Salary Hike: ఒకపక్క పెరుగుతున్న ద్రవ్యోల్బణం చాలా ప్రమాదకర స్థాయిలకు చేరుకుంది. దీంతో అమెరికా, యూరప్ వంటి దేశాలు సైతం అతలాకుతలం అవుతున్నాయి. అయితే ఈ సమయంలో ఉద్యోగులకు జీతాల పెంపు అనే వార్త వినటానికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఆసియా ప్రాంతంలోని దేశాల్లో జీతాల పెరుగుదల ఎలా ఉంటుందనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సమయంలో ఊరటను ఇచ్చి ఒక వార్త ఇప్పుడు అందరినీ సంతోషానికి గురిచేస్తోంది.

తాజా నివేదిక..
ప్రస్తుత మాంద్యం సమయంలో ప్రపంచంలోని కేవలం 37 శాతం దేశాల్లో మాత్రమే ఉద్యోగులకు జీతాల పెరుగుదల ఉంటుందని ఒక సర్వేలో వెల్లడైంది. కానీ చాలా దేశాల్లో ఉన్న జీతాలను తగ్గించటం వంటి చర్యలకు కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. దీనికి అంతర్జాతీయంగా ఉన్న అనేక పరిస్థితులు ప్రధానంగా కారణంగా నిలుస్తున్నాయి.

జీతాల తగ్గింపు ఇక్కడే..
వర్క్‌ఫోర్స్ కన్సల్టెన్సీ ECA ఇంటర్నేషనల్ ప్రకారం అత్యంత నష్టపోయిన ప్రాంతం యూరప్‌లో ఉండే అవకాశం ఉందని వెల్లడైంది. ఈ ప్రాంతాల్లో నామమాత్రపు వేతన పెంపులు ఉంటాయని తెలుస్తోంది. యూకేలోని ప్రజలు ఈ ఏడాది అత్యంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారని తెలుస్తోంది.2000 సంవత్సరం తర్వాత ఇది అత్యంత స్వల్పమని తెలుస్తోంది. సగటు నామమాత్రపు వేతన పెంపు 3.5 శాతంగా ఉంటుందని పేర్కొంది.

భారత్ లో వేతనాలు..
రియల్ టైం జీతాల పెరుగుదలను గమనించినట్లయితే ఆసియా ప్రాంతోని టాప్-10 దేశాల్లో ఎనిమిదింటిలో మాత్రమే వేతనాల పెంపు ఉంటుందని వెల్లడైంది. భారతదేశంలో 4.6 శాతం, వియత్నాంలో 4 శాతం, చైనాలో 3.8 శాతం మేర జీతాలు పెరుగుతాయని నివేదిక చెబుతోంది. దీని తర్వాత బ్రెజిల్ లో 3.4 శాతం, సౌదీ అరేబియాలో 2.3 శాతం మేర పెరుగుతాయని తాజా సర్వేలో వెల్లడైంది.

మిగిలిన దేశాలు..
ఇక జీతాలు పెరిగే ఇతర దేశాల జాబితాను గమనించినట్లయితే మలేషియా 2.2 శాతం, కంబోడియా 2.2 శాతం, థాయిలాండ్ 2.2 శాతం, ఒమన్ 2 శాతం, రష్యా 1.9 శాతం జీతాలను పెంచే టాప్ దేశాల జాబితాలో నిలిచాయి. ఇక దిగువున ఉన్న దేశాల జాబితాను గమనిస్తే పాకిస్థాన్, ఘనా, టర్కీ, శ్రీలంక, అర్జెంటీనీ వంటి దేశాలు దిగువన ఉన్నాయి. మెుత్తానికి 2023లో జీతాలు అత్యధికంగా పెరిగే దేశాల జాబితాలో ఇండియా మెుదటి స్థానంలో నిలిచింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications