Marico: దేశంలోని ప్రఖ్యాత FMCG కంపెనీ మ్యారికో మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. ఉద్యోగాలను పోగొట్టుకున్న, వృత్తిపరమైన విరామం తీసుకున్న నిపుణులకు రెండవ అవకాశం ఇస్తూ తమ సంస్థలోకి స్వాగతం పలుకుతోంది మ్యారికో లిమిటెడ్ సంస్థ. ఇందుకోసం రెండవ కెరీర్ ప్రోగ్రామ్ ఫీనిక్స్‌ను ప్రారంభించింది.

ఫీనిక్స్ ప్రోగ్రామ్..
ఫీనిక్స్ అనేది కెరీర్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్. ఇది కనీసం ఏడాది కెరీర్ విరామం తీసుకుని కార్పొరేట్ ప్రపంచానికి తిరిగి రావడానికి ఆసక్తి చూపుతున్న నిపుణులకు అవకాశాలను అందిస్తున్నట్లు మ్యారికో వెల్లడించింది. సదరు నిపుణులు ఆరోగ్య కారణాలు, ఆకాంక్షలు లేదా వ్యక్తిత్వ ప్రాధాన్యతలను నెరవేర్చుకునేందుకు విరామం తీసుకున్న నిపుణులకు కంపెనీ ఈ అవకాశాన్ని కల్పిస్తోంది.

అర్హతలు ఏమిటి..
మ్యారికో ప్రవేశపెట్టిన ఈ ప్రోగ్రామ్‌కు అర్హత సాధించేందుకు సదరు అభ్యర్థులు గతంలో కనీసం రెండేళ్ల పాటు ఉద్యోగం చేసిన అనుభవం కలిగి ఉండాలని వెల్లడించింది. ఈ కార్యక్రమం కింద కంపెనీ తన ప్రాజెక్టుల్లోని అవసరాలకు అనుగుణంగా నియామకాలు జరుగుతాయని కంపెనీ వెల్లడించింది. ఎంపిక చేయబడే అభ్యర్థులు కంపెనీకి 6,9 లేదా 12 నెలల పాటు కన్సల్టెంట్‌లుగా పనిచేయాల్సి ఉంటుంది. అయితే వారిని పర్మనెంట్ ఉద్యోగిగా కంపెనీలో తీసుకోవటానికి అప్పటి వరకు వారి పనితీరు, కంపెనీలో ఉద్యోగాల లభ్యతపై ఆధారపడి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.

కొత్త యుగంలో..
మారుతున్న ఆధునిక యుగంలో ఉద్యోగులు తమ కెరీర్ ను చాలా భిన్నంగా ఉండాలని కోరుకోవటాన్ని కంపెనీ గుర్తించిందని మారికో లిమిటెడ్ CHRO అమిత్ ప్రకాష్ తెలిపారు. కొంత మందికి తమ జీవితంలోని వివిధ దశల్లో అవసరాల కారణంగా కెరీర్ విరామాలు తలెత్తవచ్చని ఆయన అన్నారు. కెరీర్ బ్రేక్‌కు సంబంధించిన కారణాలను పక్కనపెట్టి లింగ వివక్ష లేకుండా ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications