Hyderabad T-Works: ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరానికి ప్రాముఖ్యత క్రమంగా పెరుగుతోంది. సీఎం KCR, పరిశ్రమల శాఖ మంత్రి KTR అధ్వర్యంలో ఒడిఒడిగా వేస్తున్న అడుగులు అభివృద్ధిని క్రమంగా పెంచుతున్నాయి. ఇప్పటికే ఐటీ సేవలు, ఫార్మా, టెక్స్‌టైల్స్, తయారీ, రియల్టీ, స్టార్టప్స్, ఆటో రంగాలు మంచి పనితీరును కనబరుస్తున్నాయి.
మార్చి 2న రాయదుర్గంలో టి-వర్క్స్ ప్రోటోటైపింగ్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR తెలిపారు. దేశంలోనే ఇతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్ ప్రారంభానికి సంబంధించిన వివరాలను మంత్రి ట్విట్టర్‌లో వెల్లడించారు. T-వర్క్స్ ఉత్పత్తి ఆవిష్కరణలో అగ్రగామిగా మారడానికి భారత ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని ట్విట్టర్లో తెలిపారు.

78000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రోటోటైపింగ్ సెంటర్‌లో అత్యాధునిక సౌకర్యాలు, ఆవిష్కరణలు, నమూనా రూపకల్పనకు మద్దతుగా పరికరాలు ఉన్నాయని కేసీఆర్ వెల్లడించారు. ఇది తెలంగాణ ప్రభుత్వ చొరవ అని ఆయన తెలిపారు. దేశంలో తయారీదారులు, ఆవిష్కర్తల సంస్కృతిని సృష్టించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసిందని అన్నారు. అపజయాల గురించి భయపడకుండా ప్రయోగాలు చేయాలని సూచించారు.


Click it and Unblock the Notifications