For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Forex: బంగారం సైతం పతనం: సగానికి దిగజారిన భారత విదేశీ నిల్వలు

|

ముంబై: భారత్‌లో విదేశీ మారక నిల్వలు క్షీణించాయి. ఇదివరకు వరుసగా రెండు వారాల పాటు ఆకాశానికెగబాకిన ఫారిన్ ఎక్స్చేంజ్ (ఫారెక్స్) ఇప్పుడు సగానికి పడిపోయాయి. ఏకంగా 208 మిలియన్ డాలర్ల మేర దిగజారాయి. ఈ విషయాన్ని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా వీక్లీ స్టాటిస్టికల్ సప్లిమెంట్ వెల్లడించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధికి సంబంధించినవి.. మిగిలిన ఫారెక్స్ నిల్వలన్నీ తగ్గుముఖం పట్టాయి.

కిందటి నెల 27వ తేదీన విడుదల చేసిన సప్లిమెంట్ ప్రకారం.. భారత్‌‌లో విదేశీ మారక నిల్వలు భారీ స్థాయిలో పెరిగాయి. అప్పట్లో విదేశీ మారక నిల్వలు 3.854 నుంచి 4.32 బిలియన్ డాలర్లకు పెరిగిన విషయం తెలిసిందే. ఇది ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయి. ఆస్తుల పెరుగుదల వల్ల మొత్తం నిల్వలు పెరిగాయని అప్పట్లో ఆర్బీఐ పేర్కొంది.

Indias forex reserves dipped gradually after two consecutive weekly rises

వారం రోజులు తిరిగే సరికి దీని విలువ గణనీయంగా తగ్గింది. 601.057 బిలియన్ డాలర్లు ఉండగా.. ఇందులో 306 మిలియన్ డాలర్లు తగ్గినట్లు ఆర్బీఐ వీక్లీ సప్లిమెంట్ తెలిపింది. ఇక ఆస్తుల విలువలో 208 మిలియన్ డాలర్లు క్షీణించాయి. ఇదివరకు 536.998 బిలియన్ డాలర్ల నుంచి 536.988కి తగ్గాయి.

బంగారం నిల్వలు సైతం భారీగా పడిపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 40.917 బిలియన్ డాలర్లుగా ఉన్న గోల్డ్ రిజర్వ్స్ ఈ నెల 3వ తేదీ నాటికి 40.843 డాలర్లకు క్షీణించాయి. 74 మిలియన్ డాలర్ల మేర విలువ చేసే బంగారం నిల్వలు తగ్గాయి. స్పెషల్ డ్రావింగ్ రైట్స్‌లోనూ ఈ క్షీణత కనిపించింది. ఇదివరకు 28 బిలియన్ డాలర్ల మేర ఉన్న ఎస్డీఆర్ విలువ 18.410 బిలియన్లకు తగ్గింది.

భారత్‌లో ఉన్న ఐఎంఎఫ్ నిల్వల విలువ మాత్రం స్వల్పంగా పెరిగింది. ఇందులో అయిదు మిలియన్ డాలర్ల మేర పెరుగుదల చోటు చేసుకుంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ రోజురోజూ పతనమౌతుండటం దీనికి ఓ కారణంగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తోన్నాయి. భారత్‌తో పాటు చైనా, జపాన్, కొరియా, జర్మనీ, ఇటలీ, మలేసియా, సింగపూర్, థాయ్‌లాండ్, తైవాన్, వియత్నాం, మెక్సికోల్లోనూ విదేశీ నిల్వలు తగ్గాయి.

English summary

Forex: బంగారం సైతం పతనం: సగానికి దిగజారిన భారత విదేశీ నిల్వలు | India's forex reserves dipped gradually after two consecutive weekly rises

After two consecutive weeks of increase, India’s foreign exchange (forex) reserves dropped by USD 306 million to USD 601.057 billion for the week ended June 3, as per RBI data.
Story first published: Saturday, June 11, 2022, 18:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X