భారత జీడీపీ వృద్ధిరేటు 8.6 శాతం ప్రతికూలత: యూబీఎస్ అంచనా

భారత వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరంలో 8.6 శాతం మేర ప్రతికూలత నమోదు చేస్తుందని స్విస్ బ్రోకరేజ్ యూబీఎస్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. అంతకుముందు 5.8 శాతం ప్రతికూలత ఉంటుందని భావించింది. అయితే మొదటి క్వార్టర్‌లో మైనస్ 23.9 శాతం ఉండటంతో రేటింగ్ ఏజెన్సీలు తమ అంచనాలను సవరిస్తున్నాయి. భారత్ వృద్ధి పొటెన్షియల్ రేట్ కూడా 5.75 శాతం నుండి 6.25 శాతం మేర క్షీణిస్తుందని తెలిపింది. అంతకుముందు దీనిని 7.1 శాతంగా అంచనా వేసింది.

సెప్టెంబర్ త్రైమాసికం అనంతరం ఆర్థిక పునరుద్ధరణ మరింత ఉంటుందని యూబీఎస్ చీఫ్ ఇండియా ఎకనమిస్ట్ తన్వీ గుప్తా జైన్ అన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు లాక్ డౌన్ విధించడంతో మొదటి త్రైమాసికంలో జీడీపీ భారీగా తగ్గిందని భావించవచ్చునని చెప్పారు. అయితే ఇప్పటికీ కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. కేసుల్లో భారత్ రెండోస్థానంలో ఉంది.

Indias GDP to contract by 8.6 percent in FY21: UBS Securities

రికవరీ ఉన్నప్పటికీ అంటువ్యాధుల పెరుగుదల ఇబ్బందికరమేనని అభిప్రాయపడ్డారు. 2020-21ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు మైనస్ 8.6 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నామని, ఆ తర్వాత సంవత్సరం 10 శాతం వృద్ధి నమోదు చేస్తుందని తన్వీ గుప్తా జైన్ అన్నారు. రుణ స్థిరత్వం సవాల్ అన్నారు.

కరనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లకు పైగా ఆర్థిక ప్యాకేజీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో మరో ప్యాకేజీ అవసరమని తన్వీ గుప్తా జైన్ అభిప్రాయపడ్డారు. భారత్‌కు విశ్వసనీయమైన ఉద్దీపన ప్యాకేజీ అవసరమన్నారు. సంస్కరణలు కూడా అవసరమే అన్నారు.

వృద్ధి రేటు మైనస్ 9 శాతం

భారత జీడీపీ వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మైనస్ 9 శాతంగా ఉండవచ్చునని ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు(ADB) అంచనా వేసింది. జూన్ నెలలో మైనస్ 4 శాతంగా మాత్రమే అంచనా వేసింది. ఇప్పుడు సవరించింది. గత నాలుగు దశాబ్దాల్లో భారత ఆర్థిక వ్యవస్థ తొలిసారిగా వృద్ధి పతనాన్ని చవిచూడనుందని ఏడీబీ తాజా నివేదికలో పేర్కొంది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మాత్రం వృద్ధి రేటు 8 శాతంగా ఉంటుందని భావిస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+