India Debt: అప్పుల కుప్పగా అఖండ భారత్.. దేశాభివృద్ధి అంతా డొల్లేనా..?
Economy: నరేంద్ర మోదీ సారథ్యంలో ఇండియా వృద్ధి పథంలో దూసుకుపోతోంది. అన్ని రంగాల్లో గణనీయమైన డెవలప్ మెంట్ ను కనబరుస్తోంది. అగ్రదేశాలు తడబడుతున్న తరుణంలోనూ ఓ 'బ్రైట్ స్పాట్'గా ఎదుగుతోంది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచేందుకు తహతహలాడుతోంది. అయితే ఇదంతా నాణానికి ఒక వైపేనని గణాంకాలు చెబుతున్నాయి.
సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో దేశం మొత్తం అప్పులు (మార్కెట్‌లో ట్రేడ్ అవుతున్న బాకీలు) 205 లక్షల కోట్లకు పెరిగినట్లు ఇండియాబాండ్స్.కాం నివేదిక తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఈ రుణభారం 200 లక్షల కోట్లని వెల్లడించింది. అంటే దాదాపు 6 నెలల్లోనే 5 లక్షల కోట్లు మేర అప్పులు పెరిగినట్లు పేర్కొంది.

ఇదే సమయంలో కేవలం కేంద్ర ప్రభుత్వ అప్పు 161.1 లక్షల కోట్లకు చేరుకున్నట్లు ఇండియా బాండ్స్ సహవ్యవస్థాపకులు విశాల్ గోయెంకా వివరించారు. మార్చి త్రైమాసికంలోని 150.4 నుంచి 6 నెలల్లోనే దాదాపు 11 లక్షల కోట్లు పెరిగినట్లు చెప్పారు. ఈ గణాంకాలను లెక్కించేందుకు రిజర్వ్ బ్యాంక్, క్లియరింగ్ కార్పొరేషన్, సెబీ డేటాను ప్రామాణికంగా తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
ఇండియా బాండ్స్.కాం అనేది పెట్టుబడి పరిష్కారాలను అందించేందుకు సెబీ వద్ద నమోదైన ఆన్ లైన్ బాండ్ ప్లాట్ ఫారమ్. అందుబాటులోని డేటాను విశ్లేషించిన అనంతరం.. దేశం మొత్తం అప్పులో 46.04 శాతం (161.1 లక్షల కోట్లు) వాటాతో కేంద్ర ప్రభుత్వం టాప్ ప్లేస్ లో ఉన్నట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాల రుణాలు 24.4 శాతం (50.18 లక్షల కోట్లు), ట్రెజరీ బిల్లుల విలువ 4.51 శాతం (9.25 లక్షల కోట్లు), రెండో త్రైమాసికం నాటికి కార్పొరేట్ బాండ్ల వాటా 21.52 శాతమని (44.16 లక్షల కోట్లు) తేల్చింది.


Click it and Unblock the Notifications