భారత్ కు బంపర్ ఆఫర్ తగిలేలా ఉంది. పొరుగు దేశం చైనా తో తగువు నేపథ్యంలో అగ్ర రాజ్యం అమెరికా మనకు అన్ని రకాలుగా అండగా నిలబడే సూచనలు కనిపిస్తున్నాయి. చైనా పై పదే పదే విరుచుకుపడే ప్రెసిడెంట్ ట్రంప్... భారత్ కు స్నేహ హస్తం అందించేలా ఉన్నారు. మరో వైపు త్వరలోనే అమెరికా లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయనకు భారత్ తో స్నేహం తప్పనిసరిగా మారింది. ఎందుకంటే అమెరికా లో స్థిరపడిన భారతీయులు అక్కడ ఎన్నికల్లో చెప్పుకోదగిన ప్రభావం చూపుతున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని విజయం సొంతం చేసుకుంటున్నారు కూడా.
కాబట్టి, ఎన్నికల కంటే ముందుగానే భారత్ తో మెరుగైన వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుని తాము అన్ని విధాలా భారత్ వెన్నంటే ఉంటామనే సంకేతాలను అందించాల్సిన తరుణం ఆసన్నమైంది. చైనా తో రెండేళ్ల క్రితం నుంచే ట్రంప్ ఎడ మొహం, పెడ మొహం లా ఉంటున్నారు. చైనా వస్తువులపై భారీ స్థాయిలో పన్నులు మోపి వాటిని అమెరికాలో నిరుత్సాహపరుస్తున్నారు. అదే సమయంలో చైనా లో ఉన్న అమెరికా కంపెనీలను స్వదేశానికి, లేదా ఇతర మిత్ర దేశాలకు వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు. చైనా లో కరోనా మొదలైన నాటి నుంచి ఆ దేశంపై ట్రంప్ కు మరింత విరక్తి కలిగినట్లు అయన బాహాటంగా చేసే ప్రకటనలే స్పష్టం చేస్తున్నాయి.

ఎఫ్ టీ ఏ దిశగా అడుగులు...
భారత్ - అమెరికా ల మధ్య స్వేఛ్చా వాణిజ్య ఒప్పందం (ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ - ఎఫ్ టీ ఏ) కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే భారత్ వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, అమెరికా సెక్రటరీ ఆఫ్ కామర్స్ విల్బర్ రైస్ ల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. నిన్ననే ఇరు దేశాల మంత్రులు ఈ మేరకు చర్చించారని, అందులో భాగంగా తొలుత ప్రాథమిక పరిమిత ట్రేడ్ ప్యాకేజీ తో మొదలు పెట్టి .. పూర్తి స్థాయి స్వేఛ్చా వాణిజ్య ఒప్పందం దిశగా ముందుకు సాగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రాథమిక ప్యాకేజీ విధివిధానాలు ఎలా ఉండాలన్న విషయంపై ప్రస్తుతం తీవ్ర స్థాయిలో మంతనాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

వివాదాల పరిష్కారం...
అమెరికా - భారత్ ల మధ్య నెలకొన్న అనేక వాణిజ్య, అనుబంధ రంగాల్లో నెలకొన్న వివాదాల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. రెండు దేశాల మధ్య పూర్తి స్థాయి వాణిజ్య ఒప్పందం ఉండాలని పారిశ్రామికవేత్తలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అపార మానవ వనరులు ఉన్న భారత్ తో ఇలాంటి ఒప్పందం ఉంటె.. అది అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడ ఇతోధికంగా దోహదపడుతుందని అక్కడి పారిశ్రామిక, ఆర్థిక, రాజకీయవేత్తల అభిప్రాయం. కానీ ఇప్పటి వరకు అనేక కారణాల వల్ల దీనిపై పురోగతి కనిపించలేదు. అమెరికా ఎప్పటి నుంచో ఇండియా తో సమానంగా పాకిస్తాన్ తో స్నేహం చేస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే పాకిస్తాన్ కు అధిక ప్రాధాన్యం ఇస్తుండేది. అది రాజకీయ అవసరాల కోసం. కానీ చైనాతో దోస్తీ కారణంగా పాకిస్తాన్ అమెరికా తో స్నేహాన్ని కొంత వరకు వదులుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా మెల్లిగా భారత్ వైపు చూస్తోంది.

ఏమిటీ ప్రయోజనం...
రెండు దేశాల మధ్య స్వేఛ్చా వాణిజ్య ఒప్పందం (ఎఫ్ టీ ఏ ) కుదిరితే అది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విపరీతంగా పెరిగేందుకు దోహదపడుతుంది. రెండు దేశాల మధ్య వస్తు, సేవల ప్రవాహం చాలా స్వేఛ్చగా జరుగుతుంది. అనేక ఉత్పత్తులు, సేవల పై టారిఫ్ లు అసలు ఉండవు. లేదా చాలా తక్కువగా ఉంటాయి. దీంతో ఒక దేశానికి కావాల్సిన అవసరాలను ఇతర దేశంలో ఉన్న వనరులతో తీర్చుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. దీంతో వ్యవసాయం మొదలు కొని, సాఫ్ట్ వేర్ వరకు అన్ని రంగాల్లో నూ మెరుగైన ఎగుమతి, దిగుమతులకు ఆస్కారం ఉంటుంది. 2018-19 ఆర్థిక సంవత్సరం లో అమెరికా - ఇండియా ల మధ్య 88 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది. ఇది 2019-20 నాటికి 100 బిలియన్ డాలర్ల కు చేరుకున్నట్లు సమాచారం. దీంతో ద్వైపాక్షిక వాణిజ్యంలో చైనా ను తోసిరాజని అమెరికా ముందు వరుసలోకి వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. ఎఫ్ టీ ఏ కుదిరితే ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది.
More From GoodReturns

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications