Market News: ఆర్థిక మాంద్యం చుట్టుముడుతుందన్న సంకేతాలతో ప్రపంచ దేశాల వృద్ధి రేటు మందగించింది. ఈ సమయంలో మంచి జోరు మీదున్న ఇండియా పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యల వల్ల గతే నాలుగేళ్లలో దేశానికి ఇన్వెస్ట్‌మెంట్స్ వెల్లువెత్తాయి. ఇదే సమయంలో వివిధ రకాల ఖర్చులు ఆయా కంపెనీలకు గుదిబండగా మారినట్లు నివేదికలు చెబుతున్నాయి.
పెరుగుతున్న వ్యాజ్యాలు, విలీనాలు, ఎక్విజిషన్స్ (M&As) వల్ల దేశంలోని పలు కంపెనీల వృత్తిపరమైన, లీగల్ ఖర్చులు భారీగా పెరిగినట్లు ఏస్ ఈక్విటీ డేటా వెల్లడించింది. FY23లో 73 వేల కోట్ల మార్కును దాటినట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 23.4 శాతం పెరిగినట్లు పేర్కొంది.

BSE500 కంపెనీల మొత్తం లీగల్ ఖర్చులను పరిగణలోనికి తీసుకుంటే FY19-23 మధ్య 14.7 శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది. అదే కాలంలో రాబడిలోనూ 12.9 శాతం వృద్ధిని నమోదైనట్లు పేర్కొంది. BSE500 ఇండెక్స్ లోని 29 కంపెనీల ప్రొఫెషనల్, లీగల్ రుసుములు రెట్టింపు అయినట్లు వెల్లడించింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ వంటి కంపెనీలు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నట్లు చెప్పింది.
ఇక దేశంలోని అతిపెద్ద కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్(RIL), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) కూడా అత్యధికంగా ఖర్చు చేశాయి. FY23లో TCS 21 వేల 337 కోట్లను ఎక్స్‌టర్నల్ కన్సల్టెంట్ల ఫీజుల కోసం వెచ్చించింది. ఇదే సమయంలో RIL ప్రొఫెషనల్ ఫీజులు కూడా 80 శాతం పెరిగి 2 వేల 916 కోట్లకు చేరుకున్నాయి.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో రంగంలోనికంపెనీలు.. డేటా నిర్వహణ, గోప్యతా నిబంధనలు పాటించడంలో విఫలం కావడంతో ఆర్థిక జరిమానాలు, వ్యాజ్యాల వల్ల చట్టపరమైన రుసుములు పెరిగే అవకాశం ఉంది. వీటికి తోడు రెగ్యులేటరీ ఫైలింగ్స్, బ్రోకరేజ్ సహా ఇతర ఖర్చులు అదనం. ఇవన్నీ కలిసి లీగల్ రుసుముల పెరుగదలకు కారణంమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications