భారత్-యూకే ట్రేడ్ డీల్.. మందుబాబులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గే వస్తువుల ధరలు ఇవే..

భారతదేశ ప్రపంచ వాణిజ్య ప్రయాణంలో మరో ముందడుగు పడింది. India-UK సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (CETA) నేటి నుండి అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక మైలురాయిగా అభివర్ణించారు. ఇది విక్సిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు ఎంతగానో దోహదపడుతుందన.. అలాగే దేశంలోని రైతులు, కార్మికులు, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు, ఆవిష్కర్తలకు సరికొత్త అవకాశాలను సృష్టిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం యూకే ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగాచ.. అత్యంత కీలకమైన అధిక-ఆదాయ మార్కెట్‌గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, తగ్గుతున్న డిమాండ్ వంటి సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత తరుణంలో.. ఈ ఒప్పందం భారతీయ తయారీదారులకు తమ ఎగుమతులను వైవిధ్యపరచుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. పారిశ్రామిక సంస్థ అసోచామ్ (ASSOCHAM) అంచనా ప్రకారం.. బలమైన వస్తు ఎగుమతులు, సేవల వాణిజ్యం, అధిక పెట్టుబడుల ప్రవాహం కారణంగా 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు రెట్టింపు అయ్యి సుమారు 120 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది.

India UK Trade Deal India UK FTA Free Trade Agreement India UK Agreement UK Trade Pact Textile Exports Gems and Jewellery Auto Components Leather Industry IT Services Indian Economy Exports Business News Trade Agreement FTA

ఈ ఒప్పందం వల్ల భారతదేశ ఎగుమతిదారులకు భారీ లాభం చేకూరనుంది. యూకేకు జరిగే భారతీయ ఎగుమతులలో దాదాపు 99 శాతానికి సుంకం రహిత ప్రవేశం లభించనుంది. దీనివల్ల బ్రిటన్ మార్కెట్లో గతంలో దిగుమతి సుంకాలను ఎదుర్కొన్న వేలాది భారతీయ ఉత్పత్తులు ఇప్పుడు ఎలాంటి పన్నులు లేకుండా ప్రవేశించగలవు. తద్వారా యూరప్, చైనా వంటి ఇతర పోటీ దేశాల ఉత్పత్తులతో పోలిస్తే భారతీయ వస్తువులు మరింత పోటీతత్వాన్ని సంతరించుకుంటాయి.

దేశంలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న శ్రమ-కేంద్రీకృత రంగాలైన వస్త్రాలు-దుస్తులు, తోలు-పాదరక్షలు, రత్నాలు-ఆభరణాలు, సముద్ర ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు, ఆటో విడిభాగాలు, రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయ ఉత్పత్తులు ఈ సుంకాల తొలగింపు ద్వారా అత్యధికంగా లబ్ధి పొందనున్నాయి. ఇది ఆయా రంగాల లాభాల మార్జిన్లను మెరుగుపరచడమే కాకుండా.. అధిక ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ తయారీ క్లస్టర్లలో కొత్త ఉద్యోగాల సృష్టికి కారణమవుతుంది. యూకే ఇప్పటికే భారతదేశానికి ఐదవ అతిపెద్ద వస్తు ఎగుమతి గమ్యస్థానంగా ఉన్నప్పటికీ.. మన మొత్తం దిగుమతులలో దాని వాటా కేవలం 1 శాతం మాత్రమే ఉంది.తాజా ఒప్పందంతో మరింత సమతుల్యమైన వాణిజ్య సంబంధానికి ఆస్కారం ఏర్పడుతుందని వయానా ప్రెసిడెంట్ కౌశల్ సంపత్ విశ్లేషించారు.

Also Read

కేవలం వస్తువుల రంగానికే కాకుండా.. సేవల రంగానికి కూడా ఈ ఒప్పందం పెద్ద పీట వేసింది. యూకే మార్కెట్లో సులభమైన ప్రవేశం, స్పష్టమైన నియంత్రణ నిబంధనల వల్ల భారతీయ ఐటీ కంపెనీలు, కన్సల్టింగ్ సంస్థలు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, అకౌంటెంట్లు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, విద్యా సేవా సంస్థలు ప్రయోజనం పొందుతాయి. ఈ ఒప్పందంలో ఏకంగా 137 సేవా ఉప-రంగాలు చేర్చబడ్డాయి.

దీనితో పాటుగా ఇందులో పొందుపరిచిన డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ (DCC) నిబంధన భారతీయ నిపుణులకు పెద్ద ఉపశమనం కలిగించనుంది. దీని ప్రకారం బ్రిటన్‌లో ఐదేళ్ల లోపు తాత్కాలిక అసైన్‌మెంట్‌లపై పనిచేసే భారతీయ ఉద్యోగులు ఇకపై రెండు దేశాలలోనూ సామాజిక భద్రతా చెల్లింపులు చేయనవసరం లేదు. ఇది ఉద్యోగులు, యజమానుల ఖర్చులను తగ్గించి, విదేశాలలో భారతీయ కంపెనీల పోటీతత్వాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. అలాగే వాణిజ్య పరిమాణాలు పెరిగేకొద్దీ వ్యాపారాలు ఆత్మవిశ్వాసంతో విస్తరించడానికి వర్కింగ్ క్యాపిటల్ సకాలంలో అందడం కూడా కీలకమని వయానా ప్రెసిడెంట్ కౌశల్ సంపత్ అభిప్రాయపడ్డారు.

మరోవైపు భారతీయ వినియోగదారులకు కూడా ఈ ఒప్పందం ద్వారా ప్రీమియం బ్రిటిష్ ఉత్పత్తులు చౌకగా లభించనున్నాయి. దిగుమతి చేసుకున్న స్కాచ్ విస్కీ, జిన్, విలాసవంతమైన మోటార్‌సైకిళ్లు, సౌందర్య సాధనాలు, చాక్లెట్లు, బిస్కెట్లు, వైద్య పరికరాలు, ప్రీమియం బ్రిటిష్ కార్ల ధరలు తగ్గడం దీని మొదటి ప్రభావం కావచ్చు. అయితే, ఈ ధరల తగ్గింపు రాత్రికి రాత్రే కాకుండా దశలవారీగా అమల్లోకి వస్తుంది. ఉదాహరణకు ఇప్పటివరకు భారతదేశంలో దిగుమతి చేసుకునే బ్రిటిష్ కార్లపై ఏకంగా 110 శాతం వరకు భారీ సుంకాలు ఉండేవి. తాజా ఒప్పందం ప్రకారం, నిర్దిష్ట వార్షిక కోటాల పరిధిలో దిగుమతి చేసుకునే అర్హత గల వాహనాలపై ఈ సుంకాలు రాబోయే సంవత్సరాల్లో క్రమంగా తగ్గుతాయి.

దేశీయ తయారీదారులకు, భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న విద్యుత్ వాహనాల (EV) పర్యావరణ వ్యవస్థకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం వార్షిక దిగుమతి కోటాలు, కఠినమైన అర్హత షరతులతో కూడిన రక్షణ చర్యలను కూడా ఏర్పాటు చేసింది. అంతిమంగా చౌకైన విలాసవంతమైన వస్తువుల లభ్యత కంటే కూడా.. బలమైన ఎగుమతులు, పునరుత్పాదక ఇంధనం, సాంకేతిక రంగాలలో పెరిగే బ్రిటన్ పెట్టుబడులు, కొత్త ఉద్యోగాల సృష్టి ద్వారానే భారతదేశానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+