2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో భారత జీడీపీ వృద్ధిరేటు 16.5 శాతం మేర క్షీణించే అవకాశాలు ఉన్నాయని స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా (SBI) తన పరిశోధన నివేదిక ఎకోరాప్ తెలిపింది. ఏప్రిల్-జూన్ నెలలో 20 శాతం మేర వృద్ధి తగ్గవచ్చునని మే నెలలో అంచనా వేసింది. అయితే ఆర్థిక కార్యకలాపాలు తెరుచుకోవడంతో తాజాగా ఈ అంచనాలను స్వల్పంగా తగ్గించడం కొంతలో కొంత ఊరట కలిగించే అంశం. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో సానుకూల అంశాల నేపథ్యంలో దీనిని సవరించినట్లు సోమవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది.

కార్పోరేట్ రంగానికి సానుకూల అంశం
అయితే రియల్ జీడీపీ వృద్ధి రెండంకెలకు చేరుకోవడం ఆందోళన కలిగించే అంశమని ఎస్బీఐ ఎకనమిక్ రీసెర్చ్ డిపార్టుమెంట్ పేర్కొంది. మార్చి చివరలో లాక్‌డౌన్ ప్రారంభమైన సమయంలో ప్రస్తుత ఆర్థికసంవత్సరానికి 2.6 శాతంగా అంచనా వేసింది. ఆ తర్వాత 6.8 శాతం ప్రతికూలత నమోదు చేస్తుందని తెలిపింది. ఇప్పటి వరకు వెయ్యి వరకు లిస్టెడ్ కంపెనీలు క్వార్టర్ ఫలితాలు ప్రకటించాయి. ఇందులో 25 శాతం కంపెనీలు ఆదాయాల్లో, 55 శాతం కంపెనీలు లాభాల్లో క్షీణతను నమోదు చేశాయి. అయినప్పటికీ కార్పోరేట్ స్థూల విలువ జోడింపు-GVA(Gross Value Added) 14.1 శాతం తగ్గింది. జీవీఏ గణాంకాలు మెరుగ్గా ఉండటం కార్పోరేట్ రంగానికి సానుకూల అంశమని పేర్కొంది. వ్యయాల్లో మార్పులు చేర్పులతో ఆధాయాలు తగ్గాయని, మార్జిన్లపై ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చునని పేర్కొంది.

తెలంగాణ సహా ఈ రాష్ట్రాల్లో తలసరి నష్టం రూ.40,000 పైనే..
జీడీపీ నష్టంలో దేశంలోని టాప్ 10 రాష్ట్రాల వాటా 73.8 శాతంగా ఉంది. ఇందులో మహారాష్ట్ర వాటానే 14.2 శాతంగా ఉంది. తమిళనాడు 9.2 శాతం, ఉత్తర ప్రదేశ్ 8.2 శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలో తలసరి నష్టం రూ.27,000 నమోదు కావొచ్చునని అంచనా వేసింది. తమిళనాడు, గుజరాత్, తెలంగాణ, ఢిల్లీ, హర్యానా, గోవా తదితర రాష్ట్రాల తలసరి నష్టం ఏకంగా రూ.40,000 కంటే ఎక్కువగా ఉండవచ్చునని పేర్కొంది.

గ్రామాల్లోకి వ్యాప్తి
జూలై, ఆగస్ట్ నెలల్లో కరోనా గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా వ్యాప్తించింది. గ్రామీణ జిల్లాల్లో మొత్తం కేసులు ఆగస్ట్ నెలలో 54 శాతం పెరిగాయి. పది కంటే తక్కువ కేసులు ఉన్న గ్రామాల సంఖ్య తగ్గింది. ఈ జిల్లాలన్నీ ఆయా రాష్ట్రాలకు 2 శాతం నుండి 4 శాతం వరకు జీఎస్‌డీపీ వాటాను అందిస్తున్నారు. కరోనా కారణంగా మొత్తం జీఎస్‌డీపీలో 16.8 శాతం వరకు క్షీణత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
More From GoodReturns

ఈస్టర్ 2026: గుడ్ ఫ్రైడే, పామ్ సండే, లెంట్ తేదీల పూర్తి వివరాలు ఇవిగో..

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications