మాంద్యం ఎఫెక్ట్ స్టార్ట్ అయ్యిందా..? గరిష్ఠ స్థాయికి కరెంట్ ఖాతా లోటు.. కష్టకాలమేనా..!
Current Account Deficit: ఏడాది ముగింపుకు వస్తున్న సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అలుముకున్న ఆర్థిక సంక్షోభం ప్రభావం భారత్ పై కూడా పడినట్లు కనిపిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు చేస్తున్న పనులు కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని తెలుస్తోంది. జులై-సెప్టెంబర్‌లో ఆల్ టైమ్ గరిష్ఠమైన 36.4 బిలియన్ డాలర్లకు కరెంటు ఖాతా లోటు చేరుకుందని రిజర్వు బ్యాంక్ డిసెంబర్ 29న డేటా విడుదల చేసింది.

2012 సమయంలో లోటు..
కరెంట్ ఖాతా లోటు ఏప్రిల్-జూన్‌లో సమయంలో 18.2 బిలియన్ డాలర్లుగా ఉంది. 2012-13 మూడవ త్రైమాసికం సమయంలో గరిష్ఠంగా కరెంట్ ఖాతా లోటు 31.77 బిలియన్ డాలర్లకు చేరుకుని రికార్డు సృష్టించింది.

15 రెట్లు అధికంగా..
జులై-సెప్టెంబర్‌లో భారతదేశ కరెంట్ ఖాతా లోటు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి పెరుగుతుందని అంచనా వేయబడినప్పటికీ.. లోటు పరిమాణం తమ అంచనా శ్రేణి 31-34 బిలియన్ డాలర్లను మించిపోయిందని ఆర్థికవేత్త అదితి నాయర్ పేర్కొన్నారు. అలా 2022-23 మొదటి అర్ధ భాగంలో కరెంట్ ఖాతా లోటు 54.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది 2021-22 మొదటి ఆరు నెలల్లో నమోదైన 3.1 బిలియన్ల డాలర్ల లోటు కంటే 15 రెట్లు ఎక్కువని చెప్పుకోవాలి.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో..
ఫిబ్రవరి చివరలో రష్యా-ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత ప్రపంచ వస్తువుల ధరల పెరుగుదల కారణంగా CADలో తీవ్ర క్షీణత అంచనా వేయబడింది. దీని ఫలితంగా జూలై-సెప్టెంబర్‌లో భారత దిగుమతుల బిల్లు దాదాపు 200 బిలియన్ డాలర్లకు పెరిగింది. సాఫ్ట్‌వేర్, వ్యాపారం, ప్రయాణ సేవల ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో సేవల ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 30.2 శాతం వృద్ధిని నమోదు చేశాయని ఆర్‌బీఐ తన నివేదికలో పేర్కొంది.

వాణిజ్య లోటు అంచనాలు..
ఇటీవలి నెలల్లో సరుకుల వాణిజ్య లోటు తగ్గుముఖం పట్టినప్పటికీ నవంబర్‌లో ఏడు నెలల కనిష్ఠ స్థాయి అయిన 23.89 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఖాతా లోటు 115 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని ICRA నిపుణులు నాయర్ అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications