2022-23 ఆర్థిక సంవత్సరం నుండి 2029-30 ఆర్థిక సంవత్సరం వరకు... 8 ఏళ్లలో 9 కోట్ల మంది వ్యవసాయేతర ఉద్యోగాల వేటలో ఉంటారని మెకన్సీ గ్లోబల్ ఇనిస్టిట్యూట్(MGI) అంచనా వేసింది. వీరందరికీ ఉద్యోగాలు దక్కాలంటే మన దేశంలో ప్రతి సంవత్సరం వృద్ధి రేటు 8 శాతం నుండి 8.5 శాతం మేర ఉండాలని పేర్కొంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మహిళా ప్రాతినిథ్యం పెరిగి, 5.5 కోట్ల మంది మహిళలు ఉద్యోగాన్వేషణలో ఉంటారని తెలిపింది. ఈ సంఖ్య అదనమని వెల్లడించింది.

వృద్ధి, ఉద్యోగాల పెంపుకు ఆర్థిక అజెండా
వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి కోట్లాది మంది కొత్తవారు ఉద్యోగ అన్వేషణలో ఉంటారని, ఇంతపెద్ద సంఖ్యలో ఉద్యోగాలు అందుబాటులోకి రావాలంటే భారీ సంస్కరణలు తప్పవని మెకన్సీ నివేదిక పేర్కొంది. లేదంటే పదేళ్ల కాలంలో నిరుద్యోగిత రేటు భారీగా పెరగడం, గరిష్టస్థాయిలో ఆర్థిక వ్యవస్థలో స్తబ్దత నెలకొంటుందని హెచ్చరించింది. ఈ మేరకు 'ఇండియాస్ టర్నింగ్ పాయింట్ -అన్ ఎకనమిక్ అజెంటా టు స్పర్ గ్రోత్ అండ్ జాబ్స్' (భారత్ టర్నింగ్ పాయింట్-వృద్ధి, ఉద్యోగాల ప్రోత్సాహానికి ఆర్థిక అజెండా) అనే శీర్షికతో ఈ నివేదిక విడుదల చేసింది.

కోట్లాది ఉద్యోగాలు అవసరం
మెకన్సీ నివేదిక అంచనాల ప్రకారం 6 కోట్ల మంది కొత్తగా శ్రామిక శక్తికి జత కలుస్తారు. మరో 3 కోట్ల మంది వ్యవసాయం నుండి ఉత్పాదక రంగం వైపు వస్తారని అంచనా వేసింది. కరోనా అనంతరం 2029-2030 ఆర్థిక సంవత్సరం వరకు ప్రతి ఏడాది వ్యవసాయేతర రంగంలో కొత్తగా 1.2 కోట్ల ఉద్యోగాల వృద్ధి కీలకమని తెలిపింది. 2012-18 మధ్య కేవలం 40 లక్షల ఉద్యోగాలు మాత్రమే అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది.

మార్పులు..
ఉత్పాదక, వ్యవసాయ ఎగుమతులు, డిజిటల్ సేవలు వంటి రంగాల్లో గ్లోబల్ హబ్స్ ఏర్పాటు చేయడంతో పాటు పోటీతత్వాన్ని పెంచడం, రవాణా, విద్యుత్ రంగాలను పటిష్టపరచడం ముఖ్యమని తెలిపింది. సరికొత్త జీవన, పని విధానాలు, షేరింగ్ ఎకానమీ, ఆధునీకరించబడిన రిటైల్ వ్యవస్థ వంటి వినూత్న విధానాలకు మార్పు చెందాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ రంగాలు 2030 నాటికి 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తాయని తెలిపింది.

కంపెనీలు..
ఎగుమతులు సహా వివిధ అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే ఇండియా తమ పెద్ద కంపెనీలు సహా అన్నింటిని మూడు రెట్లకు పెంచుకోవాలని అభిప్రాయపడింది. దేశంలో ప్రస్తుతం 600 పెద్ద కంపెనీలు ఉన్నాయి. వీటి రెవెన్యూ 500 మిలియన్ డాలర్లకు పైగా ఉంది. ఇవి సగటున 11 శాతం ఉత్పాదకతను కలిగి ఉంటాయి. ఎగుమతుల్లో 40 శాతం వరకు ఉంటుంది. 2018లో జీడీపీలో పెద్ద కంపెనీల కాంట్రిబ్యూషన్ 48 శాతంగా ఉండగా, 2030 నాటికి 70 శాతంగా ఉండాలని తెలిపింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications