కోవిడ్ -19: చిన్నా, చితకా కాదు. ఎకానమీకి భారీ ప్యాకేజీ కావాలి!

దేశం ఇప్పుడు అతి పెద్ద ఉపద్రవాన్ని ఎదుర్కొంటోంది. చైనా లో మొదలైన మాయదారి కరోనా వైరస్ ... మనుషుల ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తోంది. ఇందుకు భారత దేశం మినహాయింపు ఏమీ కాదు. అసలే రెండేళ్లుగా దేశం ఆర్థిక మందగమనాన్ని చవిచూస్తోంది. అస్తవ్యస్తమైన ఆర్థిక విధానాలతో దేశాన్ని రేసు ట్రాక్ మీది నుంచి గూడ్స్ రైల్ ట్రాక్ పైకి తీసుకొచ్చిన ఏలికలు... ఇప్పుడు కరోనా సృష్టిస్తున్న విలయాన్ని తట్టుకునేందుకు తగిన ప్రణాళికలేవీ వేస్తున్నట్లు కనిపించటం లేదు.

ఏదో కంటి తుడుపు చర్యలే తప్ప... దేశం ప్రస్తుత ఆర్థిక గండం నుంచి గట్టెక్కే ఒక్క గట్టి ప్రయత్నమైనా చేసిన దాఖలా లేదు. కరోనా తో లాక్ డౌన్ విధించిన తొలినాళ్లలో విదిలించిన రెండు మూడు అర కొర ఆర్థిక ఇద్దీపన పథకాలే కానీ... మళ్ళీ సమీక్షించిన అనంతరం దేశానికి, పౌరులకు ఉపయోగపడే విధానాల ఊసే లేదు. ప్రపంచ రేటింగ్ సంస్థలు ఇండియా జీడీపీ వృద్ధి రేటు సున్నా శాతంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి అంతకంటే కూడా అధ్వాన్నంగా ఉండే అవకాశాలే ఉన్నాయి. అయినా కూడా చీమ కుట్టినట్లయినా లేని ప్రభుత్వ పోకడ ఎవరికీ అంతుపట్టడం లేదు.

రాష్ట్రాల కు చేయూత ఏదీ...

రాష్ట్రాల కు చేయూత ఏదీ...

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో అన్ని రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. కానీ, లాక్ డౌన్ వల్ల రాష్ట్రాల ఆదాయాలకు పెద్ద ఎత్తున గండి పడింది. వాస్తవిక రాబడుల్లో కనీసం 30% కూడా రావటం లేదు. పైగా, ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలే సొంత నిధులను వెచ్చించాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం కేవలం ఒక్కో జన్ ధన్ ఖాతాలో రూ 500 జమ చేసి చేతులు దులిపేసుకుంది.

కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత రేషన్ రూపంలో, నగదు సహాయం రూపంలో పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒకవైపు రాబడి లేదు, మరో వైపు కేంద్రం నుంచి ఆర్థిక సహకారం లేదు. దీంతో రాష్ట్రాలు ఢీలా పడిపోతున్నాయి. మరోవైపు కరోనా కేసుల గుర్తింపు, చికిత్స అందించటం, క్వారంటైన్ ఖర్చులు, మందులు, లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాల మోహరింపు వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నాయి. కానీ కేంద్రం నుంచి ఆర్థిక పరమైన ఎలాంటి ఉపశమనం లేకపోవటం విచారకరం.

ఆర్థిక ఉద్దీపన ...

ఆర్థిక ఉద్దీపన ...

ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న అన్ని దేశాలు ప్రస్తుత ఉపద్రవం నుంచి కోలుకునేందుకు పెద్ద ఎత్తున ఆర్థిక ఉద్దీపన పథకాలు ప్రకటించి అమలు చేస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ బాధ్యతలు ఏ దేశంలోనైనా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. దీంతో కరెన్సీ ముద్రణ, నిధుల లభ్యత, అత్యవసర నిధుల విడుదల వంటి అంశాలన్నీ కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. కానీ, ప్రస్తుతం రాష్ట్రాలకు సొంత నిధుల ప్రవాహం తగ్గిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆర్థిక ఉద్దీపన పథకం ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సమాఖ్య స్ఫూర్తిని కాపాడుకునేందుకు కేంద్రం ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది. లేదంటే రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని ప్రశ్నించే అవకాశాలను కొట్టివేయలేం. స్పష్టమైన ఆధిక్యంతో అధికారంలో ఉన్నామన్న ఒకే ఒక్క అంశం అన్నిటికి విరుగుడు కాదని కేంద్రం గుర్తించాల్సిన సమయమిది. ఒక్కో రాష్ట్రానికి రూ 25,000 కోట్ల నుంచి రూ 30,000 కోట్ల ఏకకాలిక ఆర్థిక చేయూత అందించాల్సిన అవసరం ఉంది.

రాష్ట్రాలు పనిచేస్తేనే..

రాష్ట్రాలు పనిచేస్తేనే..

దేశం లో అన్ని రాష్ట్రాలు కలిసి కట్టుగా పనిచేస్తూ ఆయా రాష్ట్రాలు ముందుకు వెళితేనే దేశం మొత్తం అభివృద్ధి సాధిస్తుంది. అంతే కానీ, రాష్ట్రాలు ఎటుపోతే మాకేమిటి.. మేము కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. మాకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి అని మిన్నకుండి పోతే కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బ తప్పదు. ఇతర దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించాలన్నా.. ఫ్యాక్టరీలు నెలకొల్పాలన్నా... ఆర్థిక వృద్ధి వేగం పెరగాలన్నా... దేశంలో పేదరికం తగ్గి బీద, ధనిక తారతమ్యాలు రూపుమాపాలన్నా... అధిక సంఖ్యలో యువతకు ఉపాధి లభించాలన్నా రాష్ట్రాలు సరిగ్గా పనిచేయాల్సిందే.

అన్ని రాష్ట్రాల సంయుక్త మార్కుల జాబితానే కేంద్రం రిపోర్ట్ కార్డు అని గుర్తించి... ఈ రోజు జరిగే ముఖ్యమంత్రుల సమావేశంలో అయినా మన ప్రధాని రాష్ట్రాలకు ఆర్థిక చేయూత అందించే ప్రకటన చేస్తారని ఆశిద్దాం. లేదంటే... కాలమే అన్నిటికి సమాధానం చెబుతుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+