ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం (Inflation) భయాలు వినియోగదారులను ఖర్చులు తగ్గించుకునేలా చేస్తుంటే భారతీయులు మాత్రం ఖర్చులో తగ్గేదెలా అంటున్నారు. యూకే, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కొనుగోలు శక్తి తగ్గుతుంటే.. మన దేశంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. వచ్చే ఏడాదిలో చాలామంది భారతీయులు భారీ కొనుగోళ్లు చేయడానికి సిద్ధంగా ఉన్నారట.

బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (BCG) విడుదల చేసిన తాజా 'గ్లోబల్ కంజ్యూమర్ రాడార్' నివేదిక ప్రకారం.. భవిష్యత్తుపై అత్యంత ఆశాభావంతో ఉన్న వినియోగదారులు చైనా తర్వాత మన దగ్గరే ఉన్నారు. దాదాపు 60% భారతీయ కుటుంబాలు భవిష్యత్తుపై ధీమాగా ఉన్నారు. రకరకాల కొనుగోళ్లు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే రాబోయే రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థ లో వినియోగం (Consumption) భారీగా పెరిగే అవకాశం ఉందన్నమాట!
ఖర్చుకు వెనుకాడట్లేదు
భారతీయ వినియోగదారుల ధీమా ఎంత బలంగా ఉందో ఈ గణాంకాలను చూసి అర్థం చేసుకోవచ్చు.
- దాదాపు 61% మంది భారతీయులు వచ్చే 6 నెలల్లో తమ కుటుంబ ఖర్చులు పెరుగుతాయని నమ్ముతున్నారు. ఈ పెరుగుదల కేవలం నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్లే కాకుండా, కొత్త వస్తువులు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో కూడా ఉందట.
- ముఖ్యంగా కార్లు (70% నికర పెరుగుదల), మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇళ్లు కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వినియోగదారులు నివేదించారు. ఇది అన్ని రంగాల్లోని వ్యాపార సంస్థలకు శుభవార్త.
- దాదాపు 57% మంది కొత్త బ్రాండ్లను ప్రయత్నించడానికి సుముఖంగా ఉన్నామని చెప్తే.. 84% మంది మాత్రం తమకు తెలిసిన, నమ్మకమైన బ్రాండ్లకే ఓటేస్తున్నారు. అంటే మార్కెట్ లో కొత్త బ్రాండ్‌లు నిలదొక్కుకోవడానికి కాస్త కష్టపడాలి.
కొనుగోళ్లపై ఏఐ ప్రభావం!
మనం కేవలం డబ్బు ఖర్చు చేయడంలోనే కాదు.. టెక్నాలజీని ఉపయోగించడంలోనూ ముందున్నాం. కొనుగోళ్లకు సంబంధించిన తుది నిర్ణయాలు తీసుకోవడానికి భారతీయ వినియోగదారులు ఏఐ టూల్స్‌ను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. నవంబర్ 2025 నాటికి ఏకంగా 62% మంది భారతీయులు ఏఐ టూల్స్‌ను ఉపయోగించారు. ఫిబ్రవరితో పోలిస్తే ఇది 48% అధికం. ఆశ్చర్యకరంగా భారతదేశంలో ఏఐని ఆఫీస్ పనుల కంటే (63%), షాపింగ్ నిర్ణయాల కోసమే (64%) ఎక్కువగా వాడుతున్నారట! బ్రాండ్ ఎంపిక, ప్రొడక్ట్ ఫీచర్లు వంటి అంశాల కోసం వినియోగదారులు ఏఐని సంప్రదిస్తున్నారు.
రాబోయేది మంచి రోజులే!
అంతర్జాతీయ పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా.. భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం స్థిరంగానే ఉంటుందని చాలామంది నమ్ముతున్నారు. అంతర్జాతీయ పరిస్థితులు మన ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని కేవలం 17% మంది మాత్రమే నమ్ముతున్నారు. ఇది ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. దాదాపు 61% మంది ప్రజలు 'మంచి ఆర్థిక రోజులు రాబోతున్నాయి' అని నమ్మకంగా ఉన్నారు. ఈ అధిక వినియోగదారుల విశ్వాసం, సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకోవడం - ఈ రెండు అంశాలు కలిపి రాబోయే సంవత్సరాల్లో భారత ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా వృద్ధి చెందడానికి దోహదపడతాయని నివేదిక స్పష్టం చేసింది. వ్యాపార సంస్థలు ఈ సానుకూల ధోరణికి అనుగుణంగా తమ ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం!
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications