For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వచ్చే ఏడాది భారత జీడీపీ వృద్ధి రేటు 3.6 శాతానికి తగ్గింపు

|

కరోనా వైరస్, అలాగే, దీని వ్యాప్తిని నిరోధించేందుకు ఇండియా లాక్ డౌన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో వాణిజ్య, వ్యాపారాలు దాదాపు నిలిచిపోయాయి. ఈ ప్రభావం భారత వృద్ధి రేటుపై పడుతుందని రేటింగ్ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను భారత గ్రాస్ డొమెస్టికి ప్రొడక్ట్ (GDP)ని 5.5 శాతం నుండి 3.6 శాతానికి తగ్గించింది.

కరోనా ఎఫెక్ట్: క్లిష్ట పరిస్థితుల్లో కీలక నిర్ణయం, వారి శాలరీ 3 రెట్లు పెంపుకరోనా ఎఫెక్ట్: క్లిష్ట పరిస్థితుల్లో కీలక నిర్ణయం, వారి శాలరీ 3 రెట్లు పెంపు

భారత వృద్ధి రేటు లాక్ డౌన్ కొనసాగింపుపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ చివరి వరకు కొనసాగితే మరింత ప్రభావం ఉంటుందని అభిప్రాయపడింది. అయితే లాక్ డౌన్ పొడిగింపు అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. ప్రస్తుత లాక్ డౌన్ నేపథ్యంలో 2019-20 వృద్ధి రేటు అంచనాను 5 శాతం నుండి 4.7 శాతానికి సవరించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఫోర్త్ క్వార్టర్ వృద్ధి రేటు 3.6 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో (ఏప్రిల్-జూన్) వృద్ధి రేటు 2.3గా ఉంటుందని అంచనా వేసింది.

Indias FY21 GDP growth forecast to 3.6%

2020-21 మొదటి ఏడాది సగటు వృద్ధి రేటు 2.8 శాతంగా ఉంటుందని తెలిపింది. 2020-21 రెండో అర్ధ సంవత్సరం క్రమంగా వృద్ధి సాధించి 4.3 శాతానికి చేరుకుంటుందని తెలిపింది. దీంతో వచ్చే ఏడాది వృద్ధి రేటు 3.6 శాతంగా ఉంటుందని తెలిపింది.

భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం భారీగానే ఉందని పేర్కొంది. సరఫరా గొలుసు విచ్ఛిన్నమైందని, పర్యాటక, ఆతిథ్య, విమానయాన రంగాలు దెబ్బతిన్నాయని, ఉత్పాదక రంగానికి అంతరాయం ఏర్పడిందని, అలాగే, ఆరోగ్య సంరక్షణ భారం పెరుగుతోందని, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు నగదు ప్రవాహ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపింది.

పెట్టుబడిదారులు నగదు వెనక్కి తీసుకున్నారని, రూపాయి తీవ్ర ఒత్తిడికి లోనైందని ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ తెలిపింది. రబీ పంట చేతికొచ్చిన సమయంలో పంటకోతకు అంతరాయం కలిగిందని, వ్యవసాయ మార్కెట్లు సరైన సమయంలో క్లోజ్ కావడంతో రైతుల ఆదాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని తెలిపింది.

నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోవడంతో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నదని పేర్కొంది. కన్స్యూమర్ డ్యూరబుల్స్, వినోదం, క్రీడలు,హోల్ సేల్ మార్కెట్, పర్యాటక రంగం, ఆతిథ్య రంగం, మొదలైన డిమాండ్ తగ్గింది. చైనా ముడి సరుకుపై ఆధారపడిన ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, రసాయన ఉత్పత్తులపై ప్రభావం పడింది.

English summary

వచ్చే ఏడాది భారత జీడీపీ వృద్ధి రేటు 3.6 శాతానికి తగ్గింపు | India's FY21 GDP growth forecast to 3.6%

The spread of COVID-19 and the resultant nationwide lockdown that has crippled most economic and commercial activities, has led India Ratings and Research revise its FY21 GDP growth down to 3.6 percent from 5.5 percent.
Story first published: Monday, March 30, 2020, 19:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X