భారత వృద్ధిరేటు 2020-21 ఆర్థిక సంవత్సరంలో మైనస్ 9శాతానికి క్షీణిస్తుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ తాజాగా అంచనా వేసింది. ఎస్ అండ్ పీ అంతకుముందు మైనస్ 5 శాతంగా అంచనా వేసింది. ఇప్పుడు దీనిని సవరించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో భారత వృద్ధిరేటు మైనస్ 23.9 శాతం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఇతర రేటింగ్ ఏజెన్సీలు వృద్ధి రేటును సవరిస్తున్నాయి. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వృద్ధి మరింతగా క్షీణించి మైనస్ 9 శాతంగా నమోదు కావొచ్చునని తెలిపింది.
అయితే 2021-22 ఆర్థిక సంవత్సరానికి పది శాతం వృద్ధి రేటును అంచనా వేసింది. కరోనా పరిణామాలతో ప్రయివేటు రంగ పెట్టుబడులు మున్ముందు తక్కువగానే ఉండవచ్చునని ఎస్ అండ్ పీ ఆసియా పసిఫిక్ ఆర్థికవేత్త విశ్రుత్ రాణా అన్నారు. అసంఘటిత రంగాలు ఇప్పటికీ పుంజుకోలేదని, చిన్న కంపెనీల నష్టాలు కొనసాగుతున్నాయని ఎస్ అండ్ పీ తెలిపింది.

కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. జూన్ నుండి క్రమంగా ఆర్థిక కార్యకలాపాలు తెరుచుకుంటున్నాయి. కరోనా కేసులు అక్టోబర్ నాటికి మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయనే అంశం ఆందోళన కలిగిస్తున్నాయి. ఆగస్ట్ నాటికి కరోనా కేసులు సగటున రోజుకు 70,000 ఉంటే, సెప్టెంబర్ 11 వరకు 90,000గా ఉంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications