ఆర్థిక వ్యవస్థకు ముప్పులేదు, ఆల్ టైమ్ కనిష్టం వద్ద బ్యాడ్ లోన్స్

అధిక ద్రవ్యోల్భణం, అధిక నిరుద్యోగంతో ఇబ్బందిపడుతూ, మందగమనానికి గురయ్యే పరిస్థితి మన ఆర్థిక వ్యవస్థకు రాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ ధీమా వ్యక్తం చేశారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం మనపై చాలా తక్కువగా ఉందని, ధరలు త్వరలో అదుపులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8.9 శాతంగా ఉంటుందని అంచనా వేశామని, ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల ప్రభావం దీనిపై స్వల్పంగా ఉండవచ్చునన్నారు.

అంతర్జాతీయ అనిశ్చితి దీర్ఘకాలం కొనసాగితే మాత్రం వృద్ధిపై ఏడాది పాటు ప్రభావం ఉంటుందని, ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేయడానికి శ్రమించాల్సి వస్తుందన్నారు. ఆర్బీఐ టార్గెట్ రిటైల్ ద్రవ్యోల్భణం రెండు శాతం నుండి ఆరు శాతంలో గరిష్టస్థాయికి కాస్త అధికంగా గత రెండు నెలల్లో నమోదైనా, మున్ముందు అదుపులోకి వస్తుందని అంచనా వ్యక్తం చేశారు.

Indian Bank Bad Loans At All Time Low, Says RBI Governor Shaktikanta Das

రూపాయి మారకపు విల్వలో స్థిరత్వం రావొచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాంటి సవాళ్లు అయినా తట్టుకోగలిగే స్థితిలో మన ఆర్థిక వ్యవస్థ ఉందన్నారు. విదేశీ మారకపు నిల్వలు అధికంగా ఉండటం, కరెంట్ ఖాతా లోటు తక్కువగా ఉండటం ఇందుకు ఉపకరిస్తాయన్నారు. ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధం ప్రారంభించాక, ముడి చమురు సహా కీలక కమోడిటీ ధరలు పెరగడంతో ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు ఎదురవుతున్నట్లు చెప్పారు. భారత బ్యాడ్ లోన్లు ఆల్ టైమ్ కనిష్టం వద్ద ఉన్నాయన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+