For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పారదర్శక సూచీలో 34వ స్థానంలో దేశీయ రియల్ ఎస్టేట్

|

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలు, రంగాలు కుదేలయ్యాయి. ఇటీవలి కాలంలో పలు నివేదికల్లో దేశీయ రియల్ ఎస్టేట్ పెద్ద ఎత్తున క్షీణించింది. అయితే కరోనా ఉదృతిలోను దేశీయ రియల్ ఎస్టేట్ పారదర్శకత సూచీలో దూసుకువెళ్తుందని జేఎల్ఎల్, లాసాల్లస్ బిన్నీయల్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ ట్రాన్స్‌పరెన్సీ ఇండెక్స్(GRETI) నివేదికను విడుదల చేసింది. దేశంలో ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల వల్ల ఇన్వెస్టర్లలో పారదర్శకత నెలకొందని ఈ నివేదిక వెల్లడించింది.

దేశీయ రియల్ ఎస్టేట్ రంగం పారదర్శకత సూచీలో ప్రపంచంలోనే 34వ స్థానంలో నిలిచిందని ఈ నివేదిక తెలిపింది. దేశంలో పారదర్శకత పెరగడానికి గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, గ్రీన్ రేటింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హాబిటాట్ అసెస్‌మెంట్ తదితర సంస్థలు కీలకపాత్ర పోషించాయి. తాజా సర్వేలో కేవలం రియల్ ఎస్టేట్ రంగంతో పాటు 210 అంశాలలో పారదర్శకత, స్వయంసమృద్ధి తదితర అంశాలను సర్వే పరిగణలోకి తీసుకొని నివేదికను వెల్లడించింది.

లోన్ మారటోరియంపై పొడిగిస్తారా? నిర్మల ఏం చెప్పారంటే?లోన్ మారటోరియంపై పొడిగిస్తారా? నిర్మల ఏం చెప్పారంటే?

Indias realty sector shows one of the largest improvements globally in transparency index

కరోనా మహమ్మారి సమయంలోను కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు అనివార్యంగా నిలిపివేయబడినప్పటికీ, ఈ రంగానికి పెరుగుతున్న కేటాయింపుల కారణంగా విస్తృతమైన ధోరణి కొనసాగుతోందని చెబుతున్నారు. ఆసియా పసిఫిక్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిదారులు ఎక్కువ మూలధనాన్ని కేటాయించాలని చూస్తున్నారని, పారదర్శకత ఎంతో ముఖ్యమని అంటున్నారు. జేఎల్ఎల్, లాసల్లెలు రియల్ ఎస్టేట్ పారదర్శకత, ఉన్నతప్రమాణాలను 1999 నుండి ట్రాక్ చేస్తున్నాయి.

English summary

పారదర్శక సూచీలో 34వ స్థానంలో దేశీయ రియల్ ఎస్టేట్ | India's realty sector shows one of the largest improvements globally in transparency index

India's real estate industry has registered one of the largest improvements globally and regionally in JLL and LaSalle's biennial Global Real Estate Transparency Index (GRETI) released on Tuesday.
Story first published: Sunday, August 2, 2020, 16:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X