రేటింగ్ ఏజెన్సీ ఇక్రా(ICRA) భారత వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 5 శాతం తగ్గించి 1 శాతం నుండి 2 శాతానికి పరిమితం చేసింది. ఈ మేరకు బుధవారం విడుదల చేసిన నివేదికలో సవరించింది. ఈ నివేదిక ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు త్రైమాసికాల్లో వృద్ధి రేటు మైనస్ 25 శాతం, మైనస్ 2.1 శాతం ఉంటుందని అంచనా వేసింది. మొదటి క్వార్టర్‌లో 16 శాతం నుండి 20 శాతం తగ్గుదల ఉండగా, రెండో క్వార్టర్‌లో 2.1 శాతం వృద్ధి ఉంటుందని తొలుత అంచనా వేసింది. ఇప్పుడు దీనిని సవరించింది.
లాక్ డౌన్ పొడిగింపు, కార్మికులు అందుబాటులో లేకపోవడం వంటి వివిధ కారణాలతో సప్లై చైన్ ఆలస్యమవుతుందని పేర్కొంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల రూ.21 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్యాకేజీ ప్రకటన అనంతరం ఇక్రా ఈ అంచనాకు వచ్చింది. జీడీపీలో 10 శాతంగా చెబుతున్న ఈ ఆర్థిక ప్యాకేజీ.. కరోనా మహమ్మారి వల్ల కలిగిన డిమాండ్ నష్టాన్ని ఎదుర్కోలేకపోవచ్చునని తెలిపింది. జీడీపీలో పది శాతంగా చెబుతున్నప్పటికీ ఈ ప్యాకేజీ అసలు 1 శాతం నుండి 2 శాతం అని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆర్థిక ప్యాకేజీలో తక్షణ ఉపశమన చర్యల కంటే లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత వివిధ రంగాలకు ఊతమిచ్చేలా చర్యలు ఉన్నాయని అభిప్రాయపడింది. కేంద్ర ప్యాకేజీ ప్రకటన ఒత్తిడిలో ఉన్న రంగాలకు క్రెడిట్ సౌకర్యం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాయని, లాక్ డౌన్ ఎత్తివేశాక కార్యకలాపాలు పునఃప్రారంభించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంది. అయితే ఇప్పటికే నష్టపోయిన రెండు నెలలకు సంబంధించిన ఊరట లేదని తెలిపింది.
ఈ ప్యాకేజీలో ఎన్నో సంస్కరణలు ప్రకటించారని, ఇది స్వాగతించబడినదేనని, అయితే ఇది తక్షణ ఊరటను ఇవ్వలేదని అభిప్రాయపడింది. మొదటి దశ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తే V షేప్ రికవరీ ఉంటుందని అంచనా వేసింది. కానీ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు W ఆకారపు రికవరీ ఉంటుందని పేర్కొంది. భారత్, ప్రపంచం భారీ సంక్షోభంలోకి వెళ్తోందని హెచ్చరించింది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

ఈస్టర్ 2026: గుడ్ ఫ్రైడే, పామ్ సండే, లెంట్ తేదీల పూర్తి వివరాలు ఇవిగో..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications