India America Defence Deal Latest News: దాయాది దేశం పాకిస్తాన్ కు షాకిస్తూ.. భారత రక్షణ వ్యవస్థలో మరో కీలకమైన ముందడుగు పడింది. అగ్రరాజ్యం అమెరికాతో భారత్ 10 సంవత్సరాల రక్షణ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ మేరకు అమెరికా నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్..అలాగే అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్‌ల మధ్య ఒప్పందం ఖరారు అయినట్లుగా పెంటగాన్ అధికారిక ప్రతినిధి వెల్లడించారు. ఆయన ప్రకటన ప్రకారం వచ్చే 10 ఏళ్ల పాటు.. రెండు దేశాల మధ్య ఆధునిక సాంకేతిక పరికరాలపై రక్షణ ఒప్పందం జరిగినట్లుగా తెలుస్తోంది.
ఈ ఏడాది చివర్లో జరిగే తదుపరి సమావేశంలో 10 సంవత్సరాల అమెరికా-భారత రక్షణ ఒప్పందంపై సంతకం చేయడానికి కార్యదర్శి హెగ్సేత్, భారత రక్షణ మంత్రి సింగ్ అంగీకరించినట్లుగా పెంటగాన్ ప్రకటన తెలిపింది.ఈ రక్షణ ఒప్పందం రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింతగా బలోపేతం చేస్తుంది. దాయాది దేశం పాకిస్తాన్ భారత్ మీద ఎప్పుడు పడితే అప్పుడు కయ్యానికి కాలు దువ్వుతున్న నేపథ్యంలో ఈ ఒప్పందం ప్రాధాన్యతను సంతరించుకుంది.

కాగా గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం- అమెరికా మధ్య రక్షణ సహకారం వేగంగా వృద్ధి చెందుతోంది. రానున్న 10 సంవత్సరాల ఒప్పందం ఈ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళుతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు..
గత మంగళవారం రెండు దేశాల రక్షణ మంత్రుల మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే రోజు హెగ్‌సెత్ అమెరికా పెంటగాన్‌లో భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్‌ను కూడా కలిసారు. ఈ సమావేశాల్లో భారత-అమెరికా రక్షణ భాగస్వామ్యం, భద్రతా అంశాలు, ఆధునిక సాంకేతికతపై చర్చించినట్లుగా వార్తలు వస్తున్నాయి. పెంటగాన్ సీనియర్ ప్రతినిధి కర్నల్ క్రిస్ డివైన్ ప్రకారం..భారత్ అమెరికా యొక్క కీలక రక్షణ భాగస్వామిగా ఉంది. కాబట్టి రెండు దేశాల మధ్య సంబంధాన్ని మరింత బలపర్చుకోవడమే మాకు ముఖ్యమ హెగ్‌సెత్ పేర్కొన్నట్లుగా తెలిపారు.
2025లో ఫిబ్రవరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రధాని నరేంద్ర మోదీ కలిసిన ఇచ్చిన ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్న రక్షణ వ్యవస్థ లక్ష్యాలను సాధించడంపై ఇరు దేశాల మంత్రులు చర్చించారు. అమెరికా నుండి మన దేశానికి పెండింగ్‌లో ఉన్న ప్రధాన రక్షణ సరఫరాలు, రక్షణ పరిశ్రమలో సహకారాన్ని మెరుగుపరచాల్సిన ఆవశ్యకతలను వారు గుర్తించారు. ఈ ఒప్పందంతో పాటు, అమెరికా- భారత్‌లు రాబోయే ఇండస్-ఎక్స్ (INDUS-X) సమ్మిట్‌ను స్వాగతించాయి. ఇది రెండు దేశాల మధ్య రక్షణ సాంకేతికత అభివృద్ధికి కీలకమైన వేదికగా మారనుంది.
అలాగే, ఆటోనమస్ సిస్టమ్స్ ఇండస్ట్రీ అలయన్స్ (ASIA) ప్రారంభాన్ని కూడా జయశంకర్, హెగ్‌సెత్‌లు స్వాగతించారు. అమెరికా రక్షణ మంత్రి హెగ్‌సెత్ మాట్లాడుతూ.. భారత సైన్యంలోకి అమెరికా రక్షణ ఆయుధాలు ఎంట్రీ ఇచ్చాయి. మరిన్ని కీలక రక్షణ ఒప్పందాలను ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని రెండు దేశాలు కలిసి ఉత్పత్తిని మరింతగా పెంచే దిశగా నిర్ణయాలు ఉంటాయని ఆశిస్తున్నామని తెలిపారు.
భారత విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ.. అగ్రరాజ్యం అమెరికాతో మన సంబంధాల్లో రక్షణ భాగస్వామ్యం అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా నిలిచింది. ఇది కేవలం దేశ ప్రయోజనాలపైనే కాకుండా.. సామర్థ్యాలతో పాటు రెండు దేశాల పరస్పర బాధ్యతల సమన్వయంపై ఆధారపడిందని చెప్పారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక స్థిరత్వం కోసం ఈ సహకారం కీలకమని ఆయన తెలిపారు. రాబోయే ఇండియా-అమెరికా డిఫెన్స్ యాక్సిలరేషన్ ఈకోసిస్టమ్ సమ్మిట్‌లో పాల్గొనడానికి ఇరు దేశాలు సిద్ధంగా ఉన్నాయని జైశంకర్ తెలిపారు.
More From GoodReturns

Oil prices: జపాన్ రహస్య ఆయిల్ నిధి! ఆరు నెలలకు సరిపడా చమురుని జపాన్ ఎలా దాచిపెట్టింది?

యుద్దం ఆపడం మా చేతుల్లో ఉంది.. నీ చేతుల్లో కాదు.. ట్రంప్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ విసిరిన ఇరాన్..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

Russian oil: ట్రంప్ క్లెయిమ్ VS రియాలిటీ.. రష్యా ఆయిల్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన న్యూఢిల్లీ!

భారత్ టైర్ పరిశ్రమను కుదిసేస్తున్న ఇరాన్ యుధ్ద ప్రభావం.. కీలకమైన హెచ్చరిక చేసిన CLSA

Iran war: ఇరాన్లో హై అలర్ట్: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా.. ఏం జరుగుతోంది?

ఇరాన్ మీద దాడులు.. బట్ట బయలైన అమెరికా కుట్రలు.. ప్రపంచానికి నిజాన్ని తెలిపిన స్పెయిన్..

ఇరాన్–అమెరికా యుద్ధంపై షాకింగ్ న్యూస్.. ఎవరి ఆయుధాలు ముందుగా అయిపోతాయో తెలుసా..

భారత ఆర్థిక వ్యవస్థని కుదిపేస్తున్న గల్ఫ్ యుద్ధ మంటలు.. ప్రమాదంలో 9 కోట్ల మంది పంపే డబ్బు ..



Click it and Unblock the Notifications