కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు భారత్ కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల వృద్ధిరేటును వివిధ రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. భారత వృద్ధి రేటు మైనస్ 8 శాతం నుండి అంతకంటే ఎక్కువగా పతనం కానుందని పలు ఆర్థిక సంస్థలు, ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఐక్యరాజ్య సమితి భారత వృద్ధి రేటును మైనస్ 5.9 శాతంగా అంచనా వేసింది. ఈ మహమ్మారి సృష్టించిన అవరోధాల వల్ల 2020 సంవత్సరంలో వృద్ధి రేటు ఈ స్థాయికి(మైనస్ 5.9) పడిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో..
వచ్చే సంవత్సరానికి వృద్ధి రేటు 3.9 శాతానికి చేరుకోవచ్చునని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. కరోనా కేసులు అదుపులోకి రాకపోవడం, ఆర్థిక కార్యకలాపాలు అన్నిచోట్ల తెరుచుకోకపోవడం వంటి వివిధ కారణాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోనే కొట్టుమిట్టాడుతోందని ఐక్యరాజ్య సమితి తన ది ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ నివేదిక 2020లో తెలిపింది. ఈ సంవత్సరం ప్రపంచ వృద్ధి రేటు మైనస్ 4.3 శాతానికి క్షీణిస్తుందని అంచనా వేసింది. కరోనా వ్యాప్తికి ముందు ఆర్థికవేత్తలు అంచనా వేసిన దాని కంటే ప్రపంచ ఉత్పత్తి 6 లక్షల కోట్ల డాలర్లు తక్కువగా నమోదవుతుందని పేర్కొంది.

వాణిజ్యం.. పెట్టుబడులు.. రెమిటెన్స్.. క్షీణత
బ్రెజిల్, భారత్, మెక్సికన్ ఆర్థిక వ్యవస్థలు ఘోరంగా పతనమయ్యాయని, దానికి సమానంగానే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని తెలిపింది. దేశీయంగా ఉత్పత్తి క్షీణించడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని, అయిదింట ఒకవంతు మేర ఈ ఏడాది వాణిజ్యం క్షీణించవచ్చునని పేర్కొంది. విదేశీ పెట్టుబడులు నలభై శాతం మేర తగ్గవచ్చునని, అలాగే విదేశాల నుండి పంపించే రెమిటెన్స్ నిధులు 100 బిలియన్ డాలర్ల మేర తగ్గవచ్చునని అంచనా వేసింది. 2020లో సౌత్ఏసియా వృద్ధి 4.8శాతం మేర క్షీణించవచ్చునని అంచనా వేసింది. ఇందులో భారత జీడీపీ ఈ క్యాలెండర్ ఇయర్‌లో 5.9 శాతం ప్రతికూలత నమోదు చేయవచ్చునని తెలిపింది. సుదీర్ఘ లాక్ డౌన్ అనివార్యమైందని, దీంతో దీనివల్ల కార్యకలాపాలు నిలిచిపోయినట్లు తెలిపింది. 2021 క్యాలెండర్ ఇయర్‌లో మాత్రం పుంజుకుంటుందని వెల్లడించింది.

చైనా వృద్ధి అదుర్స్
అమెరికా జీడీపీ 5.4 శాతం ప్రతికూలత నమోదు చేస్తుందని అంచనా వేస్తోంది. 2021 ఏడాదిలో 2.8 శాతం వృద్ధి నమోదు చేస్తుందని తెలిపింది. చైనా ఈ ఏడాది 1.3 శాతం వృద్ధి, వచ్చే ఏడాది ఏకంగా 8.1 శాతం వృద్ధి రేటు నమోదు చేయవచ్చునని అంచనా వేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వృద్ధి చైనాలో ఉంటుందని అబిప్రాయపడింది. కరోనా కారణంగా మొదటి రెండు త్రైమాసికాల్లో 2008-2009 కంటే ఎక్కువ ఔట్‌పుట్ క్షీణించిందని తెలిపింది. 1930ల నాటి మాంద్యాన్ని గుర్తు చేస్తుందని వెల్లడించింది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications