ట్రంప్ గూబ గుయ్యమనేలా భారత్ వార్నింగ్.. మీరు కాదు మేమే మిమ్మల్ని టార్గెట్ చేస్తామంటూ..

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను లక్ష్యంగా చేసుకుని చేసిన తాజా వ్యాఖ్యలపై గూబ గుయ్యిమనేలా భారత్ బదులిచ్చింది. ట్రంప్ సుంకాల బెదిరింపులపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రష్యా నుంచి చమురు దిగుమతులు చేస్తున్నందుకు భారత్‌పై ఆంక్షలు విధించడాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా తప్పుపడింది. డొనాల్డ్ ట్రంప్‌ వ్యాఖ్యలు అన్యాయమైనవని, అసంబద్ధమని మండిపడింది.

విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో.. అమెరికా తీరును తీవ్రంగా ఖండించారు.భారత్‌ను మాత్రమే టార్గెట్ చేయడం సరికాదు.అంతర్జాతీయంగా అన్ని దేశాలు తమ దేశ ప్రయోజనాల కోసం వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయన్నారు. ఆ దేశాలతో పాటే భారత్ కూడా అదే పని చేస్తోందని పేర్కొన్నారు.ట్రంప్ తన ట్రూత్ సోషల్ అకౌంట్‌లో.. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ.. దాన్ని లాభాల కోసం మళ్లీ విక్రయిస్తోంది అంటూ విమర్శలు గుప్పించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఘాటుగా రిప్లై ఇచ్చింది. భారత్‌ వాణిజ్యం ఎప్పటి నుంచో పారదర్శకంగా ఉంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత కూడా అమెరికా స్వయంగా భారత్‌ను రష్యా చమురును కొనుగోలు చేయమని ప్రోత్సహించిందని తెలిపింది.

Trump and Putin and Modi

మొదట రష్యా సరఫరాలను తిరస్కరించిన పాశ్చాత్య దేశాలు.. ఆ తర్వాత గ్లోబల్ మార్కెట్‌ మళ్లీ స్థిరపడటంతో ఆయిల్ సరఫరాలను రీ-ఆలైన్ చేశాయి. కానీ ఇప్పుడు అదే దేశాలు భారత్‌ను తప్పుపడడం అన్యాయం అని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2024లో యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యా నుంచి 67.5 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు కొనుగోలు చేశాయని తెలిపింది. 17.2 బిలియన్ డాలర్ల సేవల రంగ వ్యాపారం జరిపినట్లు భారత ప్రభుత్వం తెలిపింది. ఇది భారత్-రష్యా వాణిజ్యం కంటే అనేక రెట్లు ఎక్కువ అని పేర్కొంది.

అమెరికా కూడా రష్యా నుంచి తన అణు పరిశ్రమ కోసం యురేనియం హెక్సాఫ్లోరైడ్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అవసరమైన పల్లాడియం, వ్యవసాయ రంగానికి అవసరమైన ఎరువులు ఇంకా దిగుమతి చేసుకుంటోందని విదేశాంగ శాఖ వివరించింది. డొనాల్డ్ ట్రంప్ భారత దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధించినట్టు ప్రకటించడం.. భవిష్యత్‌లో దీన్ని మరింత పెంచుతామని చెప్పడం భారత్‌ను ఆందోళనలో నెట్టేసింది. అయితే కేంద్రం తాము జాతీయ ప్రయోజనాలను, ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

అధికారిక ప్రకటనలో MEA స్పష్టంగా హైలైట్ చేసిన పాయింట్లు ఇవే..

అమెరికానే కారణం: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ దిగుమతుల నిర్ణయం అమెరికా ప్రోత్సాహంతోనే జరిగింది. రష్యా-ఉక్రయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత భారతదేశం రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతి చేయడం ప్రారంభించింది. ఇందుకు కారణంగా, అమెరికా స్వయంగా గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లలో స్థిరత కోసం భారత్‌ను రష్యా చమురు కొనుగోళ్లకు ప్రోత్సహించిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తాజాగా వెల్లడించింది.

భారత్‌ను విమర్శిస్తున్న దేశాలే: భారతదేశం రష్యా నుంచి చేస్తున్న చమురు దిగుమతులు దేశీయ వినియోగదారులకు ఊహించదగిన, సరసమైన ఇంధన ధరలను అందించడానికే ఉద్దేశించి జరుగుతున్నాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం స్వచ్ఛందంగా కాదు, ప్రపంచ మార్కెట్ పరిస్థితుల వలన ఏర్పడిన అవసరం వల్ల తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.అంతేకాకుండా, భారత్‌ను విమర్శిస్తున్న దేశాలే రష్యాతో భారీ వాణిజ్యంలో నిమగ్నమై ఉన్నాయనీ, తాము చేస్తున్న వ్యాపారమే వారి జాతీయ ప్రయోజనాలకు "మూల్యమైన అవసరంగా కూడా కాదని" విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

యూరప్, రష్యాతో భారీ వాణిజ్యం: భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న పశ్చిమ దేశాలు, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్, రష్యాతో స్వయంగా భారీ స్థాయిలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కొనసాగిస్తున్నాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) పేర్కొంది.2024 సంవత్సరంలో యూరోపియన్ యూనియన్ - రష్యా మధ్య జరిగిన వస్తువుల వాణిజ్యం విలువ 67.5 బిలియన్ యూరోలుగా ఉన్నట్లు MEA వెల్లడించింది. అంతేకాక, 2023లో సేవల రంగంలో కూడా ఈ వాణిజ్యం 17.2 బిలియన్ యూరోలుగా అంచనా వేయబడినట్లు తెలిపింది. ఈ మొత్తం, అదే సంవత్సరంలో లేదా దానిని అనుసరించిన సంవత్సరాల్లో భారత్-రష్యా మధ్య జరిగిన మొత్తం వాణిజ్యాన్ని మించిందని వెల్లడించింది. ఆ దేశాలు భారత్‌పై విమర్శలు చేయడం అన్యాయమని పేర్కొంది.

MEA ప్రకారం..రష్యా, యూరప్ మధ్య వాణిజ్యం: యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య సంబంధాలు కేవలం ఇంధన పరిమితులు (LNG, క్రూడాయిల్) మాత్రమే కాకుండా, అనేక విభాగాల్లో విస్తృతంగా ఉన్నాయని స్పష్టంగా తెలిపింది. శక్తి ఉత్పత్తులు (Energy imports), ఎరువులు (Fertilizers), మైనింగ్ ఉత్పత్తులు (Mining products), రసాయనాలు (Chemicals), ఇనుము, ఉక్కు (Iron & Steel), యంత్రాలు, రవాణా పరికరాలు (Machinery and Transport Equipment) వంటివన్నీ కలగలిపిన మల్టీసెక్టోరల్ ట్రేడ్ పార్ట్నర్‌షిప్‌గా ఉన్నదని MEA స్పష్టం చేసింది.

అమెరికా రష్యాపై ఆధారపడుతూనే ఉంది: భారతదేశాన్ని రష్యాతో వ్యాపార సంబంధాల కోసం విమర్శిస్తున్న యునైటెడ్ స్టేట్స్‌ స్వయంగా కూడా కీలక రంగాల్లో రష్యాపై ఆధారపడుతోందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తేల్చిచెప్పింది. యురేనియం హెక్సాఫ్లోరైడ్, పల్లాడియం (Palladium), ఎరువులు (Fertilizers) మరియు రసాయనాలు (Chemicals) రంగాల్లో రష్యాపై ఆధారపడుతోందని తెలిపింది. భారత్‌ను విమర్శిస్తున్న ఈ దేశాలు, తమ స్వంత అవసరాల కోసం రష్యాతో వ్యాపారం కొనసాగిస్తూనే వారి వంచనకు నిదర్శనమని విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచించింది.

జాతీయ ప్రయోజనాల పరిరక్షణే మా లక్ష్యం: ప్రపంచంలోని ఏ ప్రధాన ఆర్థిక వ్యవస్థ మాదిరిగానే, భారతదేశం కూడా తన జాతీయ ప్రయోజనాలను, ఆర్థిక భద్రతను కాపాడుకోవడం అత్యంత సహజమైన మరియు అవసరమైన అంశమని నొక్కి చెప్పింది. ఇది రాజకీయ నిర్ణయం కాదు, తాత్కాలిక ఆవేశం కూడా కాదు. ఇది దేశ ప్రయోజనాల పరిరక్షణకు తీసుకునే సుస్థిర ఆర్థిక చర్యగా పేర్కొంది. కేవలం భారత్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శించడం అన్యాయమైనదిగా మండిపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+