trade deficit: గత మూడు నెలలతో పోలిస్తే, మార్చిలో వాణిజ్యలోటు విపరీతంగా పెరిగినట్లు గణాంకాలు వెలువడ్డాయి. దిగుమతుల కంటే పెద్ద మొత్తంలో ఎగుమతులు పడిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు పరిశ్రమల శాఖ మీడియా సమావేశంలో వెల్లడించింది. ఫిబ్రవరిలో 17.43 బిలియన్లుగా ఉన్న లోటు మార్చి నాటికి 19.73 బిలియన్లకు పెరిగినట్లు తెలిపింది.
ఏడాది ప్రాతిపదికన మార్చిలో ఎగుమతులు 13.9 శాతం తగ్గి 38.38 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అయితే ఇప్పటికీ ఎగుమతులు 9 నెలల గరిష్ట స్థాయికి పెరిగడం విశేషం. ఇక దిగుమతుల విషయానికి వస్తే, సంవత్సరానికి 7.9 శాతం క్షీణించి 58.11 బిలియన్లకు చేరుకున్నాయి. ఇవి సైతం 3 నెలల గరిష్టానికి పెరిగడం గమనార్హం. ఒక్కమాటలో చెప్పాలంటే, మార్చిలో ఎగుమతులు 13.3 శాతం పెరగ్గా అంతే స్థాయిలో దిగుమతుల్లోనూ వృద్ధి కనిపించింది.

FY23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను సరుకుల ఎగుమతులు 6.03 శాతం పెరిగి 447.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కాగా ఇదే అత్యధిక రికార్డు. దిగుమతులు విషయానికి వస్తే, 16.5 శాతం పెరిగి 714.24 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందాయి. సేవా రంగంలోనూ రికార్డు స్థాయిలో 26.79 శాతం పెరుగుదల నమోదైంది. మొత్తం వాణిజ్య లోటును గమనిస్తే, అంతకుముందు ఏడాదిలో కనిపించిన 83.5 బిలియన్ డాలర్ల నుంచి FY23లో 122 బిలియన్లకు చేరింది.
దేశీయ సరుకుల ఎగుమతులు FY23లో 6 శాతం పెరిగినా.. రెండో అర్థ సంవత్సరంలో మాత్రం అంతర్జాతీయ మందగమనం, వస్తువుల ధరల్లో బాహ్య డిమాండ్ తగ్గడం, చమురేతర ఎగుమతులు 0.5 శాతం స్వల్ప క్షీణత ఏర్పడినట్లు ICRAకు చెందిన ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్ వెల్లడించారు. FY24లో ఈ ఆందోళనలు తీవ్రతరం కానున్నట్లు అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో ఎగుమతులు తీవ్ర ఒత్తిడికి లోనుకావచ్చని చెప్పారు. ఫలితంగా తయారీ రంగం పనితీరుపై ఈ ప్రభావం పడి, GDP వృద్ధిని కిందకు లాగుతుందన్నారు.
ఇండియా విదేశాలపై అధికంగా ఆధారపడుతున్న పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 5.4 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాదితో పోలిస్తే 44.6 శాతం ఈ విభాగంలో వృద్ధి నమోదైంది. దిగుమతులు సైతం 23.8 శాతం వరకు గణనీయంగా తగ్గాయి. డ్రగ్స్ మరియు ఫార్మాస్యూటికల్ ఎగుమతులను పరిశీలిస్తే 4.2 పెరిగాయి. గతేడాదితో పోలిస్తే బంగారం దిగుమతులు మాత్రం రికార్డు స్థాయిలో 216.75 శాతం ఎగసిపడ్డాయి.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications