భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోంది, అంచనాలు అప్: మోర్గాన్ స్టాన్లీ

2022-23 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటును ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మోర్గాన్ స్టాన్లీ 60 బేసిస్ పాయింట్లను పెంచింది. అన్ని రంగాల్లో వినియోగం పుంజుకునే అవకాశం ఉన్నందున 7.8 శాతం వృద్ధి రేటు నమోదు కావొచ్చునని అంచనా వేసింది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక రికవరీ వేగవంతమైందని, అయితే ద్రవ్యోల్భణ ఆందోళనలు ఉన్నాయని తెలిపింది. భారత్‌లో అర్హులైన ప్రజలందరికీ కరోనా వ్యాక్సీన్ వేయడం 2022 జనవరి-మార్చిలో పూర్తి కావొచ్చునని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. వస్తు, సేవా రంగాల్లో వినియోగం పుంజుకునేందుకు ఇది తోడ్పడుతుందని అభిప్రాయపడింది.

2022 రెండో అర్ధభాగం నుండి ప్రయివేటు రంగ మూలధన వ్యయాలు పెరగవచ్చునని తెలిపింది. సామర్థ్య వినియోగం మెరుగవ్వడం, ఆర్థిక కార్యకలాపాలు సాధారణస్థితికి రావడం, సంస్కరణలు ఇందుకు దోహదం చేస్తాయని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 10.3 శాతం లభించవచ్చునని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ఆర్బీఐ అంచనా 9.5 శాతం కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 7.8 శాతం, 2023-24 ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు 7.2 శాతంగా నమోదు కావొచ్చునని తెలిపింది.

Indian economy to witness strong recovery post Covid: Morgan Stanley

దేశీయంగా, అంతర్జాతీయంగా నెలకొన్న సరఫరా అవరోధాలు తాత్కాలికం అని, ద్రవ్యోల్భణం ప్రస్తుతం పెరిగినప్పటికీ, త్వరలో దిగి రావొచ్చునని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. త్రైమాసిక ప్రాతిపదికన నిత్యావసరాల ధరలు తగ్గుతున్నట్లు తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్భణం సగటున 5.3 శాతం, 2022-23లో 4.7 శాతం నమోదు కావొచ్చునని పేర్కొంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+