ఇండియాలో నిర్మాణ రంగానికి మహర్దశ.. 2030 నాటికి జరగబోయేది ఇదే..
దేశీయంగా IT సహా ఇతర రంగాల్లో ఉద్యోగాల కోత అధికమవుతోంది. తాజాగా AI టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో నిర్మాణ రంగం మాత్రం నేనున్నానంటూ ధైర్యం చెబుతోంది.
ఉపాధి కల్పించడంలో భారత నిర్మాణ రంగం రెండవ అతిపెద్దదని నైట్ ఫ్రాంక్ ఇండియా మరియు రాయల్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ చార్టర్డ్ సర్వేయర్స్ (RICS) ఇటీవల నివేదించింది. ప్రస్తుతం 7.1 కోట్ల శ్రామిక శక్తి ఈ రంగం ద్వారా ఉపాధి పొందుతోంది. 2030 నాటికి ఈ సంఖ్య 10 కోట్లు దాటుతుందని అంచనా.

దేశీరయ రియల్ ఎస్టేట్ రంగం కూడా గణనీయమైన వృద్ధి సాధిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ రంగం వాల్యుయేషన్ ప్రస్తుతం 650 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది కాస్తా 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఆ డిమాండ్ కు తగిన విధంగా స్కిల్డ్ వర్కర్స్ ను అందించడానికి ప్రభుత్వం, విద్యాసంస్థలు, శిక్షణా సంస్థలు నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
అయితే దేశంలో రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలు వృద్ధి చెందుతున్నందున.. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కోసం డిమాండ్ సైతం గణనీయంగా పెరుగుతుందని RICS నివేదిక తెలిపింది. పెరుగుతున్న టెక్నాలజీ నిర్మాణ రంగంలో ఉత్పాదకతను పెంచడానికి దారితీస్తుందని భావిస్తోంది. కానీ ప్రస్తుతం ఉన్న 7.1 కోట్ల శ్రామిక శక్తిలో 81 శాతం నైపుణ్యం లేనివారే కావడం కలవర పెడుతున్నట్లు పేర్కొంది.


Click it and Unblock the Notifications