సింధు నదిపై భారత్ ఆనకట్టలు కడితే బాంబులతో పేల్చేస్తాం.. రెచ్చిపోయిన పాక్ ఆర్మీ చీఫ్, భారత్ స్పందన ఏంటంటే..

పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. ఆయన ఫ్లోరిడాలోని టాంపాలో ఓ కార్యక్రమంలో అక్కడ ఉన్న పాక్‌ పౌరులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తమ నాశనం అంటూ జరిగితే.. మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాది అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశమన్నారు. అవసరమైతే అణు యుద్ధానికి దిగుతాం. సింధూ నదిపై భారత్ డ్యామ్‌లు నిర్మించే వరకు మేం ఎదురుచూస్తాం. వారు కట్టే ఆనకట్టలను 10 క్షిపణులతో పేల్చేస్తామని కవ్వింపు చర్యలకు దిగారు.

ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపాయి. దీంతో భారత్ ఘాటుగా బదులిచ్చింది. అమెరికాలో పర్యటిస్తున్న సమయంలో చేసిన ఈ అణు బెదిరింపులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇవి కేవలం ప్రాంతీయ భద్రతకే కాకుండా, ప్రపంచ భద్రతకు కూడా పెద్ద ముప్పు అని భారత్ స్పష్టం చేసింది. పాక్‌లో అణు ఆయుధాలు ప్రభుత్వేతర శక్తుల (ఉగ్రవాదుల) చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

India Pakistan trade tensions Pakistan nuclear remarks Asim Munir US speech India slams Pakistan Indo-Pak trade impact investor confidence South Asia regional market stability geopolitical tensions India Pakistan cross-border trade disruption Pakistan army chief remarks

ఇది పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం లోపమని తెలిపింది. సైన్యం అధికారం, ఉగ్రవాద ముప్పును స్పష్టంగా ప్రతిబింబిస్తుందని, ఇలాంటి బాధ్యతారాహిత్యపు వ్యాఖ్యలు పాకిస్థాన్ నిజ స్వరూపాన్ని బయటపెడుతున్నాయని భారత విదేశాంగ వర్గాలు వ్యాఖ్యానించాయి. కాగా అమెరికా-భారత్ మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా గడ్డ మీద పాక్ ఆర్మీ చీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే భారత్- అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ఇంకా కొలిక్కి రావడం లేదు. పైగా ట్రంప్ 50 శాతం అదనపు సుంకాలు విధించారు. ఇలాంటి సమయంలో ఈ వ్యాఖ్యలు తీవ్ర ఆందోళన రేపుతున్నాయి.

గత రెండు నెలల్లో మునీర్‌ అమెరికా పర్యటనకు రెండోసారి వెళ్లడం గమనార్హం. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' అనంతరం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన విందులో మునీర్ హాజరయ్యారు. ఆ సందర్భంలో ట్రంప్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలని పాకిస్థాన్ తరఫున ప్రతిపాదించారు. పాక్ తదుపరి అధ్యక్ష పదవి రేసులో మునీర్ పేరు ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో అమెరికా గడ్డ నుంచే మరో దేశానికి అణు బెదిరింపులు చేయడం అంతర్జాతీయ వర్గాలను ఉలిక్కిపడేలా చేసిందని చెప్పవచ్చు.

దీనిపై భారత్ ధీటుగానే బదులిచ్చింది. పాకిస్థాన్ అణు బెదిరింపులకు తలొగ్గేది లేదని స్పష్టం చేసింది. జాతీయ భద్రత కోసం అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని భారత్ తెలిపింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో దక్షిణాసియా ప్రాంతంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఏదేమైనా భారత్‌తో సరిహద్దు ఉద్రిక్తతల మంటలు ఇంకా చల్లారక ముందే పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అండతోనే పాకిస్తాన్‌ ఇలా రెచ్చిపోతోందని పలువురు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+