భారతదేశ ఇంధన భద్రతను బలోపేతం చేసే దిశలో భాగంగా కీలకమైన నిర్ణయాన్ని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి సోమవారం ప్రకటించారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (PSUs) అమెరికా నుండి ద్రవీకృత పెట్రోలియం వాయువు (LPG) దిగుమతి చేసుకోవడానికి మొదటిసారిగా ఒక సంవత్సరపు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని ఆయన తెలిపారు. ఈ ఒప్పందం భారతదేశ LPG మార్కెట్‌లో ఒక చారిత్రాత్మక మొదటిది నిర్ణమని మంత్రి పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సందేశంలో పూరి చెబుతూ.. ఈ ఒప్పందం భారత LPG సరఫరా వ్యవస్థలో భారీ మార్పుకు దారితీస్తుందని స్పష్టంచేశారు. ఇప్పటి వరకు భారతదేశం ప్రధానంగా మధ్యప్రాచ్య దేశాలపై LPG కోసం ఆధారపడేదని, కానీ ఈ కొత్త ఒప్పందంతో సోర్సింగ్‌ను వైవిధ్యపరచడం ప్రారంభమైందని తెలిపారు. ప్రపంచంలోనే వేగంగా పెరుగుతున్న Liquefied Petroleum Gas మార్కెట్లలో ఒకటైన భారత్.. ఇప్పుడు అమెరికా సరఫరాదారులకు అధికారికంగా తెరుచుకుంటోంది. ఇది సరఫరా భద్రతకు, ధరల నియంత్రణకు, భవిష్యత్ అవసరాల నిర్వహణకు చాలా కీలకమైన విజయంగా పేర్కొనాలని హర్దీప్ సింగ్ పూరి అన్నారు.
ఈ ఒప్పందం ప్రకారం.. భారతీయ PSUలు 2026 కాంట్రాక్ట్ సంవత్సరంలో సుమారు 2.2 మిలియన్ టన్నుల (MTPA) LPG ని అమెరికా నుండి దిగుమతి చేసుకోనున్నాయి. ఈ పరిమాణం భారత దేశం ప్రతీ ఏడాది దిగుమతి చేసుకునే మొత్తం LPGలో దాదాపు 10 శాతంకు సమానం. ఈ సరఫరా అమెరికా గల్ఫ్ కోస్ట్ ప్రాంతం నుండి వస్తుండటం గమనార్హం. ఇది భారత్‌కు అమెరికా నుండి LPG కోసం ఏర్పడిన తొలి నిర్మాణాత్మక దీర్ఘకాలిక ఒప్పందమని చెప్పవచ్చు.

ఈ డీల్‌కు ధర నిర్ణయాన్ని ప్రపంచంలో LPG ధరలకు ప్రామాణికమైన మౌంట్ బెల్వియూ బెంచ్‌మార్క్ కి అనుసంధానించి కుదుర్చుకున్నారు. ఇందుకోసం ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం సంస్థల ప్రతినిధులు అమెరికా ప్రధాన ఉత్పత్తిదారులుతో గత కొన్ని నెలలుగా చర్చలు జరిపారని మంత్రి వివరించారు. దీని ఫలితంగానే ఈ ముఖ్యమైన ఒప్పందం ఆమోదం పొందింది.
LPG ధరల మార్పులతో దేశంలోని వినియోగదారులు ఇబ్బందులు పడకుండా కేంద్ర ప్రభుత్వం నిరంతర చర్యలు తీసుకుంటోందని పూరి గుర్తుచేశారు. ప్రత్యేకించి, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారుల కోసం ప్రభుత్వం భారీ సబ్సిడీలు కొనసాగిస్తోందని ఆయన అన్నారు. అంతర్జాతీయ ఎల్‌పిజి ధరలు గత ఏడాది 60 శాతం వరకు పెరిగినప్పటికీ, ఉజ్వల వినియోగదారులు సిలిండర్‌కు కేవలం రూ. 500-550 మాత్రమే చెల్లించేలా సబ్సిడీ అందించబడింది. వాస్తవ ధర రూ. 1,100 దాటిన సమయంలో కూడా ప్రభుత్వం రూ. 40 వేల కోట్లకు పైగా వ్యయం చేసి, పేద కుటుంబాలను ధరల దెబ్బ నుండి రక్షించిందని మంత్రి తెలిపారు.
ఈ కొత్త అమెరికా LPG సరఫరా ఒప్పందం, భారతదేశం దీర్ఘకాలిక ఇంధన వ్యూహంలో ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తుందని పూరి అభిప్రాయపడ్డారు. సరఫరా మార్గాలను విస్తరించడం, భవిష్యత్ ధరల అస్థిరతను తగ్గించడం, వినియోగదారుల అవసరాలను భద్రపరచడం వంటి అంశాలలో ఈ ఒప్పందం కీలకపాత్ర పోషించనుంది.
More From GoodReturns

LPG: భారత్‌కు కొత్త తలనొప్పి.. ఆ భారీ రిఫైనరీ మూసివేత! ఇక తిప్పలు తప్పవా?

పిఎన్జి కనెక్షన్ కోసం ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి..స్టెప్ బై స్టెప్ గైడ్..

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

ఇరాన్ మా షరతులకు ఒప్పుకుంది..అణ్వాయుధాలు విడిచిపెడుతోంది..ట్రంప్ సంచలన ప్రకటన..

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

పాకిస్తాన్లా బ్రోకర్ పనులు భారత్ ఎప్పటికీ చేయదు.. ట్రంప్‌తో ఫోన్లో ప్రధాని మోదీ మాట్లాడారు: జైశంకర్

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..



Click it and Unblock the Notifications