ప్రపంచ మార్కెట్ కి భారత్ సవాల్... హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న FMCG ఉత్పత్తులు..

ఇప్పుడు మన ఇంట్లో ఉన్న బిస్కెట్లు, పోహా, షాంపూలు... ఇవి విదేశీ ఇళ్ళలో కూడా చోటు దక్కించుకుంటున్నాయి. అవును, భారతదేశ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (Fast Moving Consumer Goods) కంపెనీలు ఇప్పుడు దేశం లో కన్నా విదేశాల్లో ఎక్కువ ఆదాయం పొందుతున్నాయి. ఇది చిన్న విషయం కాదు. మనకు సాధారణంగా కనిపించే బ్రాండ్లు - HUL (హిందుస్థాన్ యూనిలీవర్), డాబర్, ఐటిసి, మారికో, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్. ఇవి ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌ లో తమ ఉత్పత్తులతో మంచి పట్టును ఏర్పరచుకుంటున్నాయి.

Indian FMCG exports Global demand for Indian products Ayurveda products abroad Indian packaged food exports HUL Dabur ITC global sales Indian biscuits poha shampoo exports FMCG companies in international markets Made in India products abroad PLI scheme FMCG Indian brands overseas FMCG

ఎగుమతులు దేశీయ అమ్మకాలను మించాయి ఎందుకు?

ఇటీవల రెండు సంవత్సరాల్లో మన దేశంలో వినియోగదారుల కొనుగోలు శక్తి కొంత తగ్గగా, విదేశీ మార్కెట్‌లో మాత్రం భారత ఉత్పత్తులపై ఆసక్తి ఎక్కువైందని కనిపిస్తోంది. దీనివల్ల అనేక కంపెనీలు తమ ఫోకస్‌ను ఇంటర్నేషనల్ ఎగుమతుల మీదకు మళ్లించాయి. ఉదాహరణకి, HUL కంపెనీకి దేశీయ మార్కెట్‌ లో అమ్మకాలు కేవలం 2% పెరిగినా, విదేశాల్లో అయితే ఎగుమతులు 8% పెరిగాయి. అదే డాబర్, దేశంలో కేవలం 1.3% రెవెన్యూ పెరుగుదల ఉండగా, విదేశాల్లో మాత్రం 17% పెరిగింది.

ఈ ఎగుమతుల పెరుగుదలకు ముఖ్యమైన కారణం మన రోజువారీ ఉపయోగించే ఉత్పత్తులే. ఉదాహరణకి, చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణ (షాంపూలు, ఆయిల్స్), పోషకాహారం (హార్లిక్స్ లాంటి డ్రింక్స్), మరియు వ్యక్తిగత సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తులు (సబ్బులు, పౌడర్లు, క్రీములు) విదేశాల్లో బాగా అమ్ముడవుతున్నాయి. Dove, Vaseline, Pears, Bru, Sunsilk, Glow & Lovely, Pond's, Lakme, Lifebuoy లాంటి బ్రాండ్లు ఇప్పటికే అక్కడ మంచి గుర్తింపు సంపాదించాయి.

అలాగే ఆదాని విలమార్(AWL) వ్యవసాయ విభాగం తెలిపినట్టు బాస్మతి బియ్యం, మస్టర్డ్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, అటా (గోధుమ పిండి), బేసన్, సోయా నగెట్స్, పోహా లాంటి భారతీయ ఆహార ఉత్పత్తులకూ విదేశాల్లో డిమాండ్ రోజు రోజుకీ పెరుగుతోంది. అంటే, మన ఇంట్లో సాధారణంగా ఉపయోగించే వస్తువులే ఇప్పుడు విదేశాల్లో ప్రత్యేకతగా మారాయి.

భారతీయ బ్రాండ్లకు గ్లోబల్ డిమాండ్ పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా, భారతీయ వంటకాలంటే విదేశీయులకు ఇప్పుడు ఆరోగ్యపరమైన ఆహారంగా భావన పెరిగింది. ఉదాహరణకు, పోహా, మిల్లెట్ బ్రేక్‌ఫాస్ట్‌లు, బిస్కెట్లు ఇలా మనం ప్రతిరోజూ తినే పదార్థాలే ఇప్పుడు అంతర్జాతీయంగా ఆరోగ్యకరమైన ఆప్షన్‌లుగా నిలుస్తున్నాయి. ఆయుర్వేదిక ఉత్పత్తులు కూడా హైలైట్ అవుతున్నాయి. డాబర్ వంటి బ్రాండ్లు కెమికల్స్ లేని సహజ పదార్థాలతో తయారవుతుండటం వల్ల, ఆరోగ్యాన్ని ప్రాముఖ్యతనిచ్చే వినియోగదారులు వీటిపైన ఆసక్తి చూపుతున్నారు.

ఇక ప్రభుత్వం అందిస్తున్న మద్దతు కూడా కీలకం. ప్యాకేజ్డ్ ఫుడ్ మరియు మిల్లెట్ ఉత్పత్తులపై PLI (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్) స్కీమ్ లాంటి ప్రోత్సాహకాలు కంపెనీలను ఎగుమతుల దిశగా మరింత ఉత్సాహ పరుస్తున్నాయి.

మరొక ముఖ్యమైన అంశం పాకెట్ సైజ్‌లు మరియు ధరల అనుకూలత. చిన్న ప్యాకెట్లలో ఉండే బిస్కెట్లు, నూడిల్స్, షాంపూలు లాంటి వస్తువులు విదేశీ మార్కెట్‌లో తక్కువ ధరకు లభ్యమవుతుండటంతో, అక్కడి మధ్య తరగతి వినియోగదారులకి ఇవి సులభంగా చేరుతున్నాయి. ఈ సౌలభ్యం కూడా మన బ్రాండ్ల విజయానికి ప్రధాన కారణం.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+