కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలతో పాటు భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. సుదీర్ఘ లాక్ డౌన్ ప్రభావం మరింతగా పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21)లో భారత జీడీపీలో రుణాలు రూ.170 ట్రిలియన్లకు లేదా 87.6 శాతానికి పెరగవచ్చునని ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎకోరాప్ నివేదిక అంచనా వేసింది. ఈ నివేదికను గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్యకాంతి ఘోష్ ఆధ్వర్యంలో తయారయింది. ఈ నివేదిక ప్రకారం...

జీడీపీ పతనం.. జీడీపీలో రుణం 87.6 శాతానికి..
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో జీడీపీ వృద్ధి తగ్గడం, జీడీపీతో రుణ నిష్పత్తి పెరగడం అన్ని దేశాలను ప్రభావితం చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అధిక స్థాయిలో రుణాలు తీసుకోవడం వల్ల స్థూల రుణ మొత్తం జీడీపీలో రూ.170 ట్రిలియన్లకు (87.6 శాతం)కు చేరుకునే అవకాశం ఉంది. ఇందులో బాహ్య రుణాలు రూ.6.8 ట్రిలియన్లు లేదా జీడీపీలో 3.5 శాతంగా ఉండనున్నాయి. ఇందులో రాష్ట్రాల రుణ రేటు జీడీపీలో 27 శాతంగా ఉంటుందని అంచనా. మరో ముఖ్య విషయం ఏమంటే జీడీపీ సంకోచం కారణంగా జీడీపీ రేషియోలో రుణాలపై 4 శాతం మేర ప్రభావం పడనున్నాయి.

జీడీపీ-రుణ రేషియో
జీడీపీ-రుణ రేషియోను సులభంగా చెప్పాలంటే... భారత ప్రభుత్వ రుణాలు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ (జీడీపీ) మధ్య నిష్పత్తి. జీడీపీలో రుణ రేషియో తక్కువగా ఉంటే అప్పులు చేయకుండా అప్పులు తిరిగి చెల్లించడానికి సరిపోయే వస్తువులు, సేవలను ఉత్పత్తి చేసి విక్రయించే బలమైన ఆర్థిక వ్యవస్థకు నిదర్శనం.

ఎనిమిదేళ్లలో రుణాల పెరుగుదల
కానీ గత కొన్నేళ్లుగా జీడీపీతో పోలిస్తే రుణాలు పెరుగుతున్నాయి. 2011-12 ఆర్థిక సంవత్సరంలో రుణాలు రూ.58.8 ట్రిలియన్లు (జీడీపీలో 67.4 శాతం ఉండగా, 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.146.9 ట్రిలియన్లు(72.2 శాతం)కు పెరిగాయి. రుణాల్లో క్రమంగా పెరుగుదల ఉన్నప్పటికీ రుణస్థాయి దాదాపు స్థిరంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం విదేశీ మారక నిల్వలు బాహ్య రుణ బాధ్యతలను నెరవేర్చేందుకు సరిపోతాయని, అలాగే ఇంటర్నల్ రుణాలు పెద్ద సమస్య కాదని ఘోష్ అన్నారు.

పెరుగుతున్న రుణాలు..
కేరి రేటింగ్స్ చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవీస్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం జూలై 17, 2020న రూ.34,000 కోట్లను సమీకరించింది. జూలైలో ఇప్పటి వరకు తీసుకున్న రుణాలు రూ.1.02 ట్రిలియన్లు. నోటిఫై చేసిన మొత్తం కంటే ఇది రూ.12,000 కోట్లు అధికం. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం సమీకరించిన మొత్తం రూ.4.5 ట్రిలియన్లు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 66 శాతం అధికం. అలాగే కేంద్రం ఈ ఏడాది సవరించిన రూ.12 ట్రిలియన్లలో ఇది 37 శాతం. FY21 తొలి అర్ధ సంవత్సరానికి ఇది 64 శాతం.

FRBM టార్గెట్.. ఏడేళ్లు
FRBM (ఫిస్కల్ రెస్పాన్సిబులిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్) కమిటీ జీడీపీలో రుణాన్ని 60 శాతానికి చేరుకోవడానికి టార్గెట్‌ను 2022-23 ఆర్థిక సంవత్సరాన్ని నిర్దేశించింది. కానీ కరోనా మహమ్మారి భారీగా దెబ్బతీసింది. దీంతో ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మరో ఏడేళ్లు పడుతుందని, FY30లో మాత్రమే ఇది సాధ్యమని ఈ నివేదిక అంచనా వేసింది. కరోనా, లాక్ డౌన్ ప్రభావం భారీగా పడినట్లు ఈ నివేదిక తెలిపింది. ఎఫ్ఆర్‌బీఎం కమిటీ కేంద్రానికి ఈ టార్గెట్‌ను ఏడేళ్లు పొడిగించే అవకాశముందని తెలిపింది.
More From GoodReturns

Savings account: సేవింగ్స్ అకౌంట్ ఉంటే ఇన్ని లాభాలా? ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలివే!

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications