కరోనా మహమ్మారి కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం తీవ్రంగా దెబ్బతింటుందని, 2020లో 4.5 శాతం ప్రతికూలత నమోదు చేస్తుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపినాథ్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ పరిణామాలతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడం ఇందుకు కారణమని పేర్కొంది. 1961 తర్వాత భారత్‌కు ఇది అత్యంత తక్కువ వృద్ధి రేటు అని తెలిపింది. ఏప్రిల్‌లో వేసిన అంచనాతో పోలిస్తే ఇది 1.9 శాతం తక్కువ. వృద్ధి రేటు భారీగా పడిపోవడం మార్కెట్ పైన ప్రభావం చూపింది.

ఆరోగ్య సంక్షోభం తగ్గేకొద్దీ...
2020 - 2021 సంవత్సరాల్లో భారత్ 1 శాతం కంటే ఎక్కువ అభివృద్ధిని నమోదు చేస్తుందని గీతా గోపినాథ్ చెప్పారు. రెండేళ్లలో ఇది బలమైన అభివృద్ధి కాదని తెలిపారు. ప్రపంచంలోని ఎన్నో దేశాల మాదిరిగానే ఇది ఉందన్నారు. 2020లో భారత వృద్ధి రేటు 4.5 శాతం, ప్రపంచ వృద్ధి రేటు 4.9 శాతం క్షీణిస్తుందని ఐఎంఎఫ్ తెలిపింది. ఏప్రిల్‌లో 3 శాతం క్షీణతను అంచనా వేసింది. భారత్ భారీ తిరోగమనంలో ఉందని, ఆరోగ్య సంక్షోభం (కరోనా) తగ్గుతున్న కొద్ది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ కూడా కోలుకుంటుందని చెప్పారు.

ప్రధానికి 3 సలహాలు.. మోడీకి మంచి అవకాశం
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని నరేంద్రమోడీకి ఏం సలహాలు ఇస్తారని అడగగా, గీతా గోపినాథ్ స్పందిస్తూ... భారత్ తన టెస్టింగ్ కెపాసిటీని పెంచుకోవాలన్నారు. మరిన్ని బడ్జెట్ ఖర్చులు కూడా ఉపకరిస్తాయని తెలిపారు. డైరెక్ట్ క్యాష్ ట్రాన్సుఫర్, దెబ్బతిన్నవారికి లేదా ఎంఎస్ఎంఈలకు ప్రత్యక్ష నగదు, ఇతర మార్గాల ద్వారా మరింత సహకారం అవసరమని తెలిపారు. మూడో విషయం ఏమంటే మరిన్ని సంస్కరణలకు ఇది మంచి అవకాశం అని చెప్పారు.

చైనాలో సానుకూల వృద్ధి
2020లో మొదటిసారి అన్ని దేశాలు ప్రతికూల బాట నడిచే అవకాశం ఉందని గీతా గోపినాథ్ చెప్పారు. చైనాలో ఏప్రిల్ నెలలో తిరిగి ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని, కొత్త కేసులు తక్కువగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో 2020లో సానుకూల వృద్ధి నమోదు చేసే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో చైనా ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ నెలలో 1.2 శాతం అంచనా వేయగా, దానిని 1 శాతానికే కుదించినట్లు చెప్పారు.

ఆ తర్వాత అతిపెద్ద సంక్షోభం
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో చైనా మాత్రమే సానుకూల వృద్ధిని నమోదు చేయవచ్చునని, మరో దేశ ఆర్థిక వ్యవస్థ కనిపించడం లేదనిగీతా గోపినాథ్ అభిప్రాయపడ్డారు. చైనాలో రికవరీ కూడా వేగంగా ఉందని తెలిపారు. వైరస్‌ను త్వరగా అరికట్టిందని, కాబట్టి త్వరగా కోలుకుంటుందని అభిప్రాయపడ్డారు. 1930లలో అంతర్జాతీయ జీడీపీ 10 శాతం కుదించుకుపోయిందని, ఆ తర్వాత ఇదే అతిపెద్దది అన్నారు. పెద్ద ఎత్తున ఆర్థిక ప్యాకేజీలు, కేంద్ర బ్యాంకుల మద్దతు పెద్ద ఎత్తున దివాళా తీయకుండా వివిధ ఆర్థిక వ్యవస్థలకు ఉపయోగపడ్డాయని తెలిపారు.

12 ట్రిలియన్ డాలర్ల నష్టం, రెండంకెల పతనం
ఈ మహమ్మారి కారణంగా ఈ రెండేళ్లలో 12 ట్రిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకు పోతున్నాయని గీతా గోపినాథ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలపై దెబ్బ పడటంతో లక్షలాది ఉద్యోగాలు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐరోపాలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలు రెండంకెల పతనాన్ని ఎదుర్కోనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications