భారత్‌లో అధికమవుతున్న చమురు డిమాండ్.. ఈ ఏడాది చివరి నాటికి చైనాను దాటిపోయే అవకాశం..
ఈ ఏడాది భారతదేశంలో చమురు వినియోగం చైనాను మించిపోవచ్చనే అంచనాలను ట్రాఫిగురా గ్రూప్ ప్రతిపాదిస్తున్నాయి. APPEC సమావేశంలో S&P గ్లోబల్ కమోడిటీ ఇన్‌సైట్స్ నిర్వహించిన కార్యక్రమంలో ట్రాఫిగురా చీఫ్ ఎకనామిస్ట్ సాద్ రహీమ్ మాట్లాడుతూ.. భారతదేశ చమురు డిమాండ్ కోసం మేము ఆశాజనకంగా ఉన్నాము. వ్యూహాత్మక నిల్వను మినహాయించినట్లయితే, ఈ సంవత్సరం భారతదేశ డిమాండ్ చైనాను మించిపోతుందని పేర్కొన్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భారతదేశంలో చమురు వినియోగం పెరగడానికి ప్రధాన కారణం నగరాల్లో పెరుగుతున్న జనాభా, ఆదాయం పెరగడం, జీవన ప్రమాణాలు మెరుగుపడటంఅని చెప్పుకోవచ్చు. కొత్త వాణిజ్య, ప్రైవేట్ వాహనాల సంఖ్య పెరుగుతూ, దేశంలో డైలీ ట్రావెల్, సరుకుల రవాణా, వ్యాపార కార్యకలాపాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ కారణంగా.. oil వినియోగం సుదీర్ఘ స్థాయిలో కూడా వృద్ధి చెందుతుందని నిపుణులు భావిస్తున్నారు.

అదే సమయంలో.. చైనాలో ముడి చమురు వినియోగం కూడా నెమ్మదిగా పెరుగుతోంది. చైనా చమురు వినియోగంలో పెట్రోకెమికల్ రంగం మాత్రమే కొంతమేర వృద్ధి చూపుతోంది. గత కొన్ని నెలల్లో చైనా వ్యూహాత్మక చమురు నిల్వలను (SPR) పెంచుతూ, రోజుకు సుమారు 2 లక్షల బ్యారెల్ల చమురును నిల్వ చేసింది. ఈ నిల్వలు ప్రపంచ చమురు ధరలను స్థిరపరచడంలో కీలక పాత్ర పోషించాయి. అయితే దీర్ఘకాలంలో ఈ రకమైన నిల్వ కొనసాగించడం సవాలుగా మారుతోంది. గ్లోబల్ రీసెర్చ్ హెడ్ ఫ్రెడెరిక్ లాస్సేర్ చెప్పినట్లుగా.. రాబోయే కాలంలో మార్కెట్లో అదనపు చమురును సర్దుబాటు చేయడం చైనా కోసం కష్టతరం అవుతుందని చెబుతున్నారు.
వచ్చే ఏడాది ప్రపంచ చమురు డిమాండ్ పెద్దగా పెరగకపోవచ్చని సూచిస్తున్నారు. ఆయన ప్రకారం.. 2026లో రోజుకు సుమారు 1 మిలియన్ బ్యారెల్ల వరకు మాత్రమే డిమాండ్ పెరుగుతుంది. ఈ స్థాయి డిమాండ్ ఉన్నప్పుడు మాత్రమే మార్కెట్లో ఉత్పత్తిదారులు అధిక చమురును విక్రయించగలుగుతారు.ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశం చమురు డిమాండ్ వృద్ధిలో కీలక భూమిక వహిస్తోంది. పెట్టుబడిదారులు, ఉత్పత్తిదారులు భారతదేశలో పెరుగుతున్న వినియోగం, చైనాలో నిల్వ పెరగడం, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావాలను నిశితంగా విశ్లేషిస్తున్నారు.
ఈ ఏడాది ప్రపంచ చమురు ధరల దిశను భారతదేశ డిమాండ్ ప్రభావితం చేస్తుందని, చైనా వినియోగంలో నెమ్మదితనం మార్కెట్ సంతులనం కోసం కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థిక నిపుణుల విశ్లేషణలు.. భారతదేశ చమురు వినియోగం, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావిత అంశాల మధ్య పరస్పర సంబంధాన్ని స్పష్టంగా చూపుతున్నాయి. ఏదేమైనా 2025లో భారతదేశం చమురు వినియోగంలో ప్రపంచంలో ప్రముఖ స్థానంలో ఉండే అవకాశం కలిగినప్పటికీ.. మార్కెట్ పెరుగుదల దిశ, నిల్వలు, మరియు అంతర్జాతీయ ముడి చమురు సరఫరాలపై ఆధారపడే అవాంతరాలు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications