ఏప్రిల్-జూన్‌లో భారీగా పెరగనున్న నియామకాలు, త్రైమాసికం పరంగా మాత్రం...
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత కంపెనీలు పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టనున్నట్లు మ్యాన్ పవర్ గ్రూప్ ఎంప్లాయిమెంట్ ఔట్ లుక్ సర్వేలో తేలింది. దాదాపు 38 శాతం కంపెనీలు వచ్చే మూడు నెలల పాటు కొత్త ఉద్యోగులను నియమించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. ఈ సర్వే ప్రకారం దాదాపు 3090 కంపెనీలు ఉద్యోగ నియామకాలకు సిద్ధమయ్యాయి. అయితే త్రైమాసికం ప్రాతిపదికన చూస్తే నియామకాలు 11 శాతం క్షీణించే అవకాశం ఉందని సర్వే తెలిపింది. ఏప్రిల్-జూన్ మధ్య తమ ఉద్యోగుల సంఖ్య పెరిగే అవకాశముందని 55 శాతం, తగ్గవచ్చునని 17 శాతం, ఎలాంటి మార్పు ఉండకపోవచ్చునని 36 శాతం కంపెనీలు తెలిపాయి. నికరంగా 387 శాతం కంపెనీలు కొత్తగా నియామకాలు చేపట్టనున్నట్లు తేలింది.

భారత్ దూసుకెళ్తుంది
కరోనా సంక్షోభం నుండి క్రమంగా బయటపడుతున్న ప్రపంచానికి భౌగోళిక అస్థిరతలు, ద్రవ్యోల్భణం రూపంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నట్లు మ్యాన్ పవర్ గ్రూప్ ఎండీ సందీప్ తెలిపారు. అయితే ఐటీ, టెక్నాలజీ రంగాల అండతో భారత్ ముందుకు సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. స్టార్టప్స్‌కు భారత్ అనువైన దేశంగా మారిందని, కేంద్ర ప్రభుత్వం ఇటీవలి బడ్జెట్‌లో రూ.283 కోట్లకు పైగా స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్‌కు కేటాయించిందన్నారు. ఈ కారణంగా యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.

3000కు పైగా కంపెనీల ద్వారా సర్వే
ఈ సర్వేలో తేలింది ఏమంటే వచ్చే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత కంపెనీలు మరిన్ని నియామకాలు చేపట్టనున్నాయి. మ్యాన్‌పవర్ గ్రూప్ తన ఎంప్లాయిమెంట్ ఔట్‌లుక్ 60వ వార్షిక ఎడిషన్ కోసం వివిధ రంగాలకు చెందిన 3,090 కంపెనీల యాజమాన్యాలతో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 17 శాతం యాజమాన్యాలు వారి నియామకాలు తగ్గుతాయని, 28 శాతం కంపెనీలు ఎలాంటి మార్పు ఉండదని తెలిపాయి. దీంతో నికరంగా ఉపాధి 38 శాతం పెరుగుతుందని తెలుస్తుంది.

నియామకాల జోరు
ఉద్యోగులలో మహిళల వాటా ఇంకా ఆందోళనకరంగానే ఉందని సర్వే తెలిపింది. అత్యధికంగా ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయని పేర్కొంది. తర్వాత రెస్టారెంట్లు - హోటల్స్, విద్య, వైద్యం, సామాజిక-ప్రభుత్వరంగాల్లో ఉండనున్నాయని పేర్కొంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని అన్ని దేశాల్లో వచ్చే మూడు నెలల పాటు నియామకాలు పెరగనున్నట్లు తెలిపింది. అత్యధికంగా భారత్, ఆ తర్వాత ఆస్ట్రేలియా, చైనాలో ఉద్యోగాలు రానున్నాయని పేర్కొంది.


Click it and Unblock the Notifications