కరోనా మహమ్మారి కారణంగా చాలా కంపెనీలు ఉద్యోగాల కోత/వేతన కోతను అమలు చేస్తున్నాయి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఇండియా బుల్స్ గ్రూప్ కూడా తమ ఖర్చులు తగ్గించుకునే ఉద్దేశ్యంలో భాగంగా 2,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఈ కంపెనీలో 26,000 మంది పని చేస్తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరం చివరలో పనితీరు ఆధారంగా వారికి వెళ్లిపోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఖర్చుల తగ్గింపులో భాగంగా సీనియర్ మేనేజ్‌మెంట్ వేతనంలో 35 శాతం కోత విధించారు. కంపెనీ చైర్మన్ సమీర్ గెహ్లాట్ కూడా ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం వేతనం వదులుకున్నారు. వైస్ చైర్మన్ గగన బంగా వేతనంలో 75 శాతం కోత విధించారు.

వాట్సాప్ కాల్ చేసి రాజీనామా కోరారు..
ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా పనితీరు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. కానీ కరోనా దెబ్బతో ఖర్చులు తగ్గించుకునే క్రమంలో తొలగించినట్లుగా భావిస్తున్నారు. తొలగింతపై కొంతమంది ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా తమ ఆందోళనను, అసంతృప్తిని వ్యక్తం చేశారు. వాట్సాప్ కాల్ చేసి తమను రాజీనామా చేయమని కోరినట్లు వెల్లడిస్తున్నారట.

మే నెలకు మాత్రమే వేతనం..
మరికొంతమంది ట్విట్టర్ ద్వారా తమను రాజీనామా చేయమని కంపెనీ కోరినట్లు తెలిపారు. మే 31వ తేదీ లోపు రాజీనామా చేయమన్నారని, ఎలాంటి ప్యాకేజీ లేదా నోటీస్ పీరియడ్ ఇవ్వడం లేదని పేర్కొంటున్నారట. మే నెలకు వేతనం చెల్లిస్తామని చెబుతున్నారట.

బిజినెస్ లేదని తొలగింత కాదు..
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇండియాబుల్స్ కన్స్యూమర్ ఫైనాన్స్, నాగపూర్‌లో పని చేస్తున్న ఉద్యోగుల్లో 50 మందిని మే 31వ తేదీలోగా రాజీనామా చేయమని చెప్పారని ఓ ఉద్యోగి వెల్లడించినట్లుగా ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. కరోనా - లాక్ డౌన్ నేపథ్యంలో బిజినెస్ లేదని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. అదే సమయంలో దీనిని ధృవీకరించాల్సి ఉందని కూడా సదరు మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే ఇది ప్రతి ఏటా సాధారణ ప్రక్రియ అని, బిజినెస్ లేదని ఉద్యోగులను తొలగించలేదని ఇండియాబుల్స్ చెబుతోంది.

మళ్లీ నియామకాలు..
కంపెనీలో ఇప్పుడు వర్క్ ఫోర్స్‌ను జోడించలేని పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో వర్క్ పోర్స్‌ను పెంచుకునే అవకాశాలు ఉన్నట్లు ఇండియాబుల్స్ చెబుతోంది. బిజినెస్ లేనందున సాధ్యమైనంత వరకు కస్టమర్లను మారటోరియం ఎంచుకోవద్దని సూచించాలని ఉద్యోగులకు కూడా కంపెనీ చెబుతోందట. ఈ కంపెనీకి సంబంధించి రిటైల్ సెగ్మెంట్‌లో వ్యాల్యూ పరంగా 50 శాతం, హోల్ సేల్ సెగ్మెంట్‌లో 70 శాతం మంది మారటోరియం ఎంచుకున్నారట.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications