12 సంవత్సరాలుగా సింగపూర్‌లో పనిచేస్తున్న ఇంజనీర్ ఆదిత్య జీవితంలో ఒక కీలక మలుపు చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఆడియో సొల్యూషన్స్ సంస్థ Bose Professional అతనికి ఒక ప్రత్యేక బాధ్యతను అప్పగించింది. అదేంటంటే పూర్తిగా కొత్త ఉత్పత్తి శ్రేణిని మొదటి నుంచి నిర్మించడమే కాకుండా.. అమెరికా వెలుపల కంపెనీ స్థాపించే తొలి యూనిట్‌కు సరైన స్థలాన్ని ఎంపిక చేయడం.
మొదట కంపెనీ సూచన ఏంటంటే బెంగళూరు. కానీ ఆదిత్యకు అక్కడి వాస్తవ పరిస్థితులు బాగా తెలుసు. తీవ్రమైన ట్రాఫిక్, పెరుగుతున్న జీవన వ్యయం, అధిక ఉద్యోగ మార్పిడులు (attrition) వంటి అంశాలు దీర్ఘకాలిక R&D పనులకు అడ్డంకిగా మారతాయని ఆయన నమ్మారు. అందుకే ఆయన ఒక భిన్నమైన ప్రతిపాదన చేశారు. కర్ణాటక తీరంలోని మంగళూరు గురించి చెప్పాడు.

సాంప్రదాయంగా మంగళూరు ఆర్థిక వ్యవస్థ శుద్ధి కర్మాగారాలు, షిప్పింగ్, మత్స్యకార రంగం, వ్యవసాయం చుట్టూ తిరిగింది. కానీ ఉడిపి జిల్లా కర్కల సమీపంలో పెరిగిన ఆదిత్యకు ఈ ప్రాంతంలోని ప్రతిభ, జీవన నాణ్యత, ప్రశాంత వాతావరణం మీద పూర్తి నమ్మకం ఉంది. తక్కువ ట్రాఫిక్, శుభ్రమైన గాలి, సమతుల్య జీవితం.. ఇవన్నీ ఐటీ నిపుణులను ఆకర్షించే అంశాలుగా నమ్మాడు.
నవంబర్ 2024లో లింక్డ్‌ఇన్ ద్వారా నియామక ప్రక్రియ ప్రారంభమైంది. మంగళూరు, ఉడిపి ప్రాంతానికి చెందిన కానీ ఇతర నగరాల్లో పనిచేస్తున్న నిపుణులను ప్రత్యేకంగా సంప్రదించారు. ఫలితం ఆశ్చర్యకరంగా వచ్చింది. కుటుంబానికి దగ్గరగా ఉండే అవకాశం, కొత్త ఉత్పత్తిని మొదటి నుంచీ నిర్మించే ఛాన్స్, మంచి జీతం ఇలా ఇవన్నీ వారిని ఆకర్షించాయి.
జనవరి 2025 నాటికి ఆదిత్య భారత్‌లో బోస్ ప్రొఫెషనల్ రెండో ఉద్యోగిని నియమించారు. అదే సంవత్సరం చివరికి బృందం 50 మందికి చేరింది. నేడు ఈ బృందం మంగళూరులోని కొట్టారా చౌక్‌లో ఉన్న ఆధునిక కార్యాలయం నుంచి అమెరికా మార్కెట్ కోసం కీలక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తోంది.
బోస్ ప్రొఫెషనల్ ఒక్కటే కాదు. ఇటీవలి సంవత్సరాల్లో మంగళూరు, ఉడిపి, దక్షిణ కన్నడ జిల్లాల్లో వందలాది ఐటీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాయి. గత రెండు సంవత్సరాల్లో ఈ ప్రాంత ఐటీ ఆదాయం రూ.3,200 కోట్ల నుంచి దాదాపు రూ.5,000 కోట్లకు చేరుకుంది. ఇందులో సుమారు రూ.3,000 కోట్లు నిపుణుల జీతాల రూపంలో స్థానిక ఆర్థిక వ్యవస్థలోకి ప్రవహిస్తున్నాయి. 2034 నాటికి ఈ ప్రాంత ఐటీ ఆదాయాన్ని రూ.45,000 కోట్లకు చేర్చాలని, ఉద్యోగులను 50 వేల నుంచి 2 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత మూడేళ్లలోనే దాదాపు 100 మిలియన్ డాలర్ల విలువైన గ్లోబల్ కొనుగోళ్లు జరగడం ఇక్కడి టెక్నాలజీ నాణ్యతకు నిదర్శనం.
తక్కువ ఆఫీస్ అద్దెలు, చౌకైన గృహాలు, సరసమైన విద్య, 15 నిమిషాల నగరం'గా పేరొందిన ప్రయాణ సౌలభ్యం.. ఇవన్నీ మంగళూరును Bengaluru కు ప్రత్యామ్నాయంగా నిలబెడుతున్నాయి. బెంగళూరులో జరిగిన తప్పులను పునరావృతం కాకుండా నియంత్రిత అభివృద్ధి జరగాలని స్థానిక వ్యవస్థాపకులు కోరుతున్నారు. ఒకప్పుడు ఉద్యోగాల కోసం బయటకు వెళ్లిన యువత ఇప్పుడు తిరిగి స్వస్థలానికి వస్తోంది. ఈ మార్పే మంగళూరు-ఉడిపి తీరాన్ని నిజమైన భారతదేశ సిలికాన్ బీచ్ గా మార్చుతోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

Bengaluru: ఒక్క జీతం నమ్మకుంటే మునిగిపోవడమే! ఐటీ నిపుణులకు CA వార్నింగ్!

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications