భారతదేశంలో ధనిక-పేదల మధ్య ఆదాయ అంతరంపై చెన్నైకి చెందిన ఆర్థిక నిపుణులు డి. ముత్తుకృష్ణన్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఈ రెండింటి మధ్య కంటికి కనిపించే దానికంటే మరింత లోతుగా అంతరం ఉందని నొక్కి చెప్పారు. ఆయన ఎక్స్ లో పోస్ట్ చేసిన వివరాల ప్రకారం.. దేశంలోని దిగువ 90 శాతం ప్రజలు జాతీయ ఆదాయంలో కేవలం 43 శాతం మాత్రమే పొందుతున్నారన్నారు. మిగతా 10 శాతం ప్రజలు దేశ సంపదలో సగానికి పైగా వాటా కలిగి ఉన్నట్లుగా ఆయన చెబుతున్నారు.
జాతీయ తలసరి GDP 2,700 డాలర్లుగా ఉన్నప్పటికీ.. అగ్ర ధనికులలో 10 శాతం సంపాదకులను లెక్కలోంచి తీసేస్తే.. మిగతా 90 శాతం మందికి ఈ సంఖ్య కేవలం 1,300 డాలర్లకి పడిపోతుందని ముత్తుకృష్ణన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..ఇది సబ్-సహారా ఆఫ్రికా, పాకిస్తాన్ పరిస్థితుల కంటే దారుణమని స్పష్టం చేశారు. మీరు అగ్ర స్థానంలోని 150 మిలియన్లలో లేని పక్షంలో, మిగిలిన 1.3 బిలియన్లలో ఒకరైతే, మీ రోజువారీ జీవితం అక్షరాలా నరకంలా ఉంటుందని ఆయన తెలిపారు.

ముత్తుకృష్ణన్ విశ్లేషణలో.. భారతదేశంలోని సుమారు 150 మిలియన్ల అధిక ఆదాయ సంపాదకులు దేశాన్ని ప్రపంచ వేదికపై చాలా ధనవంతమైన దేశంగా చూపించే భ్రమను సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. అయితే మిగతా 1 బిలియన్ ప్రజలకు పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. దేశంలోని దిగువ 90 శాతం ప్రజలు జాతీయ ఆదాయంలో కేవలం 43 శాతం మాత్రమే సంపాదిస్తున్నారు. మిగిలిన 10 శాతం సంపన్న వర్గం దేశ సంపదలో సగానికి పైగా వాటా కలిగి ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఇండస్ బేసిన్ నివేదికను ఆయన ఉదహరించారు. దాదాపు ఒక బిలియన్ మంది భారతీయులు ఖచ్చితంగా సున్నా కొనుగోలు శక్తిని కలిగి ఉన్నారని ముత్తుకృష్ణన్ పేర్కొన్నారు. ఈ వర్గం ప్రజలు ప్రధానంగా ప్రాథమిక అవసరాలకే ఖర్చు చేస్తూ.. ప్రభుత్వ సబ్సిడీలపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. వారికే నిజమైన ఆర్థిక స్వేచ్ఛ లేదా అభివృద్ధి అవకాశాలు లేవని చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దలు పెరుగుతున్న GDP సంఖ్యలను ప్రదర్శిస్తున్నప్పటికీ.. గ్రామీణ-పట్టణ పేదరికం, కొనుగోలు శక్తి అంతరం మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిలో.. భారతదేశ వృద్ధి స్థిరత్వంపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ఆయన ఏమంటున్నారంటే.. ఆదాయ అసమానతను తగ్గించడానికి విధానాలు కేవలం GDP పెంపుపై కాకుండా సమాన వనరుల పంపిణీ, ఉద్యోగ అవకాశాల విస్తరణపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈపోస్టు మీద పలువురు స్పందించారు. GDP పెరిగినా, పేదరికం తగ్గకపోతే ఆ అభివృద్ధి ప్రజలకు ఉపయోగం ఏమిటని చాలామంది ప్రశ్నించారు. ఆర్థిక అసమానతపై బహిరంగంగా మాట్లాడటానికి ఇలాంటి ఆర్థిక నిపుణులు ముందుకు రావడం అవసరమని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఏదేమైనా భారతదేశంలో వేగంగా పెరుగుతున్న ఆర్థిక అసమానత, ప్రపంచంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలతో పోలిస్తే కూడా ఆందోళనకర స్థాయికి చేరుకుందని విషయం ముత్తుకృష్ణన్ పోస్టు ద్వారా తెలుస్తోంది.
More From GoodReturns

Gold reserves: ఈ చిన్న దేశం కొంటున్న బంగారం చూస్తే కళ్లు చెదరాల్సిందే!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!



Click it and Unblock the Notifications