భారతదేశం ఇప్పుడు సైబర్‌సెక్యూరిటీ రంగంలో గ్లోబల్ మ్యాప్‌లో హాట్‌స్పాట్గా మారింది. దేశంలోని 400కి పైగా స్టార్టప్‌లు, లక్షలకిపైగా నైపుణ్యవంతులైన సైబర్ ప్రొఫెషనల్స్ 20 బిలియన్ డాలర్ల పరిశ్రమను ముందుకు నడిపి, సైబర్ సెక్యూరిటీ నూతన ప్రమాణాలను సృష్టిస్తున్నారు. చిన్న, నూతన ఆవిష్కరణల నుండి AI ఆధారిత రక్షణ వ్యవస్థల వరకు ఇన్నోవేటర్స్ భారత డిజిటల్ భవిష్యత్తును భద్రమైన, స్థిరమైన, మరియు సృజనాత్మకదిశలో తీర్చిదిద్దుతున్నారు. ఈ సమాచారాన్ని MeitY లో CERT-In డైరెక్టర్ జనరల్ మరియు సర్టిఫైయింగ్ అథారిటీల కంట్రోలర్ (CCA) డాక్టర్ సంజయ్ చెప్పారు.
భవిష్యత్తులో 5G, IoT, క్వాంటం కంప్యూటింగ్ వంటి సాంకేతికతలతో, భారత సైబర్‌ఇకోసిస్టమ్ మరింత అభివృద్ధి చెందనుంది, CERT-In, స్టార్టప్‌లు ముందే సిద్ధం అవుతున్నాయి. డాక్టర్ బహ్ల్ చెప్తునట్టు, ఈ స్టార్టప్‌లు థ్రెట్ డిటెక్షన్, సైబర్ ఫోరెన్సిక్స్, AI ఆధారిత మానిటరింగ్ సిస్టమ్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిష్కారాలను రూపొందిస్తున్నాయని. ఇవి భారతదేశం భద్రమైన మరియు స్థిరమైన డిజిటల్ వ్యవస్థగా మారడానికి దోహదపడతాయి.

ఇస్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలతో పోలిస్తే, భారత సైబర్ స్టార్టప్‌లు టాలెంట్, ఇన్నోవేషన్, మరియు ఖర్చు-సమర్థత పరంగా గ్లోబల్ మార్కెట్‌లో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ (EU) దేశాల పత్రికా ప్రతినిధులు సందర్శనలో, డాక్టర్ బహ్ల్ AI రెండు విధాలుగా పని చేస్తుందని చెప్పారు రక్షకులకు కూడా, దాడికర్తలకు కూడా సమానంగా ఉపయోగపడుతుంది. CERT-In AI ఆధారిత అనలిటిక్స్ మరియు ఆటోమేషన్‌ను ఉపయోగించి సైబర్ సంఘటనలను రియల్ టైమ్‌లో గుర్తించడం, నివారించడం, స్పందించడం వంటి కార్యక్రమాలను నడుపుతోంది. అలాగే, దుర్వినియోగ AI ఆధారిత దాడుల కోసం కౌంటర్‌మెజర్స్ కూడా తయారు చేస్తోంది.
ప్రతి సంవత్సరం భారతదేశంలో 10 కోట్లకు పైగా కొత్త ఇంటర్నెట్ యూజర్లు జతకెళ్తున్నారు. రోజురోజుకు దేశంలో ఆన్‌లైన్ డిజిటల్ పరిసరాలు విస్తరిస్తూ, ప్రతీ వ్యక్తి, చిన్న వ్యాపారం, విద్యార్థి, ఉద్యోగి డిజిటల్ సర్వీసులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ వేగవంతమైన డిజిటల్ వృద్ధితో, సైబర్ ముప్పులు, హ్యాకింగ్, డేటా చోరీ వంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. అందుకే, సైబర్ సెక్యూరిటీ ఆవిష్కరణలు ఇప్పుడు అత్యంత కీలకంగా మారాయి. భారత్‌లోని స్టార్టప్‌లు చిన్న స్కేల్ నుండి పెద్ద స్కేల్ వరకు సైబర్ రక్షణలో కొత్త టెక్నాలజీలను పరిచయం చేస్తున్నారు.
ఇలాంటి స్టార్టప్‌లు ఇప్పుడు AI ఆధారిత సెక్యూరిటీ, మోబైల్ సెక్యూరిటీ, క్లౌడ్ రక్షణ వంటి విభాగాల్లో అంతర్జాతీయ గుర్తింపును పొందుతున్నాయి. కొన్ని కంపెనీలు గ్లోబల్ మార్కెట్లో స్థిరమైన స్థానం సంపాదించాయి, విదేశీ పెట్టుబడిదారుల దృష్టిలోకి వచ్చాయి మరియు ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు సాంకేతిక పరిష్కారాలు అందిస్తున్నాయి. చిన్న ఆవిష్కరణల నుండి పెద్ద సైబర్ రక్షణ ప్లాట్‌ఫారమ్‌ల వరకు, ఇవి భారతదేశాన్ని డిజిటల్ భద్రత మరియు సాంకేతికతలో విశ్వసనీయ కేంద్రంగా నిలబెట్టే దిశలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.
IT మంత్రిత్వ శాఖ ప్రకారం, జర్నలిస్టులకు CERT-In యొక్క నిరంతర డ్రిల్ల్స్, శిక్షణ, అంతర్జాతీయ భాగస్వామ్యాలు గురించి వివరించారు. ఉదాహరణకు, ఫ్రాన్స్‌లోని నేషనల్ సైబర్‌సెక్యూరిటీ ఏజెన్సీ (ANSSI) తో ఉన్న సహకారం. డాక్టర్ బహ్ల్, 2024లో భారతదేశంలో 147 రాన్సమ్‌వేర్ కేసులు నమోదయ్యాయి. CERT-In సమన్వయ చర్యల వల్ల రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ మరియు ఫోరెన్సిక్ జోక్యాలతో వాటి ప్రభావం తగ్గించబడింది అని తెలిపారు.
సమావేశంలో CERT-In యొక్క ఆడిటర్ల ఎంపన్మెంట్, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, స్వదేశీ సైబర్‌సెక్యూరిటీ స్టార్టప్‌లకు విధాన మద్దతుల గురించి కూడా చర్చ జరిగింది. IT మంత్రిత్వ శాఖ చెప్పినట్టే, CERT-In సార్వజనిక-ప్రైవేట్ భాగస్వామ్యాలు, అంతర్జాతీయ ఫోరమ్‌లలో పాల్గొనడం, పరిశోధన సహకారం ద్వారా భద్రమైన, విశ్వసనీయ సైబర్ డిఫెన్స్ నిర్మాణంను, డిజిటల్ ఇండియా విజన్ కు అనుగుణంగా నిర్మిస్తోంది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications