చైనాకు సైలెంట్‌గా షాకిచ్చిన భారత్.. బ్లాక్ మాస్ దెబ్బతో రూ. వేల కోట్ల ఆదాయం

భారత బ్యాటరీ రంగంలో కీలకమైన మలుపు చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఆత్మనిర్భర్ భారత్ దిశలో గట్టి అడుగు పడింది. భారత ప్రభుత్వం బ్లాక్ మాస్ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం దేశీయ రంగంలో బ్యాటరీ ముడి పదార్థాల సరఫరా శ్రేణిని (Supply Chain) ఆత్మనిర్భర్ దిశగా నడిపించే విప్లవాత్మక చర్యగా మనం చెప్పుకోవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ విప్లవాత్మకమైన నిర్ణయం అంతగా ప్రజాదరణ పొందలేదు. ఎక్కడా దీని గురించి పెద్దగా ప్రచారం సాగడం లేదు. ఇంతకు బ్లాక్ మాస్ అంటే ఏమిటి? భారత ప్రభుత్వం ఎగుమతుల ఆంక్షలు విధిస్తే వచ్చే లాభాలు ఏంటీ.. అసలు బ్లాక్ మాస్ ఎందుకు కీలకంగా మారనుంది ఈ ష్టోరీ ద్వారా తెలుసుకుంది.

బ్లాక్ మాస్ అంటే ఏమిటి: బ్లాక్ మాస్ అనేది లిథియమ్-అయాన్ బ్యాటరీలను ష్రెడ్ చేసిన తరువాత లభించే ఓ పొడి పదార్థంగా చెప్పకోవచ్చు. ఇందులో లిథియమ్, కోబాల్ట్, నికెల్, గ్రాఫైట్ వంటి కీలకమైన ఖనిజాలు ఉంటాయి. Black Mass కు భారీగా డిమాండ్ ఉంది. దేశ వ్యాప్తంగా EVలు, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ పెరుగుతున్న నేపథ్యంలో దీని ధరలు తెలియకుండానే ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ పొడిని మనం చైనాకు అత్యంత తక్కువ ధరకే స్క్రాప్‌ కింద చైనాకు ఎగుమతి చేస్తున్నాం. ఇది మనదేశంలోనే చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అయితే చైనా దీనిని మన నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్కడ దానిని కాథోడ్ మెటీరియల్గా ప్రాసెస్ చేస్తుంది. ఈ ప్రాసెస్ ద్వారా తయారైన బ్యాటరీలను మళ్లీ మన దేశానికి ఎగుమతుల రూపంలో పంపి ఎక్కువ ధరకు అమ్ముతుంది. తద్వారా భారీగా లాభాలను ఆర్జిస్తోంది.

India battery raw materials Black Mass export ban Atmanirbhar Bharat batteries EV battery supply chain Indian government policy battery recycling India EV raw materials India battery independence India energy security India lithium-ion battery policy 2030 From Black Mass to Gigafactories ndia s Battery Independence Plan India s EV Battery India s EV Battery Independence 2030 India s Lithium-Ion Cell Mission Made-in-India Batteries

భారత్ ఎగుమతుల ఆంక్షల వల్ల కలిగే లాభాలు: భారతదేశంలోనే బ్లాక్ మాస్‌ను ఉంచడం ద్వారా అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. బ్యాటరీ ముడి పదార్థాల దిగుమతులపై మన దేశం ఆధారపడటాన్ని భారీగా తగ్గించవచ్చు. అలాగే లోకల్ తయారీదారులకు ఖర్చులు బాగా తగ్గుతాయి. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా సర్క్యులర్ ఎకానమీ (Circular Economy) లక్ష్యాలను వేగంగా కేంద్రం సాధించవచ్చు. దీంతో పాటుగా ఈ ఎగుమతి ఆంక్షలు వల్ల దేశీయ రీసైక్లింగ్ సంస్థలు మరింత పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.ఈ పెట్టుబడులతో ఖనిజాలను దేశీయ సరఫరా గొలుసుకు అందించేందుకు ప్రోత్సాహాన్ని అందిస్తాయి.

ఇండియన్ రీసైక్లింగ్ రంగం శక్తివంతం అవుతోందా ? దేశంలో యూపీలోని నోయిడా కేంద్రంగా ఉన్న అటెరో ఇండియా (Attero), భారతదేశంలోని అతిపెద్ద ఇ-వేస్ట్ రీసైక్లర్ గా ఉంది. 200కు పైగా గ్లోబల్ పేటెంట్లు ఫైల్ చేసింది. వీటిలో 37 పేటెంట్లు లిథియమ్-అయాన్ రీసైక్లింగ్పై ఉన్నాయి. అతెరో ఇప్పుడు అన్ని రకాల బ్యాటరీలను రీసైకిల్ చేయగల కెపాసిటీని కలిగి ఉంది. అనేక రకాలైన బ్యాటరీలు ఇక్కడ నుంచి తయారవుతున్నాయి. టాటా నెక్సాన్ EV, BYD కార్లలో వినియోగించే LFP బ్యాటరీలు ఇక్కడ నుంచి వస్తున్నాయి. అలాగే హ్యూండాయ్ కోనా, టెస్లా కార్లలో వినియోగించే NMC బ్యాటరీలు, టయోటా, సుజుకి హైబ్రిడ్స లో ఉపయోగించే LTO సెల్స్ కూడా ఇక్కడి నుండే ఉత్పత్తి అవుతున్నాయి. ఇక స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల్లో ఉపయోగించే LCO సెల్స్ కూడా అటెరో ఇండియా నుండే వస్తున్నాయి. అటెరో ఇండియా FY24లో 54% టాప్‌లైన్ వృద్ధి సాధించింది. FY25లో రెట్టింపు వృద్ధితో రూ.1,100 కోట్ల టర్నోవర్‌ను భారీ లాభాలతో అధిగమించిందని చెప్పుకోవచ్చు. ఇది దేశీయ ఆర్థిక వ్యవస్థకు పెద్ద బూస్ట్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.

India battery raw materials Black Mass export ban Atmanirbhar Bharat batteries EV battery supply chain Indian government policy battery recycling India EV raw materials India battery independence India energy security India lithium-ion battery policy 2030 From Black Mass to Gigafactories ndia s Battery Independence Plan India s EV Battery India s EV Battery Independence 2030 India s Lithium-Ion Cell Mission Made-in-India Batteries
Photo Credit:

ప్రభుత్వ నిర్ణయం వెనుక ఉన్న బలమైన వ్యూహం: 2024 చివరి త్రైమాసికంలో పరిశ్రమ ప్రతినిధులు (అటెరో ఇండియా సహా) ప్రభుత్వం వద్ద బ్లాక్ మాస్ ఎగుమతులను స్ట్రాటజిక్ ఇష్యూగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు.అలాగే 2024 నవంబర్-డిసెంబర్ లో పరిశ్రమ డేటా ఆధారంగా ప్రభుత్వానికి ప్రెజెంటేషన్లు ఇచ్చింది. ఇక 2025 జనవరి & ఏప్రిల్ నెలలో ప్రభుత్వంతో పలు రౌండ్‌ల చర్చలు జరిగాయి. అనేక చర్చల తర్వాత ప్రభుత్వం ఎగుమతి ఆంక్షలపై కీలకమైన నిర్ణయాత్మక చర్య తీసుకుంది. ఇది భారత పరిశ్రమ-ప్రభుత్వం సమన్వయంతో సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బ్లాక్ మాస్ ఎగుమతి ఆంక్షలు కేవలం పర్యావరణ పరిరక్షణ చర్య మాత్రమే కాదు. భారత బ్యాటరీ ఎకోసిస్టమ్‌ను స్వయం సమృద్ధి దిశగా నడిపించే బిజినెస్ గేమ్‌చేంజర్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు.

దేశ ఆర్థిక వ్యవస్థపై బ్లాక్ మాస్ ఉత్పత్తి ప్రభావం: EVల ఉత్పత్తితో పాటు బ్యాటరీ స్టోరేజ్ రంగం వేగంగా పెరుగుతున్న తరుణంలో.. బ్లాక్ మాస్‌ను దేశంలోనే రీసైక్లింగ్ చేయడం వల్ల భారత్ ఖరీదైన దిగుమతుల నుంచి బయటపడుతుంది. స్థానిక తయారీదారుల ఖర్చులు తగ్గుతాయి. సాంకేతిక ఆవిష్కరణలకు మార్గం సుగమం అవుతుంది.బ్లాక్ మాస్ ఎగుమతి ఆంక్షలు కేవలం పర్యావరణ పరిరక్షణ చర్య కాదు. ఇది భారత బ్యాటరీ ఎకోసిస్టమ్‌ను ఆత్మనిర్భర్ దిశగా నడిపించే బిజినెస్ నిర్ణయంగా చెప్పుకోవచ్చు. భారత్ ఇప్పుడు Waste to Wealth సూత్రం ద్వారా EV & Energy Storage రంగాల్లో స్వయం సమృద్ధికి తలుపులు తెరుస్తోంది.

India battery raw materials Black Mass export ban Atmanirbhar Bharat batteries EV battery supply chain Indian government policy battery recycling India EV raw materials India battery independence India energy security India lithium-ion battery policy 2030 From Black Mass to Gigafactories ndia s Battery Independence Plan India s EV Battery India s EV Battery Independence 2030 India s Lithium-Ion Cell Mission Made-in-India Batteries

చైనాకు అడ్డుకట్ట వేసే దిశగా కీలక చర్య: భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాలు (EV), ఎనర్జీ స్టోరేజ్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో భారీగా విస్తరిస్తోంది. అయినప్పటికీ లిథియం-అయాన్ బ్యాటరీల ముడి పదార్థాలు (లిథియం, కోబాల్ట్, నికెల్, గ్రాఫైట్) ఎక్కువగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. తాజా నిర్ణయంతో చైనా ఆధిపత్యాన్ని తగ్గించి, ఆత్మనిర్భర్ బ్యాటరీ ఎకోసిస్టమ్ నిర్మించేందుకు భారత్ ఈ వ్యూహానికి తెర లేపింది. భారత్ రీసైక్లింగ్ + దేశీయ ఖనిజ ఉత్పత్తి + టెక్నాలజీ ఇన్నోవేషన్ అనే మూడు స్థంభాలపై దృష్టి పెట్టడం ద్వారా చైనాపై భారత్ ఆధారపడటం గణనీయంగా తగ్గుతుంది. 2027 నాటికి భారత్ తన సొంత గిగా ఫ్యాక్టరీలతో బ్యాటరీ సెల్ ఉత్పత్తిలో టాప్-5 దేశాల్లో ఒకటిగా నిలుస్తుందనే అంచనాలు ఈ నిర్ణయం ద్వారా కలుగుతున్నాయి.

దేశంలో ఎక్కడెక్కడ ఈ ఖనిజాలు ఉన్నాయి: పాత లిథియం-అయాన్ బ్యాటరీల నుంచి ఖనిజాలను తిరిగి పొందడం (Black Mass Recovery) ద్వారా ఉత్పత్తిని పెంచవచ్చు. అటెరో (Attero), లొహుమ్ (Lohum) వంటి రీసైక్లింగ్ కంపెనీలు ఇప్పటికే పేటెంట్ టెక్నాలజీతో లిథియం, కోబాల్ట్, నికెల్‌ను 90% వరకు రికవర్ చేస్తున్నాయి. బ్లాక్ మాస్ ఎగుమతులపై ప్రభుత్వ ఆంక్షలు స్థానిక రీసైక్లర్లను బలోపేతం చేస్తాయి. ఇక జమ్మూ & కాశ్మీర్‌లో లిథియం నిల్వలు ఇటీవల కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వీటి వాణిజ్య తవ్వకాలు ప్రారంభమైతే దిగుమతి ఆధారాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. అలాగే రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నికెల్, కోబాల్ట్ ఖనిజాల శోధన ప్రస్తుతం జరుగుతోంది.ఈ ఖనిజాల రీ సైక్లింగ్ ప్లాంట్లు దేశంలోనే ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది.

India battery raw materials Black Mass export ban Atmanirbhar Bharat batteries EV battery supply chain Indian government policy battery recycling India EV raw materials India battery independence India energy security India lithium-ion battery policy 2030 From Black Mass to Gigafactories ndia s Battery Independence Plan India s EV Battery India s EV Battery Independence 2030 India s Lithium-Ion Cell Mission Made-in-India Batteries
Photo Credit:

గిగా ఫ్యాక్టరీల నిర్మాణం: కేంద్ర ప్రభుత్వ PLI (Production Linked Incentive) స్కీమ్ కింద టాటా గ్రూప్, రిలయన్స్ న్యూ ఎనర్జీ, అమర రాజా వంటి సంస్థలు గిగాఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తున్నాయి. 18,100 కోట్ల రూపాయలతో 50 GWh బ్యాటరీ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన గిగాఫ్యాక్టరీలను అభివృద్ధి చేస్తున్నారు. 2025 నాటికి దేశంలో 50 GWh సామర్థ్యంతో బ్యాటరీ సెల్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని అంచనా. ఇక ఇప్పటికే Sodium-ion బ్యాటరీలు, Solid-state బ్యాటరీలు వంటి ప్రత్యామ్నాయ టెక్నాలజీలపై IITలు, ISRO, ప్రైవేట్ కంపెనీలు పరిశోధన చేస్తున్నాయి. టాటా గ్రూప్ గుజరాత్‌లో 20 GWh ప్లాంట్ ఏర్పాటు చేస్తుండగా..జామ్‌నగర్‌లో రిలయన్స్ న్యూ ఎనర్జీ 40 GWh గిగాఫ్యాక్టరీ ప్లాన్ లో ఉంది. అమర రాజా బ్యాటరీస్, ఎక్సైడ్ ఎనర్జీ, ఓలా ఎలక్ట్రిక్ కూడా పెద్ద స్థాయి బ్యాటరీ ప్లాంట్లలో పెట్టుబడులు పెడుతున్నాయి.

India battery raw materials Black Mass export ban Atmanirbhar Bharat batteries EV battery supply chain Indian government policy battery recycling India EV raw materials India battery independence India energy security India lithium-ion battery policy 2030 From Black Mass to Gigafactories ndia s Battery Independence Plan India s EV Battery India s EV Battery Independence 2030 India s Lithium-Ion Cell Mission Made-in-India Batteries

అంతర్జాతీయ భాగస్వామ్యాలపై కేంద్రం ఆలోచన: ఆస్ట్రేలియా, చిలీ, అర్జెంటీనా వంటి లిథియం అధికంగా ఉన్న దేశాలతో దీర్ఘకాలిక ముడి పదార్థాల సరఫరా ఒప్పందాలను భారత్ కుదుర్చుకుంటోంది. దేశంలో ఈ రంగంలో జపాన్, కొరియా వంటి దేశాలు పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతున్నాయి.ఈ దేశాలతో కాథోడ్, అనోడ్ తయారీ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ ఒప్పందాలు జరుగుతున్నాయి. దీంతో పాటుగా IITలు, IISc, ప్రైవేట్ R&D సెంటర్లు స్థానిక కాథోడ్, అనోడ్ కెమిస్ట్రీల అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి. ఇండో-ఆస్ట్రేలియన్ క్రిటికల్ మినరల్స్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా ముడి పదార్థాల సరఫరా గొలుసును భద్రపరిచేందుకు సహకారం పెరుగుతోంది.

బ్యాటరీ రంగంలో భారత్ 2030 రోడ్‌మ్యాప్: భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాలు (EV), ఎనర్జీ స్టోరేజ్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, లిథియం-అయాన్ బ్యాటరీలు భవిష్యత్తు దేశ ఆర్థికశక్తి వ్యవస్థలో కీలక భాగం అవుతున్నాయి.అయితే లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి క్రిటికల్ ముడి పదార్థాల కోసం భారత్ చైనా వంటి దేశాలపై అధికంగా ఆధారపడుతోంది. ఈ ఆధారాన్ని తగ్గించి, 2030 నాటికి బ్యాటరీ రంగంలో కీలకమైన శక్తిగా ఎదగడమే భారత ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగానే బ్లాక్ మాస్ ఎగుమతులపై ఆంక్షలు విధించడం ద్వారా దేశీయ రీసైక్లర్లకు బలమైన డిమాండ్‌ను సృష్టిస్తోంది కేంద్ర ప్రభుత్వం. బ్లాక్ మాస్ (ష్రెడ్ చేసిన బ్యాటరీల నుండి లభించే ఖనిజ పొడి) ద్వారా లిథియం, కోబాల్ట్, నికెల్, గ్రాఫైట్ లాంటి ఖనిజాలను 90% పైగా తిరిగి పొందవచ్చు.దీన్ని సాధించడానికి అటెరో, లొహుమ్, గ్రావిటాస్ వంటి కంపెనీలు ఇప్పటికే పెద్ద స్థాయి ప్లాంట్లతో, 200కు పైగా పేటెంట్లతో గ్లోబల్ స్థాయిలో పోటీ పడుతున్నాయి.

భారత్ టార్గెట్: 2030 నాటికి 250 GWh కంటే ఎక్కువ బ్యాటరీ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండడం భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. రీసైక్లింగ్, ఖనిజ వనరుల తవ్వకం, గిగా ఫ్యాక్టరీల నిర్మాణం, కొత్త టెక్నాలజీల అభివృద్ధి - ఈ నాలుగు అస్త్రాలతో భారతదేశం... చైనా ఆధిపత్యాన్ని అధిగమించి ప్రపంచంలో టాప్ 5 బ్యాటరీ ఉత్పత్తి దేశాల్లో ఒకటిగా నిలబడే అవకాశముంది. తద్వారా చైనా ఆధిపత్యానికి భారత్ గండికొట్టే అవకాశం ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+