతున్నాయి. ఇప్పుడు భారత్ లోని ఈ ఫారెక్స్ నిల్వలు దాదాపు ఏడాది కనిష్ఠానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

అతిపెద్ద వారాంతపు క్షీణత
ఫిబ్రవరి 10 నాటికి భారత విదేశీ మారక నిల్వలు 8.3 శాతం మేర పడిపోయినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం తెలిపింది. 8.31 బిలియన్ డాలర్లు తగ్గి, ప్రస్తుతానికి 566.94 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు అందుబాటులో ఉన్నట్లు ప్రకటించింది. గత 11 నెలల్లో ఇదే అతిపెద్ద వారాంతపు క్షీణత కావడం కలవరపెడుతోంది.

అంతర్జాతీయ ఒత్తిళ్ల వల్లే..
అంతకు ముందు వారం ఫిబ్రవరి 3 నాటికి ఫారెక్స్ నిల్వలు 1.49 బిలియన్ డాలర్లు తగ్గి 575.27కు చేరాయి. అక్టోబర్ 2021లో 645 బిలియన్ డాలర్లతో ఆల్ టైం గరిష్ఠ స్థాయికి వెళ్లాయి. అనంతరం ప్రపంచ పరిణామాల్లో ఏర్పడిన ఒత్తిళ్ల మధ్య రూపాయి విలువలో క్షీణత నమోదవుతూ వస్తోంది. దానిని రక్షించడానికి కేంద్ర బ్యాంకు చేస్తున్న ప్రయత్నాల వల్ల ఈ తగ్గుదల ఏర్పడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

బంగారం, రూపాయి విలువలోనూ..
భారత విదేశీ కరెన్సీ ఆస్తులు (FCA) సైతం 7.11 బిలియన్ డాలర్లు తగ్గి 500.59 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. బంగారం నిల్వల్లో కూడా 919 మిలియన్ డాలర్ల మేర తగ్గుదల నమోదైంది. తద్వారా దాని విలువ 42.86 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
వరుసగా నాల్గవ వారం సైతం రూపాయి విలువ క్షీణించింది. అయితే నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్ (NDF) మార్కెట్‌లో RBI జోక్యంతో కీలక దిగువ స్థాయికి బలహీనపడలేదు. కానీ ఆసియాలోని ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి నష్టం తక్కువగానే ఉంది.

ఫారెక్స్ పరిమాణం సౌకర్యవంతమే
దేశీయ ఫారెక్స్ నిల్వల పరిమాణం సౌకర్యవంతంగానే ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఇటీవల ప్రకటించారు. గతేడాది అక్టోబరు 21 నాటికి 524 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం ఉండగా, జనవరి 13 నాటికి 572 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు వెల్లడించారు.
భారత రుణాలు సైతం అంతర్జాతీయ ప్రమాణాల కంటే తక్కువే ఉన్నట్లు చెప్పారు. మూలధన ప్రవాహాలను నియంత్రించడానికి, దేశీయ కరెన్సీని అతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

అనిశ్చితి ఉన్నా స్థిరపడింది
రూపాయి విలువ క్షీణిస్తూనే ఉన్నా, ప్రస్తుతం నెలకొన్న అస్థిర పరిస్థితుల్లో ఆకట్టుకునే పనితీరు కనబరుస్తోందని RBI గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. అక్టోబరు 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వేళ రూపాయి అస్థిరత గరిష్ఠంగా 25 శాతానికి, మార్చి 2020లో కరోనా వ్యాపిస్తున్న సమయంలో 10 శాతానికి చేరుకుందని వెల్లడించారు. ప్రస్తుతం కేంద్ర బ్యాంకుల ద్రవ్య బిగింపులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి అంతర్జాతీయ అనిశ్చితి ఉన్నా కూడా రూపాయి విలువ బాగా స్థిరపడిందని చెప్పారు.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications