కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత వినియోగదారులు ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని సర్వేలో వెల్లడైంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటున్నట్లు ప్రముఖ కన్సల్టెంట్ కేపీఎంజీ సర్వేలో 78 శాతం మంది వెల్లడించారు. టైర్ 1 కంటే టైర్ 2, టైర్ 3 నగరాల్లోని ప్రజలు తమ ఖర్చులపై రెండు రెట్లు ఆశాజనకంగా ఉన్నారు. ఖర్చు చేయాడానికి పర్స్ తెరిచే ముందు అవసరమా కాదా అని ఆలోచించే పరిస్థితి ఉందని తేలింది. అయితే కరోనా వైరస్ ప్రభావం తాత్కాలికమని, సాధారణ పరిస్థితికి రావడానికి ఎక్కువ సమయం పట్టదని సర్వేలో పాల్గొన్న 51 శాతం మంది అభిప్రాయపడ్డారు.

ఖర్చులు పెరగొచ్చు లేదా యథాతథం
కరోనా మహమ్మారి నేపథ్యంలోను తమ ఖర్చులు కాస్త పెరుగుతాయని లేదా గతంలో ఉన్నట్లుగానే ఉంటాయని టైర్ 2 నగరాల్లో 22 శాతం మంది, టైర్ 3 నగరాల్లోని 30 శాతం మంది అభిప్రాయపడ్డారు. రిటైలర్స్‌కు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి తదుపరి బెస్ట్ కేంద్రాలుగా కేపీఎంజీ ఇండియా పార్ట్‌నర్, హెడ్ కన్స్యూమర్ మార్కెట్స్ అండ్ ఇంటర్నెట్ బిజినెస్ హర్ష రజ్దాన్ అన్నారు. రాబోయే మూడు నెలల్లో రూ.5,000 ఖర్చు చేయనున్నట్లు 49 శాతం మంది వెల్లడించారు. వినియోగదారులు మాత్రం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లు అర్థమవుతోందన్నారు.

78 శాతం మంది ఖర్చుకు నో..
అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటున్నట్లు ఈ సర్వేలో పాల్గొన్న 78 శాతం మంది వెల్లడించారు. అయితే ఈ విషయంలో టైర్ 1 నగరాల కంటే టైర్ 2, టైర్ 3 నగరాలు దాదాపు రెండు రెట్లు (1.9x) సానుకూలంగా ఉన్నాయి.
టైర్ 1 నగరాల్లోని వారి కంటే టైర్ 3 నగరాల్లోని వారు తమ దుస్తులపై రూ.5,000 వరకు ఖర్చుల కోసం 1.4 రెట్లు సానుకూలంగా స్పందించారు.
అన్ని కేటగిరీల్లోను మహిళల కంటే పురుషులు ఖర్చులపై కొంత సానుకూలంగా ఉన్నారు. స్కిన్ కేర్, కాస్మోటిక్స్ ఖర్చుల కోసం 60 శాతం మంది పురుషులు మొగ్గు చూపారు.

ఆన్‌లైన్ ఛానల్స్ డిమాండ్
వయస్సుల వారీగా చూస్తే 20 ఏళ్ల నుండి 30 ఏళ్ల మధ్య ఉన్నవారు అనవసర ఖర్చులను తగ్గించారు. పురుషుల్లో 76 శాతం, మహిళల్లో 86 శాతం తగ్గింది. కరోనా కంటే ముందు, కరోనా తర్వాత.. ఆన్‌లైన్ ఛానల్స్ ప్రిఫరెన్స్ 1.6 రెట్లు పెరిగింది. కేపీఎంజీ ఈ సర్వేను 2,376 మందితో నిర్వహించింది. ఇందులో 66 మంది పురుషులు, 34 మంది స్త్రీలు ఉన్నారు. ఈ సర్వేను టైర్ 1, టైర్ 2, టైర్ 3 నగరాల్లో చేపట్టారు. మే 18వ తేదీ నుండి జూన్ 7వ తేదీ మధ్య నిర్వహించారు.

టైర్ 2, టైర్ 3 నగరాల్లో పెరుగుతున్న కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్
కరనా తర్వాత టైర్ 2, టైర్ 3 నగరాల్లో కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ పెరుగుతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది.
టైర్ 1తో పోలిస్తే టైర్ 2, టైర్ 2తో పోలిస్తే టైర్ 3 నగరాల్లో ఖర్చులపై ఆశావహంగా ఉన్నారు.
కరోనా నేపథ్యంలో టైర్ 2, టైర్ 3 నగరాల్లో కంటే టైర్ 1 నగరాల్లో శుభ్రత, సామాజిక దూరం వంటివి ఎక్కువగా పాటిస్తున్నారు.


Click it and Unblock the Notifications